న్యాలకల్ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు…

న్యాలకల్ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల అభివృద్ధికి ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ రూ.50 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో న్యాల్కల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి అదనంగా రూ.15 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి సోమవారం తెలిపారు.2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులతో మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలు, బోరు బావులు వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు త్వరలో ప్రారంభమవుతాయి. మొత్తం రూ.65 లక్షలు మంజూరు కావడంపై కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు.

నూతన వస్త్రాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్..

నూతన వస్త్రాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

బీదర్ జీరా కన్వెన్షన్ హాల్ లో జరిగిన డాక్టర్ రవీంద్ర పాటిల్ ( సన్రోహి హాస్పిటల్) గారి కూతురి నూతన వస్త్రాధన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని దీవించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,నాయకులు శంకర్ పటేల్ ,రేవన్నప్ప తదితరులు.పాల్గొన్నారు,

పైడిగుమ్మల్ లో మహిళా సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం…

పైడిగుమ్మల్ లో మహిళా సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. వార్డు సభ్యులు బందెల రెబుక ప్రశాంత్ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అండగా నిలుస్తున్నారని వారు తెలిపారు. భవన నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూస్తామని, త్వరగా పూర్తి చేసి మహిళా సంఘానికి అందజేస్తామని హామీ ఇచ్చారు.

లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అమ్మకాలు లేక…

లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అమ్మకాలు లేక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు జీవనాన్ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు కొనే నాథుడు లేక కనీసం పెండ్లికి భూమి అమ్మి కట్న కానుకలు సమర్పిస్తాం అనుకుంటే కూడా భూమి కొనేనాధుడు లేడు రైతులకు ఏదన్న రోగం వస్తే భూమి అమ్ముకొని ఆరోగ్యం నయం చేసుకుందాం అనుకుంటే కూడా భూములు కొనేనాథుడు లేక తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక లక్షలాది కుటుంబాలు రోడ్డు పాలు కావడమే కాకుండా రియల్ ఎస్టేట్ మొత్తాన్ని జీరో చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వం లో లక్షలాది కుటుంబాలు రెండు పూటల అన్నం తినడమే కాకుండా ఇతర కుటుంబాలకు కూడా సాయం చేసే పరిస్థితుల్లో ఉండేవారు కానీ ప్రభుత్వం వచ్చాక అప్పు అడుగుతే కూడా ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు కెసిఆర్ చెప్పినట్టు మోసపోతే గోసపోతారు అని బాపు కేసీఆర్ చెప్తే కూడా తెలంగాణ ప్రజలు వినలేదు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎంత పెద్ద తప్పు చేసాము అని మళ్లీ కెసిఆర్ ఏ రావాలి మన రియల్ ఎస్టేట్ నడవాలంటే పార్టీలకు సంబంధం లేకుండా కెసిఆర్ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలి రియల్ ఎస్టేట్ చేసే రియల్ ట్రైలర్లకు కనీసం పిల్లలు చదువుకుంటున్న ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే వారి కుటుంబాలు రోడ్డు పలు అవుతున్నారు ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రియల్ ఎస్టేట్ రిటైలర్లు కు ఉపాధి కలగాలంటే మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగాలి ఈ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీయడం అనే కాకుండా ఎందుకు రియల్ ఎస్టేట్ మీద దృష్టి సాధించడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రైతులు మరియు డాక్యుమెంట్ రైటర్లు షెటర్ రెండు కట్టలేని పరిస్థితి ఉన్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మరియు రెవిన్యూ ఆఫీసులు యధావిధిగా కొనసాగాలంటే రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోవాలి,

చిన్న సినిమా బృందం కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకుంది

చిన్న సినిమా బృందం కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకుంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం మండలం, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం చిన్న సినిమా బృందం స్వామివారిని దర్శించుకుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మహమ్మద్ జాంగిర్, డైరెక్టర్ ఎస్కే శివలింగ్, కెమెరామెన్ డి.ఓ.పి శివ గౌడ్ ఎల్లంకి, ప్రదీప్, రవి తదితరులు పాల్గొన్నారు. సినిమా బృందాన్ని ఆలయ నిర్వాహకులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వినోద్ బాలరాజ్, మాజీ సర్పంచ్ జగదీశ్వర్ మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య…

మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం హద్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చాల్కి సమీపంలో గల మంజీర నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దోమ సుజిత్ తెలిపారు. నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన పాపయ్య ముదిరాజ్ నారాయణఖేడ్ బస్సు డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అని తెలిపారు. శుక్రవారం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరిన పాపయ్య మంజీర నది సమీపంలోకి వచ్చి కూతురితో బంధువులతో మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో కాల్ ద్వారా తెలియపరిచాడు. బంధువులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరేసరికి పాపయ్య మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆయన మృతదేహం లభించలేదు శనివారం సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని శవాన్ని తీశామని ఎస్సై తెలిపారు తర్వాత పంచనామా నిర్వహించి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించామన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

పైకి కనిపించని బలంతో బీఆరఎస్

· కాంగ్రెస్ గెలుపు వెనుక దాగున్న అసలు నిజం
· బీఆరఎస్‌కు ఇంకా గట్టి పట్టు
· కాంగ్రెస్ విజయం అంకెల గారడీ మాత్రమే
· ఇప్పటికీ కాంగ్రెస్‌ను ఢీకొట్టే స్థితిలో బీఆరఎస్
· కేసీఆర్, రేవంత్‌లు తిట్ల పురాణంలో దిట్టలు
· ఎంత తిడితే అన్ని ఓట్లు పెరుగుతాయనే ట్రెండ్ పెరిగే ప్రమాదం
· రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న తెలంగాణ సెంటిమెంట్
· పనితీరుపై ఆధారపడే పార్టీలకు ఓట్లు
· ప్రజల ఓటింగ్‌లో కనిపిస్తున్న సరికొత్త పరిణితి
· పార్టీలు దీన్ని గుర్తిస్తున్నాయా?
· గుర్తించిన పార్టీలకే భవితవ్యం
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90కి పైగా మున్సిపాలిటీల్లో ఘనవిజయం సా ధించినట్టు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించినప్పుడు ఇది నిజమైన గెలుపా లేక పైకి కనిపి స్తున్న వాపా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. రాష్ట్రంలోని 123 (116G7) పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 3వేల వార్డుల్లో కాంగ్రెస్ గెలుచుకున్నవి 1537. అంటే యాభై శాతం కంటే కొద్దిగా ఎక్కువ. కానీ కైవసం చేసుకున్న మున్సిపాలిటీల సంఖ్య 90 దాటుతోంది. అంటే ఇవన్నీకాంగ్రెస్ వాస్తవ బలాన్ని సూచించవనేది సుస్పష్టం. మొత్తం కాంగ్రెస్ ఆధీనంలోని మున్సిపాలిటీలను పరిశీలిస్తే రేవంత్ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడం సహజం. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో 1181 వార్డుల్లో విజయం సాధించిన బీఆరఎస్ ఈసారి 781కే పరిమితం కావడం కూడా పై అభిప్రాయానికి బలం చేకూర్చే అంశం. నిజంగా బీఆరఎస్ కుప్పకూలిపోయిందా, కాంగ్రెస్ ఎవరూ ఓడించని స్థాయిలో బలపడిందా? అన్న అంశాలను పరిశీలించాలి. వీటిని పరిశీలించే ముందు 30`40 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించలేదన్న సత్యాన్ని గుర్తిస్తే, గెలిచిన పార్టీది నిజమైన బలమా లేక ఓడిన పార్టీది వాస్తవ ఓటమా అన్నది స్పష్టమవుతుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 40.1% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 39.4% ఓట్లు సాధించిందంటే స్వల్పంగా ఓట్ల శా తం తగ్గిందని తెలుస్తుంది. అదేవిధంగా ఇవే ఎన్నికల్లో బీఆరఎస్ కేవలం 16.7% ఓట్లు సాధించగా మున్సిపల్ ఎన్నికల్లో 28.76%కు ఓటింగ్‌శాతం పెరిగింది. చూడటానికి కొంత విచిత్రం గా వుండవచ్చు కానీ, ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైంది. ఇది ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జరిగిన 