ప్రతి వార్డు నుండి కదలి రావాలి కదం తొక్కుతూ.

ప్రతి వార్డు నుండి కదలి రావాలి కదం తొక్కుతూ.

శనిగరం శ్రీనివాస్ ఎస్సీ సెల్ పరకాల పట్టణ అధ్యక్షుడు

పరకాల నేటిధాత్రి

చరిత్రలో నిలిచేలా రజతోత్సవం గ్రామగ్రామాన పండుగ వాతావరణం
ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు, పట్టణాలు
దేశంలోనే అతిపెద్దగా సభగా రికార్డు సృష్టించే అవకాశం ఈ సభను విజయవంతం చేయాలి,ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభకు సుమారు 1,300 ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయని పరకాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శనిగరం శ్రీనివాస్ తెలిపారు.పరకాల పట్టణంలో వారు మాట్లాడుతూ ఈ సభకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలను తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో పట్టణం లోనీ 18వ వార్డు లో స్థానిక భారాస నాయకులతో కలసి సభ వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు ఈ సభ నభూతో నభవిష్యత్ అనే విధంగా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సభ కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, ఇది ఒక విశాల సంకల్పానికి సాంకేతమని, ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తు దారి చూపే దిశగా ప్రజల నడిపించే ప్రయత్నం చేసే సభ అని పేర్కోన్నారు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు సోమవారం 18వ వార్డులో ప్రజలకు సభ గురించి చైతన్యం కల్పించారు.ఏ గ్రామంలో చూసినా ఏప్రిల్‌ 27న ఎల్కతుర్తిలో జరిగే తెలంగాణ ఇంటి పార్టీ రజతోత్సవ వేడుకల గురించే చర్చ జరుగుతున్నదని రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎల్కతుర్తి సభ రికార్డు సృష్టిస్తుందని శనిగరం శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత.!

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని,విద్యార్థులకు శుభాకాంక్షలు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మల్లెల రణధీర్
(మాజీ సర్పంచ్ కొత్తగూడ)

కొత్తగూడ మండలం లోని విద్యార్థులు
నేడు ఇంటర్ పరీక్ష ఉత్తిర్ణత సాధించడం చాలా గొప్ప విషయం..
విద్యార్థులు ఉన్నత చదువులతో ముందుకుసాగాలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
ఉజ్వల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునేవిధంగా నడవాలి
క్షణికావేశంలో ఫెయిల్ అయినా మనే బాధతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మరొక అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటునన్నాను..
ఈరోజు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాల ను ఉద్దేశించి
మల్లెల రణధీర్
.గారు మాట్లాడుతూ,,
ఈరోజు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని-విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే,ఓటమి-గెలుపులు అనేటివి సాధారణమే అని,ఉత్తీర్ణత రాని వారు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా,మరో అవకాశాన్ని సద్వినియోగించుకుని,గెలుపును చవిచూడాలన్నారు.ఉత్తీర్ణత సాధించిన వారికి దీనిని వారధిగా నిలుపుకుని,మరో మెట్టు ఎక్కుతూ,అత్యున్నత శీకరాగ్ర స్థానన్ని సంపాదించుకుని,మంచి మంచి అవకాశాలను అధిరోహించాలని,తల్లిదండ్రులను సంతోషపరుస్తూ,తమదైన శైలిలో గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు.…

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

* సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు 1వ వార్డు రగుడు లోని సిరిసిల్ల సెస్ విద్యుత్ సంస్థ ద్వారా రాబోయే వర్షా కాలం ద్రుష్టిలో ఉంచుకోని సెస్ వినియోగ దారులు అందరు కరెంట్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకొనగలరని తెలియజేయడం జరిగినది.పొలాల దగ్గరమరియు ఇంటి దగ్గర సెస్ ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సెస్ సిబ్బంది కి వెంటనే తెలియజేయాలని.రైతలు స్వంత నిర్ణయం తో ట్రాన్స్ఫర్మర్ బంద్ చేయడం స్టార్ట్ చేయడం వంటివి పనులు చేయకూడదని. అలాగే ఏదైనా సమస్య వస్తే సెస్ సిబ్బంది చూసుకుంటుందని తెలిపారు.ఇది వరకు చాలా ప్రమాదాలు జరిగినవి.ఇక పై అలా జరగకుండ తగు జాగ్రత్తలు తీసుకొని ఏ సమస్య అయినా సెస్ సిబ్బంది కి తెలుపగలరు. అని సెస్ DE. రామ సుబ్బారెడ్డి, AE. పద్మ తెలిపారు.ఈ కార్యక్రమం లో రైతులు మరియు సెస్ సిబ్బంది పాల్గొన్నారు.

