సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం: కేటీఆర్

పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావువ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్: పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) వ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరని చెప్పుకొచ్చారు. తరతరాలపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించే ప్రణాళికలే నిజమైన నాయకుడి పనితనమని తెలిపారు కేటీఆర్.

ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాంటి నాయకుడు కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా రెండు అద్భుత ఫలితాలను తెలంగాణ ఈరోజు సాధించిందని ఉద్ఘాటించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు మరో జీవన సాక్ష్యమని నొక్కిచెప్పారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేయడంతో.. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి, వ్యవసాయ భూమికి సాగునీరు అందుతోందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలోని మరో అద్భుతం యాదాద్రి థర్మల్ ప్లాంట్. దామరచర్ల అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్ వన్‌లో 72 గంటల కోడ్ (COD)ని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ పాలన, విజన్ మా అందరికీ గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ ముందుచూపుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం: హరీష్‌రావు

కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలంగా చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తెలిపారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి నీళ్లు అందించడంతో రైతులు కేసీఆర్ కృషిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు విలువ ఏమిటో ఇప్పుడు అనుభవంలోకి వచ్చిందని అన్నారు. నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్ చిత్తశుద్ధితో చేసిన కృషికి సీతారామ ప్రాజెక్టు ఓ సజీవ సాక్ష్యమని ఉద్గాటించారు. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసినట్లే, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని రేవంత్ ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్‌రావు కోరారు.

కమిటీలకు దిక్కు లేదు..కార్యకర్తలకు గుర్తింపు లేదు!

`వాళ్ల కష్టానికి ఫలితం లేదు.

`అన్ని పార్టీలది అదే తీరు.

`ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు.

`ఏళ్లకేళ్లు వెట్టి చాకిరి చేయించుకుంటారు.

`కడుపు కట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పని చేస్తారు.

`జెండాలు కట్టడానికి, నాయకులకు సలాం కొట్టడానికి పనికొస్తారు.

`సభలు పెడితే జేజేలు కొట్టడానికి అవసరౌతారు.

`పథకాల అమలులో కూడా వివక్షకు గురౌతారు.

`సొంత పార్టీ వాళ్లకే ప్రయోజనమౌతుందని కార్యకర్తలను పక్కన పెడతారు.

`ఓట్లేయించేందుకు మాత్రమే కార్యకర్తలు అవసరమౌతారు.

`పార్టీ కోసం ఏం ఆశించకుండా పని చేస్తారని గొప్పలు చెప్పి నోరు మూయిస్తారు.

`అడుగడుగునా మాయ చేసి చెప్పు చేతుల్లో వుంచుకుంటారు.

`నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు.

`సొంత పార్టీలలోనే కార్యకర్తలు శత్రులయ్యేలా చేస్తారు.

`నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.

`గ్రామ, మండల కమిటీలు వేయకుండా కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు.

`కమిటీలెప్పుడు వేసినా పదవి నీకే అని అందరికీ చెప్పి కాలయాపన చేస్తారు.

`పై స్థాయిలో వున్న వాళ్లు ఒక్కొక్కరు నాలుగు పదవులు చేపడతారు

`కుటుంబంలో వున్న వాళ్లకు పదవులు పంచుకుంటారు.

………………………..