84% పోలింగ్ కంటే తక్కువ, గత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 66% కంటే ఎక్కువ! దీన్ని బట్టి చూస్తే ఓటర్ల మనోగతం స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మారుతోంది. అంటే స్థానిక ఎన్నికల్లో స్థానిక సమస్యలకు, అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ సమస్యలకు, లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే పరిణితిని ఈ తరం ఓటర్లు ప్రదర్శిస్తున్నారనుకోవాలి. మరో కీలక అంశమేమంటే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో 171 మందిఇండిపెండెంట్లు గెలవడం! అంటే ఇక్కడ పార్టీకంటే పనిచేసే నాయకుడి సామర్థ్యం కూడా కీలకపాత్ర పోషిస్తుందనేది సుస్పష్టమవుతోంది. ఇక హైదరాబాద్ వంటి నగరాలో ఓటింగ్ 50శాతం కంటే తక్కువ వుంటుండగా గ్రామీణ ప్రాంతాల్లో 80`90శాతం వరకు నమోదవుతోంది. తక్కువ ఓటుశాతం నమోదవడం పట్టణప్రాంత ఓటర్లలో నెలకొన్న బద్ధకం లేదా నిర్లిప్తత కారణం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు, మద్యం పంపిణీ స్థానిక నేతలకు అంతా తెలిసి వుండటం వంటి కారణాలను చెప్పవచ్చు. కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.4% ఓట్లు సంపాదించగా బీఆరఎస్ ఓట్లశాతం 37.3%. అంటే రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా దాదాపు రెండు శాతం మా త్రమే. అదే మున్సిపల్ ఎన్నికల్లో 39.8% ఓట్లు సాధిస్తే బీఆరఎస్‌కు 28.7% ఓట్లు పడ్డాయి. ఇక్కడ దాదాపు 11% ఓట్ల తేడా కనిపిస్తోంది. అదే గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.1% ఓట్లు వస్తే బీఆరఎస్‌కు కేవలం 16.7% మాత్రమే వచ్చాయి. అంటే 2024 ఎన్నిక కు ఇప్పటికి పోలీస్తే బీఆరఎస్ 12% ఓట్లను పెంచుకోగలిగింది. ఈ విశ్లేషణను పరిశీలిస్తే బీఆరఎస్ ఓటమి శాశ్వతం కాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పుంజుకునే అవకాశాలు మెండుగా వున్నాయన్నది స్పష్టమవుతుంది.
ఇక మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే 2020లో 100కు పైగా మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆరఎస్ ఇప్పుడు కేవలం 13కే పరిమితమైంది. అదే కాంగ్రెస్ స్కోరు 90 దాటింది. గత రెండు మూడు దశాబ్దాల క్రితం నాటితో పోలిస్తే ఓటర్లలో పరిణితి స్థాయి గణనీయంగా పెరి గిందనేది పోలింగ్ విశ్లేషణలను పరిశీలిస్తే తెలుస్తుంది. అంటే గుడ్డిగా ఒక పార్టీకి విధేయులుగా మెలిగే అలవాటు నుంచి ఓటర్లు క్రమంగా దూరమవుతున్నారు. ఈ మున్సిపల్ ఓట్లలో కాంగ్రెస్ కు 39.8% ఓట్లు, బీఆరఎస్‌కు 28.7% ఓట్లు రాగా బీజేపీకి 15.7% ఓట్లు రావడాన్ని గమని స్తే, కాంగ్రెస్, బీఆరఎస్‌లను ఇప్పటికీ స్థానిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రజలు విశ్వసి స్తున్నారన్నది అర్థమవుతుంది. ఇక బీజేపీని ఇంకా జాతీయస్థాయి పార్టీగా, స్థానిక సమస్యలు దానికి పెద్దగా పట్టవన్న ఉద్దేశంతో ఓటర్లు వున్నారనుకోవాల్సి వస్తుంది. అంటే ఒక్కసారైనా బీజేపీ రాష్ట్ర అధికార పగ్గాలను చేపడితే ఓటర్లలో దానిపట్ల వున్న అభిప్రాయంలో తప్పనిసరిగా మార్పు వచ్చితీరుతుంది. మరో గుర్తించాల్సిన విషయమేంటంటే 2014`2018 మధ్యకాలంలో రాష్ట్రంలోతెలంగాణ ఉద్యమ ప్రభావం బలంగా కొనసాగింది. దాదాపు పధ్నాలుగేళ్లపాటు కేసీఆర్ నాయక్తవంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమం రేకెత్తించిన తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం అప్పటి వరకు బాగానే వుంది. కానీ తర్వాతి కాలంలో సెంటిమెంట్ స్థానాన్ని “పనితీరు ఆధారంగా” ఓటువేసే ప్రవత్తి పెరిగింది. అంటే అధికారంలో వున్నప్పుడు బీఆరఎస్ ఏమీ చేయలేదని కాదు. దేశంలోనే మొట్టమొదటిసారి రైతుబంధు ప్రవేశపెట్టిన ఘనత ఆ పార్టీదే. అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలోనే పూర్తిచేసిన అద్భుత సామర్థ్యం కూడా కేసీఆర్ నాయకత్వానిదే. మిషన్ భగీరధ కేసీఆర్ చేపట్టిన పథకాల్లో కలికితురాయి వంటిదనే చెప్పాలి. ఇదే సమయంలో తెలంగాణ సాధకుడిగా తనకిక తిరుగులేదని భావించడం, అధికారానికి ఢోకా వుండబోదన్న ధీ మాకు వెళ్లడం కేసీర్ చేసిన పెద్దతప్పు. ఫామ్ హౌజ్ పాలన, మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ దొరకని దుస్థితి ఆయన రాచరిక పాలనకు చిహ్నంగా మారి, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి ఆకాశాన్నంటి, బీఆరఎస్‌ను పాతాళానికి తొక్కేశాయి. ఎదిగిన కొద్దీ ఒదగని మనస్తత్వం ఆయనతో పాటు కేసీఆర్‌ను నమ్ముకున్న పార్టీని దెబ్బతీశాయి. ఇక్కడ దెబ్బతీశాయనేదానికంటే, ప్రజలు ఒక్కసారి తమ శక్తి ఏమిటో ఆయనకు రుచి చూపించారనుకోవాలి.
విచారించాల్సిన విషయమేంటంటే ఇప్పుడు రేవంత్ కూడా సరిగ్గా ఇదే మాదిరి వ్యవహారశైలిని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త పథకాల మాదిరిగానే తిట్ల పురాణాన్ని కూడా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కగా, దీన్ని పరాకాష్టకు తీసుకెళ్లిన ఘనత రేవంత్‌కే చెందుతుంది. కేసీఆర్ త ప్పిదాలు, బీఆరఎస్‌లోని అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పజెబితే ఇ ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోంది. కాంగ్రెస్ శైలి కప్పలతక్కెడ రాజకీయాలు లేకపోయినప్పటికీ, పార్టీలో పైకి వినిపించని అసమ్మతి రాగాలు, రేవంత్ ఛరిష్మా ీVA రులో ఎవరికీ వినిపించడంలేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో తన స్థాయి ఛరిష్మా గల నాయకుడు మరొకరు లేకపోవడం రేవంత్‌కు కలిసొచ్చిన అంశం. అధిష్టానానికీ ఆయన తప్ప మరో దిక్కులేదు. ఇన్ని సానుకూలతల మధ్య కేసీఆర్ తిట్లపురాణాన్ని రేవంత్ మరోస్థాయికి తీసుకెళ్లినా ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఎంత గట్టి గా తిడితే అన్ని ఓట్లు రాలతాయన్న తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదముంది. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ కూడా తిట్ల పురాణంలో దిట్టగా పేరుపడ్డారు. అంటే తెలంగాణ రాజకీయాలు…సైద్ధాంతిక విభేదాలు, ఉద్యమ రాజకీయాల స్థాయిని దాటి తిట్ల స్థాయికి చేరుకున్నాయి. ఇదెంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఇక కాంగ్రెస్‌లో మిగిలిన నాయకుల్లో కూడా రేవంత్ లేకపోతే పార్టీ మనుగడ వుండదన్న అభిప్రాయం ఏర్పడిందో ఏమో కానీ, మంత్రులంతా రేవంత్ భజన చేయడంలో పోటీపడుతున్నారు. ఇది తెలుగుదేశం, బీఆరఎస్, డీఎంకే, అన్నాడీఎం కే వంటి ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో వరుసగా దెబ్బతింటూ, పైకి లేవలేని స్థితిలో వున్న కాంగ్రెస్, తెలంగాణలో జవజీవాలు కల్పించిన రేవంత్‌ను వదులుకోలేని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇదే పరిస్థితి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ది. కమ్యూనిస్టు నాయకత్వం ఆయనకు తý£గ్గాల్సిదే తప్ప ఆయన మాత్రం ‘తగ్గేదే లేదు’ అంటున్నారు. దీంతో పోలిట్ బ్యూరో తన ప్రాభవాన్ని కోల్పోయింది. తర్వాతి కాలంలో రాహుల్ తన వ్యవహారశైలి మార్చుకోకపోవడం, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ యధాప్రకారం ఓటమి చవిచూడటం జరిగితే, రేవంత్ కూడా పినరయి విజయన్ పంథాల్లో వెళ్లకూడదనేం లేదు. కాంగ్రెస్‌లో అధిష్టానాన్ని ధిక్కరించినవారు శంకరగిరి మాన్యాలు పట్టిపోవడమే మనకు ఇప్పటివరకు తెలుసు. ఇప్పుడు రే వంత్ అధిష్టానానికి అదే రుచిచూపిస్తే? అప్పుడు ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్న సామెత నిజమైందనుకొని మౌనంగా ఎవరి పనిలో వారు నిమగ్నం కావడం తప్ప చేసేదేమీ వుండదు.

