నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విఫలమవ్వడంతో ఎంఎస్ ధోని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే…

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ నితీశ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మరి..ధోనీ అభిమానులు నితీశ్‌ను టార్గెట్ చేయడానికి గల కారణం ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

LATEST

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

నల్లని మచ్చలు పోవాలంటే…?

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి

కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీ

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..

చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..

ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీన

అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్‌ షాతో మాట్లాడిన వెంకయ్య న

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ని

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

నల్లని మచ్చలు పోవాలంటే…?

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి

కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీ

నవతరం.. ‘అనలాగ్‌’ జపం!

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..

చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..

ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీన

అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్‌ షాతో మాట్లాడిన వెంకయ్య న

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ని

శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి భారీ అంచనాల మధ్య క్రీజులోకి వచ్చాడు. 23 పరుగులే రెండు కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని భావించినప్పటికీ.. నితీశ్ కేవలం 6 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఎస్ఆర్‌‌హెచ్ 29 పరుగుల వద్ద జాకబ్ డఫీ బౌలింగ్ అభినందన సింగ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ధోనీ ఫ్యాన్స్ నితీశ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. నితీష్ బ్యాటింగ్ టెక్నిక్‌ను ప్రశ్నిస్తూ.. నెట్టింట మీమ్స్, పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

ధోని అభిమానులు ఇంతగా సెటైర్లు వేయ్యడానికి కారణం నితీశ్ గతంలో ధోనీపై చేసిన వ్యాఖ్యలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. 2024లో ఓ ఇంటర్వ్యూలో నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ధోనీకి ప్రతిభ ఉంది కానీ టెక్నిక్ లేదని, విరాట్ కోహ్లీకి ఉన్నంత టెక్నిక్స్ ధోనీకి లేవంటూ కామెంట్ చేశాడు. ఆ సమయంలోనే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2026లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి విఫలమవ్వడంతో ధోనీ అభిమానులు ఆ పాత వీడియో క్లిప్‌లను, కామెంట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి టాలెంటెడ్ ప్లేయర్ అని మరికొందరు మద్దతు ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఒక్క మ్యాచ్ వైఫల్యం నితీశ్‌ను పాత వివాదంలోకి మళ్ళీ నెట్టేసిందని క్రీడా నిపుణులు అంటున్నారు.

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్..

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్

టీ20 ప్రపంచకప్‌ 2026 వివాదం నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌ మహమ్మద్‌ సలావుద్దీన్‌.. ఆదేశ మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌పై నిప్పులు చెరిగాడు. అతడు అబద్ధాలకోరు అంటూ విమర్శించాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026) నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్.. మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అతడు పచ్చి అబద్ధాల కోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌లో పర్యటించక పోవడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని తొలుత చెప్పిన నజ్రుల్..తర్వాత మాట మార్చాడు. ఇది ఆటగాళ్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నాడు. ఇక నజ్రుల్ యూ టర్న్ పై బంగ్లా అసిస్టెంట్ కోచ్ సలావుద్దీన్ ఫైర్ అయ్యారు.

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ…

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

 

హర్భజన్ సింగ్, శ్రీశాంత్ వివాదానికి సంబంధించి కాంట్రవర్షియల్ వీడియో విడుదల చేయడాన్ని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజం చెప్పిన తనపై అంత కోపం ఎందుకని శ్రీశాంత్ భార్యను ప్రశ్నించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌2008 సీజన్‌లో కలకలం రేపిన శ్రీశాంత్-హర్భజన్ సింగ్ వివాదానికి సంబంధించి ఎవ్వరూ ఇప్పటివరకూ చూడని వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇటీవల విడుదల చేయడం కలకలానికి దారి తీసింది. అయితే, లలిత్ మోదీ తన చర్యను సమర్థించుకున్నారు. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తనపై చేసిన విమర్శలు సబబు కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. తాను నిజం మాత్రమే చెప్పానని అన్నారు. హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న ఈ వీడియోను ఇటీవల మైఖేల్ క్లార్క్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ బయటపెట్టారు. దీనిపై మండిపడ్డ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి.. పాత గాయాలను ఎందుకు రేపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఆమెకు ఎందుకంత కోపమో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ పాడ్‌కాస్ట్‌లో ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా నిజమే చెప్పాను. గతంలో ఇలాంటి ప్రశ్న నన్నెవరూ అడగలేదు. క్లార్క్ ఈ విషయమై ప్రశ్న అడగగానే నేను సమాధానం ఇచ్చాను’ అని లలిత్ మోదీ జాతీయ మీడియాకు తెలిపారు. ఆ వీడియో తన వ్యక్తిగత సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ అని లలిత్ మోదీ క్లార్క్‌తో అన్నారు. ఆ సమయంలో బ్రాడ్ కాస్ట్ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయని చెప్పారు. 18 ఏళ్లుగా ఈ ఫుటేజీ తన వద్దే ఉందని అన్నారు. ఈ ఘటన తరువాత హర్భజన్ సింగ్‌పై మిగిలిన మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించినట్టు తెలిపారు.

ఇక లలిత్ మోదీపై మండిపడ్డ భువనేశ్వరి.. మైఖేల్ క్లార్క్‌పై కూడా ఫైరైపోయారు. ఇలాంటి పని చేసినందుకు ఆ ఇద్దరు సిగ్గుపడాలని అన్నారు. 17 ఏళ్ల నాటి గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారని ప్రశ్నించారు. శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌కు స్కూలుకెళ్లే వయసులోని పిల్లలు ఉన్నారని, ఈ వీడియో ఇరు కుటుంబాలకు వేదన మిగిల్చిందని చెప్పారు. ఇలాంటి వాళ్ల మీద కేసు పెట్టాలంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాగా, ఆ వీడియోను చాలా కొద్ది మంది మాత్రమే చూశారని క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే అన్నారు. అది ఐపీఎల్ తొలి సీజన్ కావడంతో వీడియోను బహిర్గతం చేయొద్దని అప్పట్లో నిర్ణయించినట్టు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version