`పదేళ్లు అధికారంలో వున్నా ‘‘బిఆర్‌ఎస్‌’’ కార్యకర్తలు బతికింది లేదు.
`అప్పుల పాలై దివాళా తీసినా ఒక్కరినీ ఆదుకున్నది లేదు.
`నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవించింది లేదు.
`కనీసం పార్టీ కమిటీలు వేసి పదవులు అప్పగించింది లేదు.
`ఇప్పటికీ ‘‘బిఆర్‌ఎస్‌’’ కమిటీలు వేయాలన్న సోయి లేదు.
……………………….
`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావొస్తోంది.
`పార్టీ కమిటీలకు దిక్కు లేదు..
`పూర్తి స్థాయిలో నామినేట్‌ పదవులు పంచింది లేదు.
…………………..
`బిజేపి ఇందుకు తీసిపోయిందేమీ లేదు.
`ఆ పార్టీ అనుసరిస్తున్నది అదే తీరు.
`మూడు పార్టీలలో కమిటీలకు దిక్కు లేదు.
`ఎన్నికల పేరు చెప్పుకొని నాయకులు ఎగేసుకొస్తారు.
`గెలిపించే బాధ్యత మీదే అని కార్యకర్తలను ఆకాశానికెత్తురు.
`మీరు లేకుండా పార్టీయే లేదని ఉబ్బిస్తారు.
`ఎన్నికలైపోయిన తర్వాత ముఖం చాటేస్తారు.
`కార్యకర్తలు కరివేపాకులు..రాజకీయాలలో గోలించి పడేస్తారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయ నాయకులు, కార్యకర్తలు అనగానే ఖద్దరు చొక్కాలు. రేబాన్‌ కళ్లజోళ్లు. కాళ్లకు ఖరీదైన చెప్పులు. అయితే టూవీలర్‌, లేకుంటే కారు. కాలు తీసి బైట పెడితే చాలు గౌరవాలు. మర్యాదలు. పైరవీలు. ప్రజ సమస్యలు. అబ్బో ఆ సెటప్పే వేరు. కనిపించిన వాళ్లను పలకరించడం. వారికి టీలు తాగిపించడం. అవసరమైతే టిఫిన్లు చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం అదో సంతర్పణ కార్యక్రమం. ఇదంతా ఎలా? అనుకుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేంత దుఖం. కాని పైకి మాత్రం చెరగని చిరునవ్వు. నోరు తెరిస్తే కోట్ల రూపాయల రియల్‌ వ్యాపారం మాటలు విన పక్కవాళ్లు అబ్బో అనుకోవాలి. అంతే కాని అబ్బా..అనేలా వుండకూడదు. అలా మెంటైన్‌ చేయకపోతే నాయకుడే కాదు. కార్యకర్త కూడా కాదు. కాని ఇంత హడావుడి చేస్తున్నా ఆయా రాజకీయ పార్టీలలో వారి పదవులు ఏమిటని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే కొంచెం వయసు చిన్నదైతే కార్యకర్త. కాస్త పెద్ద వయసైతే సీనియర్‌ కార్యకర్త. ఇక వాళ్లు పార్టీల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కేక వేస్తే చాలు జీ హుజూర్‌ అని వాలిపోవాల్సిందే. చేతులు కట్టుకొని నిలడాల్సిందే. నోరు నొచ్చేదాకా ఆ పార్టీ నాయకులు జేజేలు కొట్టాల్సిందే. పార్టీ కండువాలు మెడలో వేసుకొని, జెండా కూడా మోయాల్సిందే. ఇంతగా పార్టీకి సేవ చేస్తున్నా పదవులు ఇస్తారా? ఇస్తాం..ఇస్తామంటూ ఊరిస్తారు. పుణ్యకాలం పూర్తయ్యేదాకా వాయిదా వేస్తూ వెళ్లాల్సిందే. అధికారంలో వున్నప్పుడు నాయకులు ఊడిగం చేయాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి రక్షణ కవచాలు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తానికి పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మారిపోవాలి. ఇంతకు మించి రాజకీయం అంటే చెప్పుకోవడానికి ఏదీ వుండదు. పార్టీ పేరు చెప్పి బతికే కొంత మంది లైక్యం తెలిసిన కారకర్తలుంటారు. చిన్నా చితక పైరవీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. నాయకులు చెప్పి పనులు చేయించుకుంటారు. ఇది కూడా ఏ ఐదు శాతమో వుంటారేమో? కాని మిగతా నాయకులంతా జేజేలు కొట్టడం మాత్రం చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పదవి రాకపోతుందా? అని జీవితాంతం ఎదురు చూస్తుంటారు. జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయిన వాళ్లు కొన్ని లక్షల మంది వుంటారు. కడుపు కట్టుకొని పార్టీకి సేవ చేస్తుంటారు. అప్పులు చేసిన పార్టీ కోసం పనిచేస్తుంటారు. ఆస్ధులు అమ్ముకొని రాజకీయాల్లో సాగుతుంటారు. ఇంత చేస్తున్నా నాయకులకు సలాం కొట్టడానికి మాత్రమే వుంటారు. నాయకుడు ఫోన్‌ చేస్తే క్షణాల్లో వాలిపోతారు. నాయకుడు కదలమని చెప్పేదాకా అక్కడే పడిగాపులు కాస్తారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం కాదు. నాయకులకు ఊడిగం చేయడం. సరే ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలనైనా కార్యకర్తలకు అందుతాయా? అదీ వుండదు. ఎందుకంటే అడుక్కుంటే చులకనౌతాడు. పట్టుబట్టి తీసుకుందామంటే నాయకుల ఆగ్రహానికి గురౌతారు. మనం పంచే స్దితిలో వున్నాం. అడుక్కుంటామా? అని చెప్పే నాయకుల మాటలకు తలవంచేవాళ్లుంటారు. సర్ధుకుపోయే మనస్తత్వమే అలవాటు చేసుకుంటారు. పథకాలు పార్టీ కార్యకర్తలకే పంచుకుంటున్నారన్న అవపాదు మోయొద్దని నాయకులు చెప్పే మాటలు విని ఆశలు చంపుకుంటారు. ఇది అన్ని పార్టీలలో వుండే కార్యకర్తల దీనస్ధితికి నిదర్శనం. కనీసం పార్టీ పదవులు ఇచ్చారా? అంటే అదీ లేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల కాలం అదికారంలో వున్నా ఇప్పటి వరకు సంస్ధాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు. మాటలకు మాత్రం 60లక్షల మంది కార్యకర్తలున్నారని గొప్పగా చెబుతారు. కాని ఎంత మంది కార్యకర్తలకు పదవులిచ్చారన్నది చెప్పరు. ఇప్పటికీ గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు పదవుల పంపకాలు లేవు. పదేళ్ల అదికారంలో నామినేటెడ్‌ పదువులు కొద్ది మందికి తప్ప పూర్తిగా ఇచ్చింది లేదు. నాయకుల ఇంట్లో ఒక్కొక్కరికి నాలుగు పదవులు పంచారు. అదే కుంటుంబంలో నలుగురున్నా పదవులు పంచారు. కాని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలకు ఆఖరులోకూడా పదవులు పంచలేదు. వారి జీవితాలను నిలబెట్టలేదు. కార్యకర్తలంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే వాళ్లుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో జనాన్ని పోగేసుకునేందుకు పడే అవస్దలు కార్యకర్తలతో తీర్చుకుంటున్నారు. వారిని కూరలో కరివేపాకులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చిన కష్టాలు పగ వాడికి కూడా రాకూడదనుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులకు కూడా పదవులు లేదు. గుర్తింపు లేదు. కొత్త నీరుకు పెద్దగా పని లేదు. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చామన్న సంతోషమే తప్ప, పదువులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అనుకుంటూ ఇప్పటికీ ఏడాదిన్న కాలం చూస్తుండగానే కరిగిపోయింది. పార్టీ అదికారంలోకి వస్తే అంతా ఇక మా కాలామే..మా రాజ్యమే అనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పదవుల రాక యాతన పడుతున్నారు. కనీసం చెప్పుకోవడానికిపార్టీ పదవులు కూడా ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగలేదు. మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదరుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదవులు అందుకుంటామనుకున్నారు. కాని రెండేళ్ల దగ్గర పడుతున్నా ఎదరు చూపులు తప్పడం లేదు. ..పదవులకోసం పడిగాపులు తప్పడం లేదు. అదికారంలోకి వచ్చి ఏడాదిన్నరౌతుంటే ఆశలు ఆవిరౌతాయేమోనన్న ఆందోళనలో వున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో రియల్‌ వ్యాపారం కూడా సాగడం లేదు. కాంగ్రెస్‌ నాయకులకు ఆ రకంగా కూడా కలిసి రావడం లేదు. రేవంత్‌ సర్కారు తీసుకొస్తున్న కొన్ని సంస్కరణల మూలంగా వున్న ఉపాధి కూడా పోయిందని రియల్‌ వ్యాపారం చేసే కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భూముల అమ్మకాలు,కొనుగోలు ఆగిపోయింది. భూములు కొనాలంటేనే జనం భయడిపోవాల్సి వస్తోంది. వారికి భరోసా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు కొంత బాగు పడ్డారు. భూ భారతి వచ్చినా, కాంగ్రెస్‌ నాయకుల సమస్యలు తీరడం లేదు. వారికి ఏదీ కలిసి రావడం లేదు. దాంతో పార్టీపరమైన పదవులు వచ్చినా చెప్పుకోవడానికి ఒక హోదా వుంటుందని అనుకుంటున్నా అవీ రావడం లేదు.ద అన్ని స్దాయిలో నాయకులకు ఎప్పుడొస్తాయో పదవులు అని ఎదురుచూస్తున్నారు. పైగా తమకు వస్తాయా? లేక ఇతరులకు వస్తాయా? కూడా అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎక్కడిక్కడ నాయకులనే నిలదీసేంద ధైర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలు అందక, పార్టీ పరమైన పదవులు అందక, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేతికి రాక ఆర్ధికంగా నాయకులు చితికిపోతున్నారు. అప్పుల పాలౌతున్నారు. చిన్నా చితక కాంట్రాక్టులు వచ్చిన బాగుండని అనుకుంటున్నారు. పల్లెల్లో మొరం పనులు కూడా రాక సతమతమౌతున్నారు. రోడ్డెక్కితే వందలు ఖర్చవున్నాయి. నాయకులు చుట్టూ తిరిగేందుకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. నాయకులు మాటలు నమ్మి తిరిగాల్సిన పరిస్తితి ఎదురౌతోంది. ఇంట్లో కూర్చోలేరు. చేతిలో వున్న పైకం ఖర్చు చేసుకుంటూ సాగలేరు. ఇక పదవులు, పదువులు అని కలవరిస్తూ, ఏ కార్యక్రమం పెట్టినా పై స్దాయి కాంగ్రెస్‌ నాయకులకు ఎదురీతలు తప్పడం లేదు. కార్యకర్తల ప్రశ్నలు ఎదుర్కొ తప్పించుకునే పరిస్దితి లేదు. ఇక కాంగ్రెస్‌ అంటేనే గ్రూపులు. ఆ గ్రూపుల మధ్య సమన్వయం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చినా కష్టాలు తీరడం లేదని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. అధికార పార్టీలో నాయకులుగా వుంటూ కూలీ చేసుకోలేరు. ఊరికి పరిమితమై వుండలేరు. నాయకుల పర్యటనల్లో పాలు పంచుకోక వుండలేరు. ఎక్కడా పనులు లేవు…చేతికి పైకం అందింది లేదని మదనపడుతున్నారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అధికారంలోవున్నామన్న మాటే కాని అణా సంపాదన లేదంటూ నిట్టూర్చుతున్నారు. . ఖర్చులు మాత్రం ఆగడం లేదు..కార్యకర్తల పోషణ తప్పడం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికొచ్చి కార్యకర్తలు విసుక్కుంటున్నారు. మంత్రుల మందే నాయకులు తిట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నాయకులు కొట్లాడుకుంటున్నారు. సెక్యూటిరీని కూడా నెట్టేసుకుంటే కష్టాలు చెప్పుకుంటున్నారు. గందరగోళంలో పార్టీ శ్రేణులు. స్దానిక సంస్దల ఎన్నికలు రావడం లేదు..పదువుల అందుతాయా అన్నదిగులు. అధికారంలోవున్న మాటే గాని, సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. బిజేపి నాయకులు, కార్యకరర్తల పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా అదే పరిస్దితి. కార్యకర్తలకు పదవులు ఇచ్చింది లేదు. కేంద్రంలో పార్టీ అదికారంలోవున్నా గ్రామీణస్దాయి నాయకులకు నామినేటెడ్‌ పదవులు పంచింది లేదు. కార్యకర్తలు కూరలో కరివేపాకులు..రాజకీయాల్లో గోలించి పడేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఎన్నిక చేశారు. మండల అధ్యక్షులుగా చుక్క రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగె నరసింగారావు, ఇంగోలి రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అజ్మీర రవీందర్ నాయక్, ఉపాధ్యక్షులు కామశోభన్ బాబు, నల్ల వెంకటయ్య, కార్యదర్శి అమ్మ రోహిత్, ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, కోశాధికారి జంగిలి రవి, కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పల్లి విరాట్, గిన్నె స్వామి,రేవూరి వెంకట్ రెడ్డి,యార రవి, నల్ల యాదవ రెడ్డి, ఎర్ర ఆదిరెడ్డి, వేములపల్లి ఓదేలు, పుపాల శ్రీను, పరుపాటి ప్రభాకర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు..

గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీలకు మండల స్థాయి బాధ్యతలు చేపట్టి ఎంపీపీ,సర్పంచ్ పదవులను చేపట్టి సేవలను అనుభవం కలిగిన వ్యక్తిగా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ కు గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాయంలో దుగ్గొండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.అలాగే తెలుగుదేశం పార్టీ దుగ్గొండి మండలం అధ్యక్షుడిగా సుమారు 15 ఏళ్ల పాటు పనిచేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలుపు కృషి చేశారు. కాగా చుక్క రమేష్ గౌడ్ దుగ్గొండి మండలంలో అన్ని గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు సన్నిహితంగా ఉంటారు. గత శాసనసభ ఎన్నికల్లో రమేష్ గౌడ్ చేసిన కృషి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పైస్థాయి సీట్లను సాధించగలిగే సత్తా ఉండడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
గుర్తించి దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్..

అనతి కాలంలోనే తనపై నమ్మకంతో దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారని,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుల సహకారంతో పార్టీని దుగ్గొండి మండలంలో పూర్తిస్థాయిలో బలోపేతం చేయడానికి
తన వంతుగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు. దేశంలోని ఎక్కడలేని విధంగా కులగనన చేపట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల బాబు పలువురు నాయకులకు చుక్క రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ టౌన్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో శనివారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు
న్యాల్కల్ మండలం సంగమేశ్వర్ -న్యాల్కల్
(₹55,000/-) నర్సింహులు- కాకిజన్వాడ
(₹24,000/-) అశ్విని – హద్నూర్
(₹60,000/-) మాణిక్ – కాకిజన్వాడ
(₹60,000/-)మొత్తం ₹ 199,000 /- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ కార్యక్రమo లో అశ్విన్ పాటిల్,రాజేంద్ర,జగన్నాథ్ రెడ్డి,వేంకట్ రెడ్డి,వెంకట్, సందీప్,ఫయీమ్, ఇస్మాయిల్,సందీప్ రెడ్డి, సునీల్ రెడ్డి మరియు లబ్దిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః

మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే విన‌తి

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 12:

పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా తిరుప‌తిలో నూత‌నంగా ప‌ది విద్యుత్ స‌బ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం కోరారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తిరుప‌తికి వ‌చ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విన‌తి ప‌త్రం ఇచ్చారు. జ‌న‌భా పెరుగుద‌ల‌తో విద్యుత్ విన‌యోగం పెరిగింద‌ని భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ఠ్యా విద్యుత్ స‌ర‌ఫ‌రా మెరుగుద‌ల‌కు 33 / 11 కేవి స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆ విన‌తి ప‌త్రంలో ఎమ్మెల్యే కోరారు. మ‌హిళా యూనివ‌ర్శిటీ, ఆర్సీ రోడ్డు, కొర‌మేణుగుంట‌, తుడా ట‌వ‌ర్స్ వ‌ద్ద త‌క్షిణం స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటుకు మంత్రి అంగీక‌రించారు.అలాగే బైరాగిప‌ట్టెడ‌,జీవ‌కోన‌, రామ‌చంద్ర‌పుష్క‌రిణి, శెట్టిప‌ల్లి, క‌పిల‌తీర్థం, అర్బ‌న్ త‌హ‌శిల్దార్ కార్యాల‌య స‌మీపంలో కూడా స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటు చేయాల‌ని కోర‌గా త్వ‌ర‌లోనే వీటి నిర్మాణానికి ఏపిఈఆర్సీ అనుమ‌తి ఇస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు మంత్రి స్ప‌ష్టం చేశారు.

