ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్…

ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలో జరిగిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమం ఒక సాధారణ సేవా కార్యక్రమం కాదు… ఇది ఒక నాయకుడి దూరదృష్టి, పట్టుదల, గ్రామం పట్ల నిబద్ధతకు ప్రతీక.ఈ మహత్తర కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి –ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ గ్రామాభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు…కార్పొరేట్ సంస్థలను సంప్రదించి, ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిని వివరించి, అవసరాలను వివరంగా తెలియజేసి, ప్రతీ అంశాన్ని స్వయంగా పర్యవేక్షించి – ఈ భారీ సహాయాన్ని ఝరాసంగానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.295 బంక్ బెడ్‌లు.590 పరుపులు 4 మొబైల్ టాయిలెట్లు 130 ట్రంక్ బాక్స్‌లు 42 ఇనుప రాక్లు.కంప్యూటర్లు, ప్రింటర్లు, లైబ్రరీ సామగ్రి దోమతెరలు, ఫ్యాన్లు, బీరువాలు తదితర వసతి సామగ్రి ఇది సాధారణ సహాయం కాదు –ఇది వందలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే మహత్తర మార్పు..హాస్టల్ విద్యార్థులు ఇకపై నేలపై నిద్రపోవాల్సిన అవసరం లేదు పరిశుభ్రత మెరుగుపడుతుంది డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి
గ్రంథాలయ అభివృద్ధితో చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఇది అన్నీ సాధ్యమైంది ఎందుకంటే –
జగదీశ్వర్ గ్రామాన్ని తన కుటుంబంలా భావిస్తారు.
పదవి లేకున్నా సేవ ఆగలేదు…అధికారంలో లేకున్నా అభివృద్ధి ఆగలేదు గ్రామం కోసం ఆయన పోరాటం, పట్టుదల ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఝరాసంగం ప్రజల గర్వకారణం
సమాజ సేవకు మారుపేరు యువతకు ఆదర్శం
విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాకిరణం –
జగదీశ్వర్ ఇలాగే ఝరాసంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు

మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు…

మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ కళాశాల హాస్టల్ కు మంత్రి అడ్లూరీ లక్ష్మణ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన పై వారు విద్యార్థులతో మాట్లాడిన అనంతరం భూపాలపల్లి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్ ప్రజా సంఘాలు మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్, భూక్యా నవీన్ నాయకులు మాట్లాడుతూ వరుసగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు తరచూ ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థినిలపై దాడులు, కరెంటు షాక్ ఇతర సంఘటనల వల్ల అధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. కేవలం జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచూ ఇలాంటి ఘటన జరుగుతూ విద్యార్థులు ఆవేదన గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను కేటాయించినప్పటికీ ఎవ్వరు కూడా నెలలో కనీసం ఒక్కరోజు కూడా హాస్టలకు రాకపోవడం, వారి సమస్యలు తెలుసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అధికారులు,విద్యార్థి యువజన సంఘాలతో కమిటీ వేసి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. జిల్లాలో వారానికి ఒకసారైనా కలెక్టర్ ప్రతి ప్రభుత్వ హాస్టల ను పర్యటించాలని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version