యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా ప్రారంభం…

యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా ప్రారంభం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల బోరేగాం గ్రామంలో యేసుక్రీస్తు రక్షణ సువార్త సర్వ మానవాళికి పాప క్షమాపణ, నిత్యజీవం మరియు దేవునితో సమాధానాన్ని అనుగ్రహించే ఒక గొప్ప శుభవార్త. మానవులందరూ పాపం వల్ల దేవునికి దూరమయ్యారని, కానీ యేసు ప్రభువు సిలువ మరణం, పునరుత్థానం ద్వారా విశ్వాసముంచే ప్రతి ఒక్కరికీ రక్షణ, స్వస్థత మరియు విడుదల లభిస్తుందని ఇది బోధిస్తోంది. యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా సమావేశానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఝరాసంగం మండలం బోరేగాం గ్రామంలో ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా సమావేశంలో స్థానిక ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నాగేంద్రపాటిల్‌, అభిలాష్‌రెడ్డి, రవిపాటిల్‌, శివమణిపాటిల్‌, సోహెల్‌, అమృత్‌, జైరాజ్‌, ఇమ్రాన్‌, నాయకులు మాజీ సర్పంచ్‌ జగదీశ్వర్‌, నాగన్న, అడ్వకేట్‌ షకీల్‌, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం…

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

క్రిస్మస్ చెట్టు ఆశ, జీవితం, ఐక్యతకు ప్రతీక. సతత హరితంగా ఉండే ఈ చెట్టు చలికాలంలోనూ పచ్చగా ఉండి శాశ్వత జీవితం, స్థిరత్వాన్ని సూచిస్తుంది. చెట్టు అలంకరణ కుటుంబాలను కలిపే సంప్రదాయంగా మారింది. ఈజిప్షియన్లు, యూరోపియన్లు వంటి ప్రాచీన నాగరికతలు సతత హరిత చెట్లను ఉపయోగించేవారు. జర్మనీలో ప్రారంభమైన ఈ ఆచారం 19వ శతాబ్దంలో ఇతర దేశాలకు వ్యాపించింది. నేడు ఫెయిరీ లైట్లు చీకటిని, చెడును దూరం చేస్తాయన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version