మల్లన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆంజనేయులు…

మల్లన్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆంజనేయులు

శేరిలింగంపల్లి , నేటి ధాత్రి

 

అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మిస్తున్న మల్లన్న గుడి నిర్మాణ పనులను స్థానిక నాయకులు ఆంజనేయులు సాగర్ శనివారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, ఆలయ ప్రాశస్త్యాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు సాగర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక విలువల కేంద్రాలని పేర్కొన్నారు. మన డివిజన్‌లో ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని, ఆలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లన్న గుడి కమిటీ అధ్యక్షులు బసవరాజు, సిద్దిక్ నగర్ కాలనీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, నాయకులు యాదయ్య గౌడ్, గోపాల్ గౌడ్, సంతోష్, రాము యాదవ్, రాము, సాగర్, ఆనంద్ మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రేపటి నుంచి బడంపేట రాచన్న స్వామి దేవాలయ జాతర…

రేపటి నుంచి బడంపేట రాచన్న స్వామి దేవాలయ జాతర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేట గ్రామ శివారులోని రాచన్న స్వామి దేవాలయ జాతర ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శివ రుద్రప్ప శనివారం తెలిపారు.
22న రుద్రాభిషేకం, ధ్వజారోహణ, 23న ప్రత్యేక పూజలు, 24న కళ్యాణోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.

దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం…

దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్,30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి లకు ఘన సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/RsmS54EeUj0?si=qaU9jG1pqADv4jvH

 

*నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతామని చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ హామీ ఇచ్చారు.పట్టణంలోని 30 వార్డులో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు అధ్యక్షతన నూతనంగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పెండెం లక్ష్మీ రామానంద్,అదే వార్డు కౌన్సిలర్ మాదాసి రవి, మహిళా కౌన్సిలర్లు వేల్పుల శ్రీలత బాణాల ప్రసన్న కుమారి లను వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని దళిత వార్డులను మోడల్ వార్డులుగా తీర్చిదిద్దుతానని , వేసవి కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు.వార్డులలో డ్రైనేజీలు సిసి రోడ్లు విద్యుత్తు సరఫరా నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తానని , అర్హులైన వారికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు.పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ మా తాత పెండెం కట్టయ్య కాలము నుండి నేటి వరకు 30 వ వార్డుతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు.వార్డు ప్రజల అవసరాలు మరియు వార్డు సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉంటానని అన్నారు.
నర్సంపేట పట్టణ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.30 వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి మాట్లాడుతూ వార్డు ప్రజలమంతా ఒక కుటుంబం అని కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు.వార్డులో నీటి సమస్య పట్ల బోర్లు ఏర్పాటు చేయాలని, డ్రైనేజ్ కాలువలు సిసి రోడ్ల నిర్మాణం వంటి పనులు ఉన్నాయని అవి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు నాగేల్లి సారంగం ,మాజీ వార్డ్ మెంబర్ కొయ్యడి సంపత్ సీనియర్ నాయకులు దూడల సాంబయ్య,గద్ద సంజీవ, గద్ద శ్రీనివాస్ గద్ద జ్యోతి, నూనె పద్మ, కోమటి సరోజన, జానకమ్మ, గద్ద అఖిల్, నూనె బన్ను, గద్ద నీ ఖిల్, తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మికి వినతిపత్రం సమర్పణ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణ నూతన విలీన గ్రామం మహేశ్వరంలో ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు హల్టింగ్ ఇవ్వాలని డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చాలా మంది ఉద్యోగం,విద్యా,వైద్య నిమిత్తం హన్మకొండ, హైదరాబాద్ కి వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులు ఆగడంలేదు ఇందువలన నర్సంపేటకి వచ్చి బస్సు ఎక్కడం అవుతుందని తెలిపారు. అలాగే రాత్రి సమయాల్లో హన్మకొండ నుండి నర్సంపేటకి వచ్చే బస్సులు మహేశ్వరం వద్ద ఆపటం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి సమస్యకి పరిష్కారం చూపించి అన్ని బస్సులు ఆపే దిశగా చూస్తాఅని హామీ ఇచ్చారు. బస్సులు ఆపకుంటే అలాగే డిపో సమాచారం నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. వినతిపత్రం అందచేసిన వారిలో కౌన్సిలర్లు మాతృ రాథోడ్,భూస శిరీష-రాజు,గ్రామస్తులు చెన్న భాస్కర్,బేతం అఖిల్,చిదురాల చక్రపాణి ,మోర్తాల రాజు,బొల్ల శ్రీకాంత్, చెన్న గణేష్,చేరాల ప్రదీప్,భూక్య సాయి కళ్యాణ్ పాల్గొన్నారు.