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

నల్లబెల్లి, నేటిదాత్రి:

కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి చిట్యాల తిరుపతి రెడ్డికి మరోసారి మండల అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్,, కర్దూరి కట్టయ్య ఎన్నికయ్యారు.

ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.

ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్

కోటగిరి సతీష్ గౌడ్ టేకుమట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ప్రకారం నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ కేబినెట్ మంత్రి వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పాల సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జిఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం. ఈ సందర్భంలో ఇంత గొప్ప పార్టీలో ఒక బీసీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని సతీష్ గౌడ్ తెలిపారు.గత అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి,అన్ని పార్టీలతో మంతనాలు జరిపి రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేలా చొరవ చూపిన మంత్రులు,ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యా, ఉద్యోగరంగం తో పాటు రాజకీయంగా,ఇతర అన్ని అంశాల్లో బీసీ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తే ఎంతో ఉన్నతి చెందుతారని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయించి ఫలాలను అందించేలా కృషి చేయాలని అన్ని పార్టీల నేతలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి మండలికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంజరిగింది.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్ మాజీ మండల వైస్ చైర్మన్ విడిది నేని అశోక్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర్ ఎండి చోటే మియా గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ, బత్తిని శివశంకర్ గౌడ్ పోశాల మహేష్ మామిళ్ల మల్లికార్జున్ మామిళ్ల మల్లేష్ అశోక్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గాంధారి మైసమ్మ ముఖ ద్వారం ఏర్పాటు..

గాంధారి మైసమ్మ ముఖ ద్వారం ఏర్పాటు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియా సింగరేణి సహకారంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలో కమిటీ సభ్యులు ముఖ ద్వారాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో బొక్కలగుట్ట హైవే రోడ్డు అనుకోని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని, అప్పటి నుండి ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగడంలేదన్నారు. ఈ నెల 20 తేదీన గాంధారి మైసమ్మ జాతర జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ బోనాల జాతరకు సింగరేణి, ఫారెస్ట్ అధికారులతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ అధికారులు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నారని, ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లకు సహకరించాలని కోరారు.

AITUC leaders

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గుర్తింపు సంఘం నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఇందారం గ్రామం లోని దొరగారి పల్లె ప్రాంతంలో గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో ఇందిరమ్మ ఇంటికి శనివారం ముగ్గు పోసే కార్యక్రమం చేపట్టడం జరిగింది.అలాగే గ్రామం లో ప్రతి పేదవారికి ఇండ్లు మంజూరు అయ్యేలా మంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు.గతా పది సంవత్సరాల పాలనలో అందరిని కెసిఆర్ మోసం చేశారని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కు కట్టుబడి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి వివేక్ వెంకటస్వామికి,యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.చెన్నూరు నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్,సిహెచ్.సతీష్ కుర్మిల్లా సరస్వతి,రవి, భాగ్యరాజ్,గ్రామం పెద్దలు పాల్గొన్నారు.

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు శనివారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి అయిన సందర్భంగా పట్టణంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృదే ధ్యేయంగా మంత్రి వివేక్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫ్లై ఓవర్ వంతెనపై త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,వంతెనకు ఇరువైపుల రోడ్డు విస్తరణకు కోటి యాబై లక్షల రూపాయల నిధులను మంత్రి వివేక్ మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సత్యనారాయణ,తదితర నాయకులు పాల్గొన్నారు.

