షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత…

షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత

బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు.

జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరుపార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాల భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రమణారెడ్డి తెలిపారు. కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని, సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..

షబ్బీర్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం..!

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వేరే కారును తప్పించబోయి అనూహ్యంగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొనడంతో..

కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కొద్దిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కారు డ్రైవర్ వేరే కారును తప్పించబోయాడు. కానీ, అనూహ్యంగా డివైడర్‌ను ఢీకొని కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో షబ్బీర్ అలీ కారులో లేకపోవడంతో ఆయనకు అపాయం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ కొరకు స్థల పరిశీలన చేసేందుకు వచ్చిన మంత్రుల బృందంతో ఆయన కామారెడ్డి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ కారు ప్రమాదం చోటుచేసుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version