దాహార్తిని తీర్చడానికి చలివేద్రాలు అవసరం.

దాహార్తిని తీర్చడానికి చలివేద్రాలు అవసరం.

దుర్గా ఫర్టిలైజర్స్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వేసవి కాలంలో ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు,బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి అన్నారు.నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో మంగళవారం దుర్గా ఫర్టిలైజర్స్ యజమాని వరంగంటి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయగా పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి దాత ప్రవీణ్ రెడ్డితో కలిసి ప్రారంభం చేశారు.

quench thirst.

ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ అవసరానికి అనుగుణంగా నీటిని వృదా చేయకుండా వాడుకోవాలని సూచించారు.ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటుకు దుర్గా ఫర్టిలైజర్స్ యజమాని సహకరించడం అభినందనీయం అని పేర్కొన్నారు.గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు,మాజీ వార్డు సభ్యులు ఉప్పుల రాజు,గ్రామస్తులు భాసబోయిన రాజు,బయ్య నవీన్,రాజు,సయ్యద్ అజార్,ఉప్పుల రవి,శ్రీనివాస్, తిరుపతి రెడ్డి గ్రామ పంచాయితీ సిబ్బంది సుధాకర్,సురేందర్,ఎల్లయ్య,మహిళలు పాల్గొన్నారు.

ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం హుమ్నపూర్ గ్రామంలో ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో అక్కమహాదేవి మందిరం దగ్గర బోర్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుణవంత్ పాటిల్, కార్యకర్తలు భీమన్న, వైజీనాథ్ పాటిల్, రాజు, సిద్దయ్య స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు.!

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు సోలార్లు మంజూరు చేయాలి.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోమంగళవారం రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం కొతగూడ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దనుసరి రాజేష్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద ఆదివాసి రైతులకు వర్షం ఆధారంగానే వ్యవసాయం సాగిస్తున్నారు దీనితో వర్షాలు సకాలంలో రాకపోవడం వలన పంటలు ఎండిపోయి కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులు అప్పుల పాలవుతున్నారని వారన్నారు.
వర్షాధారంపై పోడు వ్యవసాయం చేస్తూ నిరుపేద ఆదివాసి రైతులను ప్రభుత్వమే ఆ యొక్క రైతులకు వ్యవసాయ బోర్లు కరెంట్ లైన్ లేదా బోర్లు మోటార్లతోపాటు సోలార్లు మంజూరు చేసి ఈ యొక్క నిరుపేద ఆదివాసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి కరెంటు తెచ్చుకోలేని సన్న కారు చిన్న కారు ఆదివాసి రైతులకు సోలార్ విద్యుత్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వర్షాలు తక్కువ ఉన్నా కానీ బోరు మోటర్ సోలార్ ఉండటంతో దళారుల ఊబి నుండి బయటపడడమే కాకుండా వడ్డీలకు డబ్బులు తెచ్చుకోకుండా అప్పుల ఊబి నుండి వారిని వారు కాపాడుకోవడం కాకుండా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనాధారంగా మారుతుందని వారు సూచించారు. అంతేకాకుండా పోడు వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు హక్కు పత్రాలు అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అంతేకాకుండా హక్కు పత్రాలు వచ్చినకాని కొన్ని గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు ఇవ్వకపోవడం వలన చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి నిరుపేద ఆదివాసి రైతులకు తక్షణమే హక్కు పత్రాలు మంజూరు చేయాలని అంతేకాకుండా ముద్రించిన అడవి హక్కు పత్రాలు ఆఫీసు బీరువాల్లో ఉంచుకుంటున్నారే తప్ప ఆ యొక్క రైతులకు చేరవేయడం లేదు ఇదిలా ఉంటే కొంతమంది దళారులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర రైతులకు కూడా అటవీ హక్కు పత్రాలను మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాటిని పరిశీలించి రద్దు విధంగా చర్యలు తీసుకోవాలని ఇక నిరుపేద ఆదివాసి రైతులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసి ఆదివాసి రైతులకు ఇవ్వడంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లోపంతో పూర్తిగా విఫలమైనారని వారు ఆరోపించారు ఇలాంటి తప్పిదాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఆ యొక్క అటవి హక్కు పత్రాలను ఆ రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరినారు. ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్ బోర్లులను 6 సంవత్సరాల వ్యవధి కాకుండా 1 సంవత్సరం లోపే సోలార్ బోర్డులను ఆదివాసి రైతులకు అందే విధంగా చూడాలని వారు అన్నారు అదేవిదంగా ఈ నెల 25న ఎన్నుకోబోయే నూతన మండల కమిటీకి మండలములోని ఆదివాసీ యువకులు హాజరుకగలరని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ ,జిల్లా కోశాధికారి పూనెం జనార్దన్ మండల నాయకులు చుంచ అనిల్, చింత శ్రీకాంత్, పులుసం హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