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా…

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్..

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

పార్టీలకతీతంగా ఎలాంటి భేషజాలం లేకుండా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఎన్నికల్లో 30 స్థానాలకు గాను 21 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయఢంకం మోగించి మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ,వైస్ చైర్మన్ గా గంధం నరేందర్ ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ మున్సిపాలిటిటీ కార్యాలయంలో హట్టహాసంగా పదవిబాధ్యులు చేపట్టారు.ముందుగా నూతన బాధ్యతలు చేపట్టేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ తో పాటు కౌన్సిలర్లకు కమిషనర్ కాటా భాస్కర్ సిబ్బందితో కలిసి స్వాగతం పలికారు.వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య మున్సిపల్ చైర్ పర్సన్ ,వైస్ చైర్మన్ లు పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి బోకెలతో సత్కరించారు.అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.వార్డుల అభివృద్ధి కోసం కౌన్సిలర్లు,అధికారుల సహకారంతో పార్టీలకతీతంగా పట్టణ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేరుస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.వైస్ చైర్మన్ గంధం నరేందర్ మాట్లాడుతూ తన వార్డుతో పాటు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తునని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బత్తిని రాజేందర్,మాదాసి రవి,
వేముల సంధ్య సాంబయ్య గౌడ్,ఎలకంటి విజయ్ కుమార్,కొత్తకొండ మేఘన,కొంపల్లి వీణ,ముత్తినేని వెంకన్న,పొన్నాల మనిషా, చీకటి స్వరూప,ఇస్లావత్ రామ గోపి,భూక్య మత్రు రాథోడ్,ఏపూరి శ్రీనివాస్ రెడ్డి,అయూబ్ ఖాన్,శ్రీ రామోజీ రోజారాణి,బాణాల ప్రసన్న,వేల్పుల శ్రీలత,ములకల వినోద,
పున్నం నరసింహారెడ్డి బీరం భరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం…

*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం…

*పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పని చేయండి…

జనసేన ఇన్ చార్జీ దేవర మనోహర్ పిలుపు

చంద్రగిరి(నేటి ధాత్రి:

 

 

చంద్రగిరిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శనివారం పార్టీ ఇన్
చార్జీ దేవర మనోహర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారని చెప్పారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమం గా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని తెలిపారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యం. అలాంటి వారే పార్టీకి అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల అధ్యక్షులు మురళి, దూది జస్వంత్,కిషోర్,గురు,హరి ,తిరుపతి రూరల్ మండల ఇంచార్జ్ యువరాజ్,చంద్రగిరి మండల ఉపాధ్యక్షులు రాకేష్ మరియు సాదక్ నాయకులు,నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

వర్తక సంఘము భవనంలో వైద్య శిబిరం ప్రారంభిస్తున్న రామకృష్ణ సుమన్..

