విజయఢంకా మోగించిన నూతన సర్పంచ్ లు.

విజయఢంకా మోగించిన నూతన సర్పంచ్ లు

నడికూడ,నేటిధాత్రి:

మండలంలో నూతనంగా గెలపొందిన సర్పంచులు కౌకొండ గ్రామా సర్పంచ్ గా ఓదెల శ్రీలత భాస్కర్ బిఆర్ఎస్,సర్వపూర్ గ్రామ సర్పంచ్ గా భోగి శ్రీలత కాంగ్రెస్,ధర్మారం గ్రామ సర్పంచ్ గా భాషిక ఎల్లస్వామి కాంగ్రెస్, రామకృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ గా పెండ్లి లక్ష్మీరాజు కాంగ్రెస్,నడికూడ గ్రామ సర్పంచ్ గా కుడ్ల మలహల్ రావు కాంగ్రెస్,రాయపర్తి గ్రామ సర్పంచ్ గా రాజ జగత్ ప్రకాష్ కాంగ్రెస్,నర్సక్కపల్లి గ్రామ సర్పంచ్ గా కోడెపాక ముత్యాలు బిఆర్ఎస్, చర్లపల్లి గ్రామ సర్పంచ్ గా బండి రేణుక శంకర్, బిఆర్ఎస్,ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ గా మేకమల్ల వెంకటేష్ ఇండిపెండెంట్, చౌటుపర్తి గ్రామ సర్పంచ్ గా ఓదెల రూప సమ్మయ్య కాంగ్రెస్,పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ ఐలోని బిఆర్ఎస్,వరికోల్ సర్పంచ్ దొగ్గేల కుమారస్వామి బిఆర్ఎస్, నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్ యాదవ్ కాంగ్రెస్, కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతి కాంగ్రెస్, గెలుపొందారు.

కాంగ్రెస్ నూతన సర్పంచులకు ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి సన్మానం..

కాంగ్రెస్ పార్టీ నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానం చేసిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి నియోజకవర్గంలో 1 వ విడత 2 వ విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించినందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు . చిన్నపాక రాములు సవాయిగూడెం సురేష్ కాసిం నగర్ కుడికిల కుడికిల్ల వెంకటేష్ చిమన గుంటపల్లి నీలమ్మ తూర్పు తాండ సాలమ్మ బాలు పెద్దగూడెం తాండ జయమ్మ రూప్ సింగ్ నాచహుల్లి అబ్దుల్లా దత్తాయిపల్లి వెంకటయ్య మంజుల శ్రీశైలం వీరితో పాటు ఉప సర్పంచ్ లను వార్డు సభ్యులను ఎమ్మెల్యే మెగారెడ్డి సన్మానం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా ఎన్నికైన వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు అండగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచ్ లకు వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు

నూతన సర్పంచ్లకు ఎమ్మెల్యే మాణిక్తేవు శుభాకాంక్షలు..

నూతన సర్పంచ్లకు ఎమ్మెల్యే మాణిక్తేవు శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను ఎమ్మెల్యే మాణిక్తావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జీర్లపల్లి అమరేశ్వరి శివమణి, గూడ్పల్లి సుదర్శన్రెడ్డి, చిలెమామిడి జైరాజ్, కంబాలపల్లి రాజు, నర్సాపూర్ జైపాల్రెడ్డిలను అభినందించారు. గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version