24 న మాదన్నపేటలో అమరవీరుల సంస్మరణ సభ

24 న మాదన్నపేటలో అమరవీరుల సంస్మరణ సభ

ఎంసిపిఐ (యు) డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈ నెల 24న నర్సపేట మండలం మాదన్నపేట గ్రామంలో జరిగే అమరవీరుల సంస్మరణ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంసిపిఐ (యు) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.ఈ మేరకు మంగళవారం మాదన్నపేట లో సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.పీడిత ప్రజల కోసం,మనిషిని మనిషి దోపిడి చేసే వ్యవస్థ మార్పుకోసం దొరల దోపిడి దారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అమరులైన వీరులను స్మరిస్తూ సంస్మరణ సభ జరుగుతుందన్నారు.వరంగల్ జిల్లాలో ఉప్పెనల ప్రజా పోరాటాలను చూసిన నాటి పాలకవర్గ పార్టీ కాంగ్రెస్ అండదండలతో భూస్వాములు , ప్రజా కంఠకులు , పీడిత ప్రజా ఉద్యమాలపై కక్షకట్టి సాగించిన మారణహోమంలో ఆణిముత్యంలాంటి విప్లవ ముద్దుబిడ్డలు నేలకొరిగారని గుర్తు చేశారు.ఈ సభలో పార్టీ రాష్ట్ర నాయకుల ప్రసంగాలు,ప్రజానాట్యమండలి కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించబడతాయన్నారు.వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని రాజమౌళి కోరారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం,కర్నే సాంబయ్య,అనుమాల రమేష్,గుర్రం రవి పాల్గొన్నారు.

ఘనంగా సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భావ దినోత్సవం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),

నేటిధాత్రి:

ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు రష్యా విప్లవోద్యమ నేత కామ్రేడ్ లెనిన్ జయంతిని, సిపిఐ (ఎం-ఎల్) 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుండాల మండలంలోగుండాల, కాచనపల్లి, చెట్టుపల్లి, కొడవటంచ,చీమల గూడెం, నర్సాపురం తండ, కన్నాయిగూడెం, లక్ష్మీపురం,రోళ్లగడ్డ, ముత్తాపురం, గలభ, తూరుబాక, తూరుబాక ఎస్సీ కాలనీ తదితర గ్రామాలలో ఘనంగా లెనిన్ జయంతి, సిపిఐ (ఎంఎల్ )ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, జిల్లా నాయకులు కొమరం సీతారాములు, మండల కార్యదర్శి అరెం నరేష్ మాట్లాడుతూ 1968 లో సిపిఎం రీజనిస్ట్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ 1969 ఏప్రిల్ 22న పీడిత ప్రజల ఆశాజ్యోతి సిపిఐ (ఎం-ఎల్) ఆవిర్భవించి దున్నేవానికే భూమి కావాలని నినాదంతో గోదావరి లోయ పరివాహక ప్రాంతాలలో గిరిజనులను, గిరిజనేతర పేద ప్రజలను సమీకరించి లక్షలాది ఎకరాల పోడు భూములను కొట్టించి వాటి పట్టాల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించి పట్టాలు సాధించిందని అన్నారు.
ఈ క్రమంలో అతివాద ,మితవాద ధోరణులకు గురై అనేక చీలికలకు గురైనప్పటికీ ఇప్పటికీ సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ పేద ప్రజల తలలో నాలుకల పనిచేస్తుందని అన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విపలమయ్యాయని అన్నారు.
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న, పర్శక రవి, గడ్డం లాలయ్య,ఈసం కృష్ణన్న, పూణెం నరసన్న, మోకాళ్ళ సూర్యనారాయణ, భానోతు లాలు, మానాల ఉపేందర్, వాగబోయిన సుందర్రావు, పూణేం పొట్టయ్య, తాటి రమేష్, మోకాళ్ళ పోతయ్య, కల్తీ ప్రభాకర్, గడ్డం నగేష్ తదితరులు పాల్గొన్నారు.