వర్తక సంఘము భవనంలో వైద్య శిబిరం ప్రారంభిస్తున్న రామకృష్ణ సుమన్

వాసవి క్లబ్ అద్యరములో

వనపర్తి నేటిధాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో వర్తక సంఘం భవనం ము లో డాక్టర్ మనోహర్ లోయ రాజస్థాన్ డాక్టర్లచే మోకాళ్ల నొప్పులకు కీళ్ల నొప్పులకు నడుము నొప్పులకు తుంటినొప్పులకు గ్యాస్ట్రో బిపి షుగర్ పక్షవాతం ఇంకా 100కు పైగా వ్యాధులకు 5 రోజులపాటు వైద్యం అందిస్తున్నామని వాసవి క్లబ్ అధ్యక్షులు ఆకుతోట రాఘవేందర్ తెలిపారు వాసవి క్లబ్ జిల్లా ఇంచార్జీ కొట్ర రామకృష్ణ మాట్లాడ తూ పాలమూరు రాయచూరులో అక్కడ ఆర్యవైశ్య లు ఈ మెడికల్ ఏర్పాటు క్యాంపు ఏర్పాటు చేశారని పరీక్షలు చేసుకొని డాక్టర్ల సూచనలు పాటించా రని చెప్పారు మనము ఆరోగ్య ము మన తోనే ఉంటుందని యోగ ధ్యానము వాకింగ్ చేయాలని సూచించారు వర్తక సంఘం అధ్యక్షులు పాలా ది సుమన్ మాట్లాడుతూ వనపర్తి లో వర్తక సంగం భవనంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు ఆకుతోట రాఘవేందర్ క్లబ్ నిర్వాహకులను అభినందించా రు వర్తక సంఘము భవనంలో నిర్వహించే మెడికల్ క్యాంపుకు కిరాణా వ్యాపారులు పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాలని అదేవిధంగా డాక్టర్లచే సూచనలు సలహాలు పాటించాలని ఆయన కోరారు ఎలాంటి మందులు మెడిసిన్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాసవి క్లబ్ నేతలు దాచ హరీష్ చిగుళ్ల పల్లి కార్తిక్ గోల్డ్ క్లబ్ అధ్యక్షురాలు కొంపల రజిత ప్రధాన కార్యదర్శి పాపిశెట్టి రాధిక కోశాధికారి ప్రశాంతి లక్ష్మి వర్తక సంఘం నేతలు కొండ కిషోర్ వై వెంకటేష్ దోమశివ
వర్తక సంఘము సీనియర్ నేత ఆర్ టి కొండ బాలకృష్ణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు

గెలిచిన కౌన్సిలర్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది….

గెలిచిన కౌన్సిలర్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది….

బిఆర్ఎస్ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తుంది….

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

సింగరేణి, పోలీస్ అధికారులు తస్మాత్ జాగ్రత్త….

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సిపిఐ పార్టీ ప్రలోభాలకు లొంగదు…

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి అన్ని వార్డుల్లో పోటీ చేసి 14 సీట్లు కైవసం చేసుకున్నా సరే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని, గెలిచిన కౌన్సిలర్లను వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కౌన్సిలర్ల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

11వ వార్డు లో గెలిచిన కౌన్సిలర్ బొమ్మ భూమయ్య గౌడ్ ఇంటి సమీపంలోకి సింగరేణి అధికారులు వచ్చి అట్టి భూమి సింగరేణికి సంబంధించిందని, సూచిక బోర్డులు పాతి భూమయ్య గౌడ్ భార్యను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధు, సిపిఐ కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామకృష్ణాపూర్ లోని కౌన్సిలర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.కౌన్సిలర్ భార్యకు మనోధైర్యాన్ని అందించారు.అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తోందని దుయ్యబట్టారు. సిపిఐ పార్టీ కౌన్సిలర్లను బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్న సరే ఎక్కడ కూడా కౌన్సిలర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ బెదరకుండా ముందడుగు వేస్తున్నారని అభినందించారు. క్యాతన్ పల్లి మునిసిపాలిటీ చైర్మన్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేసి అక్రమంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసులు పెట్టి జైలుకు పంపించారని, అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలయ్యిందని అన్నారు. బిఆర్ఎస్, సీపీఐ నాయకులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

దాడులకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కేసులు ఎందుకు పెట్టలేదో పోలీసులు తెలిపాలని అన్నారు. పోలీస్ శాఖ పూర్తిగా విఫలమయిందని, అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడి లకు తలొగ్గి కౌన్సిలర్ల కుటుంబాలపై ఒత్తిడి తీసుకొస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి, స్థానిక మంత్రికి ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సిపిఐ పార్టీ ఎలాంటి ప్రలోభాలకు లొంగదని , పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, సిపిఐ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పనులను ప్రారంభించిన కౌన్సిలర్ మహ్మద్ రఫీ..

పనులను ప్రారంభించిన కౌన్సిలర్ మహ్మద్ రఫీ..