బిసి రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్ లో ఆమోదం

బిసి రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్ లో ఆమోదం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి :

 

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గురువారం రోజున జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో బీసీ బిల్లులకు 42 %శాతం మద్దతుగా స్వగదీసినందున మండల కేంద్రంలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ,దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,ఎన్నికల ముందు ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు 42% శాతం అమలు చేస్తుందని,బీసీ అభివృద్ధికి,వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని అన్నారు. ఈ బిల్లుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి వర్గానికి, ముఖ్యంగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీహరి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబుకు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయాల్లో రాజకీయ,విద్య,ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి,గంగాడి రాజి రెడ్డి,గంగాడి తిరుపతి రెడ్డి, ధర్మకర్త జున్ను తుల మధుకర్, రెడ్డి చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, పంజాల సతీష్, బిక్షపతి ఒరేం శ్రీనివాస్,ముసిపట్ల శశిధర్ రెడ్డి, మోటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో దత్తగిరి మహారాజ్ వారి ఆశ్రమంలో జరిగిన మృత్యుంజయ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఝరాసంగం పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాజీ ఆలయ చైర్మన్ నీలా వెంకటేశం, నర్సింహా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, తదితరులు

రాతోడ్ భీమ్ రావు జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న రాతోడ్ భీమ్ రావు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బంజారా యువ నాయకులు రాతోడ్ భీమ్ రావు నాయక్ గారి జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి పూలమాలలు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఇటీ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చేందర్, మాజీ ఆలయ చైర్మన నర్సింహా గౌడ్, ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, మోహిద్దీన్, మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,జగదీష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాతోడ్,చిన్న రెడ్డి, అమిత్, మోహన్ చౌహన్, విజయ్ రాతోడ్, సికండర్ తదితరులు.

మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన.!

మల్గి మాజీ సర్పంచ్ మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు జన్మదిన వేడుకలో పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని చిన్నారిని ఆశీర్వదించారు అందరూ కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు నాయకులు న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచేందర్, రాజేందర్ రెడ్డి, సంఘరామ్ పాటిల్, రవి కుమార్, రాజ్ కుమార్, భూమా రెడ్డి,మైపాల్, చంద్రన్న,ఇస్మాయిల్, లోకేష్ పాటిల్,గొల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 11:

చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని కాజూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నగర మేయర్ కుమారి ఆముద పుంగనూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు చూడా చైర్ పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాజూరుకి విచ్చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పుష్పాలు, గజమాలతో కాజూరు ప్రాంత కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ఘన స్వాగతం పలికారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కాజూరు ప్రజలకు వారు
వివరించారు,
ఇది మంచి ప్రభుత్వం అంటూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించి మళ్లీ మాకు కూటమి ప్రభుత్వమే కావాలంటూ తమ ఆకాంక్షను కాజూరు ప్రాంత ప్రజలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు  తెలియజేసారు.

సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్.

సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మకం

 