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు.!

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం

వనపర్తి నేటిదాత్రి :

సోమశిల శివుని పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూజే ఐ జే యు విలేకరుల సమావేశం
నిర్వహించారు ఈ సమావేశములో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి జాతీయ నాయకులు దేవులపల్లి అమర్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ పాల్గొన్నారు . రాష్ట్ర విలేకరుల కమిటీ సోమశీల లో సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి దేవులపల్లి అమర్ ను విలేకరులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సీనియర్ విలేకరులు మల్యాల బాలస్వామి పోలిశెట్టి బాలకృష్ణ కొంతం ప్రశాంత్ డి మాధవరావు కల్వరాల రాజేందర్ విజయ్ డి మన్యం అంజి వహీద్ నరసింహ రాజు శ్రీనివాసరావు నాకొండ అరుణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మల్ల రాములు  పాల్గొన్నారు

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను.!

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయండి. 
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రలో తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశలో 27న జరిగే 25 వసంతల రజతోత్సవ చలో వరంగల్ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలను కార్యకర్తలను వచ్చి విజయవంత చేయవలసిందిగా కోరారు ఈ సమావేశం లో ముఖ్యఅతిథులుమాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహరావు మరియు, మాజీ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి బొల్లి రాంమోహన్ కుంబాల మల్లారెడ్డి నాగరాజు, యాదవ్ వివిధ మండలాల మాజీ జెడ్పిటీలు, ఎంపిటిసీలు సర్పంచ్ లు కౌన్సిలర్స్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పంచా యితీ కార్యాలయంలో ఉద యం కంటి పరీక్ష క్యాంపు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వ రంలో లయన్ విజన్స్ క్లబ్ సహకారంతో నాలుగో విడతలో భాగంగా నిర్వహించ డం జరిగింది దాదాపుగా గ్రామ వృద్ధులు 80 మందికి ఉచి తంగా కంటి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేయించు కోవడం జరిగింది అందులో ఒక 35 మందిని కంటి ఆపరేషన్ ఎన్నుకోవడం జరిగింది వారికి ఉచితంగా బస్సు భోజనము పడక కల్పిస్తూ హైదరాబాదు లోని పుష్పగిరి ఆసుపత్రికి తీసుకుపోయి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని మండలం లోని 24 గ్రామాలలో ఉచితం గా కంటి పరీక్ష క్యాంపు నిర్వ హించాలనే సంకల్పంతో కన్నా కొడుకులు కూతుర్లు తల్లితం డ్రులను పట్టించుకోలేని స్థితిలో తీన్మార్ మల్లన్న టీం ముందుం డి వారికి ఇంటి పెద్ద బిడ్డ లాగా వారికి సహాయం చేస్తున్నారని ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని తీన్మార్ మల్లన్న టీం మండలాధ్యక్షులు తీన్మార్ జయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పెద్ద ఎత్తున వృద్ధులు గ్రామ పెద్దలు తీన్మార్ జయ్ పెద్దిరెడ్డి వేముల రమేష్ శానం కుమార్ స్వామి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

‘‘కారణజన్ముడు’’..’’కేసిఆర్‌’’.

ప్రపంచంలోనే ఏ ఉద్యమ కారుడు పడనన్ని కష్టాలు, నష్టాలను, నిర్భందాలు ఎదుర్కొని తెలంగాణ సాధించిన మహోద్యమ నాయకుడు కేసిఆర్‌ అంటున్న బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి వర్యులు ‘‘తన్నీరు హరీష్‌ రావు’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో కేసిఆర్‌ పోరాటం గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

`తెలంగాణ కోసమే పుట్టిన మహాత్ముడు కెసిఆర్‌.