జహీరాబాద్ నేటి ధాత్రి;

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ మార్గదర్శకత్వంలో, జహీరాబాద్‌లో వీధి దీపాల ఏర్పాటు కల్వర్టులను శుభ్రపరచడం వంటి స్థానిక మౌలిక సదుపాయాల మెరుగుదలలు జరిగాయి. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన. వార్డ్ నంబర్ 14 కౌన్సిలర్ మహ్మద్ రఫీ దీనిని పర్యవేక్షించారు. ఎంఐఎం నాయకత్వంలో జహీరాబాద్‌లో వీధి దీపాలు హై-మాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం కీలకమైన కార్యకలాపాలలో ఒకటి అని పేర్కొన్నారు. స్థానిక అభివృద్ధి పనుల్లో భాగంగా, కల్వర్టులను శుభ్రం చేసి, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కౌన్సిలర్ మహ్మద్ రఫీ ఛైర్మన్‌ను అభ్యర్థించారు.

మళ్లీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే…

మళ్లీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే…

ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. అలానే వ్యూయర్ షిప్ కూడా విపరీతంగా ఉంటుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్, పాక్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ క్రమంలో మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగితే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మరోసారి భారత్, పాక్ తలపడనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వివాహం జరుగుతున్న కుటుంబానికి 50 కేజీల బియ్యంఅందజేత….

వివాహం జరుగుతున్న కుటుంబానికి 50 కేజీల బియ్యంఅందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లిమండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని కెసిఆర్ కాలనీలో. జరుగుతున్న పెండ్లికి బియ్యం అందజేసిన సర్పంచ్. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని కేసీఆర్ నగర్ ఐదవ వార్డులో జరుగుతున్న పెళ్లికి. మెరుగు వెంకటేశం కూతురు వివాహం జరుగుతుండగా గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్. తమ వంతు గా. అమ్మాయి పెళ్లికి గాను 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్ గడ్డం రచన మధుకర్. ఈ సందర్భంగా అమ్మాయి పెళ్లి జరుగుతున్న సందర్భంగా వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసి వారు జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించి మా వంతు సహాయంగా బియ్యం అందజేయడం జరిగిందని. ఆ దేవుడు దయవల్ల అందరూ సుఖసంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు భరత్. VOA. శ్యామల. లాస్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు. కుసుమ హేమంత్. బైరిరమేష్. సుంకరి శ్రీనివాస్. బూర్లసాయి కృష్ణ. కాజా. మల్లికార్జున. సిద్ధి రాములు. రవి. కృష్ణ. ప్రసాద్. కవిత. లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం…

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో యువజన సంఘాల సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచి గాధగోని సాగర్ ఆధ్వర్యంలో యువజన సంఘాల సమావేశం నిర్వహిస్తూ. ప్రతి గ్రామంలో గ్రామాలు అభివృద్ధి జరగాలంటే గ్రామ యువత సహకరించాలని యువత చదువుతోపాటు గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి జరగాలంటే యువజన సంఘాల పాత్ర కీలకమని. ప్రతి గ్రామంలో అభివృద్ధి . యువజన పథంగా. యువజన సంఘాలు ఏర్పరచుకొని అందులో యువత పాలుపంచుకుంటూ చదువుతోపాటు గ్రామాన్ని అభివృద్ధితో పాటు అన్ని విషయాలు ప్రజలకు సంబంధించి కార్యక్రమాలు చేపడుతూ. అభివృద్ధి పథంలో ముందు ఉంచే బాధ్యత యువజన సంఘాలపై ఎక్కువగా ఉంటుందని. దీనిపై ప్రతి గ్రామంలో యువత యువకులు గ్రామ ప్రజలు అందరూ సహకరించి అభివృద్ధి పథంలో ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం..

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

 

తంగళ్ళపల్లి మండలం గోపాలరావు.పల్లి గ్రామంలో. ప్రభుత్వం. ప్రత్యష్టకముగా. ప్రవేశపెట్టిన. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఈరోజు .గోపాలరావు.పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేయడం జరిగిందని అందులో భాగంగా గోపాలరావుపల్లి గ్రామంలోని కొండవీటి .లావణ్య .అనిల్. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని అందులో ఈరోజు లబ్ధిదారులు గృహప్రవేశం చేయడం జరిగిందని. ఎందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ మా చిరకాల స్వప్నం సొంత ఇంటి కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తూ మాకు ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లురావడానికి నిర్మాణానికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. జలగం ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. ఇందిరమ్మ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఎంసి. డైరెక్టర్ .కలిపెల్లి.తిరుపతిరెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు.కడారి సునీల్ రెడ్డి. మండల నాయకులు మీరాల శ్రీనివాస్. యాదవ కమిటీ సభ్యులు కొండ వీని రవి. ఎడ్ల ప్రేమ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version