మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్: స్వంత నిధులతో బోరు బావి ఏర్పాటు..

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్: స్వంత నిధులతో బోరు బావి ఏర్పాటు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లోని 27వ వార్డు కౌన్సిలర్ నామ స్రవంతి రవికిరణ్ ఎన్నికల ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనే అసలైన రాజకీయ నాయకత్వం ఉంది” అని నిరూపించారు జహీరాబాద్లోని 27వ వార్డు కౌన్సిలర్ నామ స్రవంతి రవికిరణ్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో 27వ వార్డు ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఆమె స్వంత నిధులతో బోరు బావిని ఏర్పాటు చేయించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తానని కౌన్సిలర్ తెలిపారు. కాలనీ వాసులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

బిజెపి పార్టీ అభ్యర్థి గాదం రమను ఆశీర్వదించండి…

బిజెపి పార్టీ అభ్యర్థి గాదం రమను ఆశీర్వదించండి

గాదం లలిత బిజెపి మహిళా మోర్చా భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలలో భాగంగా 27వ వార్డు బిజెపి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గాదం రమణ కుమారి శోభ పోచయ్య గెలుపుకై ఇంటింటి ప్రచార నిర్వహించిన గాదం లలిత బిజెపి మహిళా మోర్చా భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నియోజకవర్గం ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి ఆశీస్సులతో బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గాదం రమ శోభ పోశయ్య కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో
లక్ష్మి మానస జ్యోతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version