`తరతరాల తెలంగాణ యాతన తీర్చిన దేవుడు కెసిఆర్‌.

`అరవై ఏళ్ల గోస నుంచి తెలంగాణకు విముక్తి ప్రసాదించిన యోధుడు కెసిఆర్‌.

`దేశంలోనే ఏ నాయకుడు కేసిఆర్‌ కు సాటి కారు.

`కేవలం తెలంగాణ కోసం పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన వీరుడు కెసిఆర్‌.

`అలుపెరగని ఉద్యమ ప్రయాణం సాగించిన ధీరోధాత్తుడు కెసిఆర్‌.

`అవమానాలెన్నింటినో తెలంగాణ కోసం దిగమింగారు.

`ఎదురు దెబ్బలెన్నింటినో మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు.

`ప్రాణాలను సైతం తెలంగాణ కోసం పణంగా పెట్టారు.

`పదవులను గడ్డిపోచల్లా విసిరిపారేశారు.

`తెలంగాణ తప్ప మరేమీ వద్దని తెగేసి చెప్పిన ధైర్యవంతుడు కెసిఆర్‌.

`ప్రలోభాలను కాలి గొటితో తన్ని అవతల పడేశారు.

`దేశంలోని పార్టీలన్నింటినీ తెలంగాణ కోసం ఏకం చేశాడు.

`తెలంగాణ సమాజాన్ని ఏక తాటి మీదకు తెచ్చాడు.

`పసి పాప నుంచి పండు ముసలి దాకా జై తెలంగాణ అనేలా చేశాడు

`నిద్రిస్తున్న పసిపాప కూడా తెలంగాణ మాట విని కేరింతలు కొట్టేలా చేశాడు

`చెట్టు, చేమ, పుట్ట, ఆకు, అలము అన్నీ జై తెలంగాణ అనేలా చేశాడు

`కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చారు

`కేసీఆర్‌ లాంటి మహానుభావుడు యుగానికొక్కరే పుడతారు

`ప్రజల నుంచి వచ్చి, ప్రజలను నాయకులను చేసిన విశ్వనాయకుడు కేసిఆర్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సారు, కారు అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సంకేతం. సంక్షేమాన్ని పంచిన కేసిఆర్‌ నాయకత్యానికి ప్రజలు గుండెల్లో పెట్టుకున్న నమ్మకానికి సందేశం. అభివృద్ధికి నడకలు నేర్పి, ప్రగతిని పరుగులు పెట్టించిన కేసిఆర్‌ ను అనుక్షణం గుర్తు చేసుకోవడానికి అవకాశం. నిరంతరం కేసిఆర్‌ స్మమణ చేసుకొవడానికి తెలంగాణ ప్రజల నాలుకల మీద నాట్యమాడుతున్న పదం. తెలంగాణ చెదరిపోకూడదు..కలలు కరిగిపోకూడదు..కళ్ల ముందు ఆవిష్కరించిన అభివృద్ధి ఆగిపోకూడదని ప్రజలకు ఎంతో వినమ్రంగా చెప్పారు. నిజం గడపదాటేలోపు అబద్ధం అరవై ఊళ్లు చుట్టి వచ్చినట్లు కాంగ్రెస్‌ చేసిన మోసపూరిత వాగ్థానాలు నమ్మారు. కాంగ్రెస్‌ ను ఒక్కసారి నమ్మితే అమ్మేస్తారని కేసిఆర్‌ పదే పదే చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమం. కాకపోతే ఎన్నికల సమయంలో ఏమరపాటుతో ఒక్కసారి చేసే పొరపాటు ఐదేళ్లు శిక్షలా మారుతుందనడానికి కాంగ్రెస్‌ పాలనే నిదర్శనం. అందుకే తెలంగాణ ప్రజలు మళ్లీ మళ్లీ సారే కావాలి. కారే కావాలి. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక కేసిఆర్‌ స్వర్ణ యుగ పాలన కావాలని బలంగా కోరుకుంటున్నారు. అది బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ద్వారా మరోసారి ప్రపంచానికి తెలియనుంది. బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో ఎంతటి బలంగా వుందో చూడబోతున్నారు. కేసిఆర్‌ ఎంతటి శక్తివంతమైన నాయకుడో మరోసారి దేశ రాజకీయాలు తెలుసుబోతున్నాయి. ఎందుకంటే కేసిఆర్‌ అందరి లాంటి నాయకుడు కాదు. ఆయన ఒక కారణన్ముడు. ప్రపంచంలోనే ఏ ఉద్యమ కారుడు పడనన్ని కష్టాలు, నష్టాలను, నిర్భందాలు ఎదుర్కొని తెలంగాణ సాధించిన మహోద్యమ నాయకుడు కేసిఆర్‌ అంటున్న బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కేసిఆర్‌ పోరాటం గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