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ , 4 ఫిబ్రవరి 2024 రోజున కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగనన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం నాలుగు ఫిబ్రవరి 2025న బీసీలకు విద్యా ,ఉద్యోగ ,స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నిన్నటి రోజున తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే ఎన్నికల పోతామని దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిర్ణయించడం పట్ల పర్ష హన్మాండ్లు హర్షం వ్యక్తంచేశారు,సామాజిక న్యాయాన్ని ఇచ్చిన మాట మేరకు ఆ మాటను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఎంత చేసినా తక్కువే నని పర్ష హన్మాండ్లు అన్నారు ,గత మూడు దశాబ్దాలుగా గత పాలకులను ఎన్ని సార్లు డిమాండ్ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ,కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కులుగా బీసీల కొరకు మొండి పట్టు పట్టి అమలు చేయడం చారిత్రాత్మకమనీ పర్ష హన్మాండ్లు అన్నారు,ఈ ప్రభుత్వానికి బీసీలు అండగా ఉంటారని అదేవిధంగా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు,కోర్టు తీర్పు మేరకు నెల రోజులలో బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని అదేవిధంగా మూడు నెలలుగా ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఆత్రుతగా చూస్తున్న సమయంలో క్యాబినెట్ బీసీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీలుగా నేను గర్వపడుతున్నామని కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు ,వాడవాడనా గ్రామ గ్రామాన పట్టణాల అదేవిధంగా నగరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి చారిత్రాత్మక నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకోవాలని బీసీ నాయకులకు ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు పిలుపునిచ్చారు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటూ బీసీల పక్షాన నిలుస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలుగా టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ లు ఇట్టి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు,ఎవరైనా రాజకీయ స్వార్థంతో బీసీలకు ఈ విషయమై వ్యతిరేకంగా చేసిన ఆ పార్టీలను ఎండగడతామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు హెచ్చరించారు , బిజెపి పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని అంటున్నదని కేంద్రంలో బీసీ కులగణన చేస్తానని చెప్పి మాట ఇచ్చిందని దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది కాబట్టి కేంద్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు విజ్ఞప్తి చేశారు, ఈ 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంక్షేమ సంఘం గా మేము ముందుంటామని సాధించుకొని తీరుతామని ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు తెలిపారు, ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేని మల్లేష్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, కోడం రవీందర్ ,అల్వాల మల్లేష్ ।ఇల్లంతకుంట తిరుపతి ,ఆంజనేయులు ,శ్రీకాంత్ ,బోయిని శ్రీనివాస్,తిరుపతి ,కుసుమ ప్రభాకర్,చిందం శ్రీధర్,దామోదర్ ,కొండయ్య, బుర్ర మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్

నేటి ధాత్రి చర్ల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు

సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన..

సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్

Collector Jitesh V Patil, District SP Rohit Raj

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం మారుమూల పూసుగుప్ప గ్రామంలో కోటిన్నర వ్యయంతో నిర్మించిన సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్‌ ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మారుమూల ప్రాంతంలో ఇంత గొప్ప వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినందుకుగాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా అధికారులను గ్రామస్తులు అభినందించారు

Collector Jitesh V Patil, District SP Rohit Raj

24 గంటలు వైద్య సదుపాయాలు మరియు వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ రాజ్ వర్మ తహసిల్దార్ శ్రీనివాసు ఎంపీడీవో యాదయ్య ఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్ మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు  పాల్గొన్నారు

Collector Jitesh V Patil, District SP Rohit Raj

పాటల పల్లకి 12 గంటలు పోస్టర్ ఆవిష్కరించిన.

పాటల పల్లకి 12 గంటలు పోస్టర్ ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ నాయకులు

నిజాంపేట్, నేటి ధాత్రి

తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా కళాకారులూ టీ యన్ జి ఓ భవన్ లో 13 వ తేదీన నిర్వహించే పాటల పల్లకి 12 గంటలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.నిజాంపేట మండలానికి సంబoదించిన మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల జిల్లా ప్రధాన కార్యదర్శి వొళ్ళపు స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం లో సాంస్కృతిక సారథి లో 550 ఉద్యోగాలు ఇచ్చారు అందులో 200 మందికి పైగా ఆట పాట రాని కళాకారులకు అసలు ఉద్యమానికి సంబంధం లేని వారికీ ఉద్యోగాలు ఇచ్చారు రసమయి కి తెలిసిన వారికీ రసమయి కి నచ్చిన వారికీ ఉద్యోగాలు ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం సాంసృతిక సారథి నీ ప్రక్షాళన చేయాలనీ కోరుతూ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మెనిపెస్టోలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది . అందుకు ఇప్పుడు సాంస్కృతిక సారధిలో అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాటల పల్లకి ద్వారా విన్నవించడానికి ఈ పాటల పల్లకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అర్హులైన ఉద్యమ కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ పాటల పల్లకి కార్యక్రమాన్ని జిల్లాలున్న ప్రతి ఒక్క కళాకారులు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి ,పంజా మహేందర్, నసీరుద్దీన్ ,
వై వెంకటేశం, కాంగ్రెస్ నిజంపేట గ్రామ అధ్యక్షుడు బాబు, గరుగుల శ్రీనివాస్, కళాకారులూ దేవేందర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version