కేసిఆర్‌ తెలంగాణ కోసమే పుట్టిన మహాత్ముడు. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు. తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ సాధనకు ఎవరి బలం సరిపోయేది కాదు. కేసిఆర్‌ లాగా ఎవరూ తెగించిపోరాటం చేయకపోయేవారు. అందుకే గతంలో 1969లో తెలంగాణ ఉద్యమం సాగినా చప్పున చల్లార్చారు. తెలంగాణ ఉద్యమాన్ని సమైక్య వాదులు ఊదేశారు. తర్వాత మళ్లీ కేసిఆర్‌ జై తెలంగాణ అనే వరకు ఎత్తిన పిడికిలి తెలంగాణ వచ్చే దాకా దించకుండా నాయకులు లేరు. తెలంగాణ పోరాట మొత్తం చరిత్రలో తొలి అడుగు నుంచి తెలంగాణ తెచ్చే దాక కొట్లాడిన ఏకైక పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌. అందుకే తరతరాల తెలంగాణ యాతన తీర్చిన దేవుడుగా ప్రజల చేత కొలువబడుతున్నాడు. స్వప్రయోజన రాజకీయాల కోసం పాకులాడి నాయకులై, పదవులతో పలుకుబడి పొందిన వారు ఎందరో గొప్ప నాయకులమని విర్రవీగుతుంటారు. మా అంతటి నాయకులు లేరని గొప్పలకు పోతారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రజల కోసం పోరుబాట పట్టిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్ల గోస నుంచి తెలంగాణకు విముక్తి ప్రసాదించిన యోధుడు కేసిఆర్‌. అందుకే దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ నాయకుడు కేసిఆర్‌కు సాటి లేరు. అంతటి నిబద్ధత కలిగిన వారు లేరు. దశాబ్దాల తరబడి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు గొంతు సవరించిన మలి తరం నాయకుడు కేసిఆర్‌. కేవలం తెలంగాణ కోసం పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన వీరుడు. దేశ చరిత్రలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని, రాజకీయాన్ని రంగరించి, సుదీర్ఘ కాలం పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఆయనతో పాటు తెలంగాణ కోసం కేసిఆర్‌ వేసిన తొలి అడుగులో అడుగునైనందుకు నా జన్మ కూడా ధన్యమైంది. కేసిఆర్‌ వెన్నంటే వుంటూ తెలంగాణ సాధన కోసం ఆయన అడుగు జాడల్లో నడిచే అదృష్టం నాకు కలిగింది. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్‌ తో కలిసి సాగే బాగ్యం నాకు దక్కింది. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్‌తో కలిసి సాగే అవకాశం దక్కింది. అందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే అలుపెరగని ఉద్యమ ప్రస్థానాన్ని సాగించిన ధీరోధాత్తుడు కేసిఆర్‌. పద్నాలుగేళ్ల ప్రయాణంలో ఎప్పుడూ అలుపు లేదు. అలసట లేదు. విరామం తీసుకున్న సందర్భం లేదు. పండుగ లేదు. పబ్బం లేదు. ఆకలి లేదు. నిద్ర లేదు. తెలంగాణ నామస్మరణ తప్ప పద్నాలుగేళ్లు మరో వ్యాపకం లేదు. అంతటి అంకిత భావం వున్న నాయకుడు మన దేశంలోనే లేరు. తెలంగాణ కోసం అవమానాలెన్నింటినో తెలంగాణ కోసం దిగమింగారు. అడుగడుగునా ఎదురైన అనేక సవాళ్లను చేధించుకుంటూ కేసిఆర్‌ ముందుకు సాగారు. బెదిరింపులులకు బెదరలేదు. అదింపులకు అదరలేదు. ఏ ఒక్క క్షణం భయాన్ని దరిచేరనివ్వలేదు. తాను ఒక్కడుగా మొదలై కొన్ని లక్షల మంది కేసిఆర్‌ లను తయారు చేసిన ఉద్యమ కారుడు కేసిఆర్‌. పద్నాలుగేళ్లలో ఎదురు దెబ్బలెన్నింటినో మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. ప్రాణాలను సైతం తెలంగాణ కోసం పణంగా పెట్టారు. ఇక కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వాలంటే ఆమరణ నిరాహారదీక్ష ఒక్కటే పరిష్కారమని తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్దపడ్డారు. స్వర్గపుటంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చారు. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను పండగ చేయడానికి కేసిఆర్‌ బతికుండాలని ముక్కోటి దేవతలు అశీర్వదించారు. కేసిఆర్‌ ఆరోగ్యాన్ని దైవాలే కాపాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులే కాపాడాయి. అలా జీవితం అంచుల దాక వెళ్లి వచ్చిన కేసిఆర్‌ మరింత గట్టిగా పోరాటం చేశారు. ప్రకటించిన తెలంగాణ వెనక్కి తీసుకోవడాన్ని దేశం ముందు పెట్టారు. ప్రజా స్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిహాసం చేయడాన్ని నిలదీశారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేశారు. తెలంగాణ కోసం 37 రాజకీయ పార్టీల సమ్మతిని కూడగట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తప్పించుకోలేని అష్ట దిగ్భందనాన్ని కేసిఆర్‌ సృష్టించారు. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితుల్లోకి కాంగ్రెస్‌ ను నెట్టివేశారు. రాజకీయ చాణక్యంతో తెలంగాణ సాధించి, రాజ్యాంగ పరమైన విజయాన్ని తెలంగాణ ప్రజలకు అందించారు. తెలంగాణ కోసం తన పదవులను గడ్డిపోచల్లా విసిరిపారేశారు. అందుకే తెలంగాణ తప్ప మరేమీ వద్దని తెగేసి చెప్పిన ధైర్యవంతుడు అని యావత్‌ తెలంగాణ కొనియాడిరది. తెలంగాణ తప్ప అని కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన రాజకీయ ప్రలోభాలను కాలి గొటితో తన్ని అవతల పడేశారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలనే కాదు, దేశంలోని పార్టీలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేలా చేశాడు. మొత్తం తెలంగాణ సమాజాన్ని ఏక తాటి మీదకు తెచ్చాడు. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని ఉద్యమాన్ని నిర్మించారు. పసి పాప నుంచి పండు ముసలి దాకా జై తెలంగాణ అనేలా చేశాడు. బోసి నవ్వుల పసి హృదయాలను కూడా గెలిచాడు. తొట్టెల్లో నిద్రిస్తున్న పసిపాపలు కూడా తెలంగాణ మాట విని కేరింతలు కొట్టేలా చేశాడు. సమాజమే కాదు, చెట్టు, చేమ, పుట్ట, ఆకు, అలము అన్నీ జై తెలంగాణ అనేలా చేశాడు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రకృతితో బంధం వేశాడు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చారు.

కేసిఆర్‌ లాంటి మహానుభావుడు యుగానికొక్కరే పుడతారు.

జనం నుంచి నాయకుడైన కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ సాక్షిగా కొన్ని లక్షల మందిని బిఆర్‌ఎస్‌ నాయకులగా మార్చిన విశ్వనాయకుడు కేసిఆర్‌. అలా తెలంగాణ కోసం పెట్టిన పార్టీ బిఆర్‌ఎస్‌ పురుడు పోసుకొని 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. రజతోత్సవాలు జరుపుకునేందుకు వరంగల్‌ వేధికగా నభూతో నభవిష్యత్‌ అని ప్రపంచమంతా కొనియాడేలా లక్షలాది మందితో సభకు సిద్దమౌతోంది. తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి వరంగల్‌ కు చీమల దండు కదిలినట్లు ప్రజలు తరలిరానున్నారు.

‘‘మహానాయకుడు’’, ‘‘విశ్వనాయకుడు’’ మన ‘‘కేసిఆర్‌’’

`కేసీఆర్‌ జై తెలంగాణ అన్ననాడు కలిసొచ్చిన వారు లేరు

`కేసీఆర్‌ తెలంగాణ తెస్తున్నాడని తెలిసిన తర్వాత జై తెలంగాణ అనని వారు లేరు

`సమైక్య వాదుల చేత కూడా జై తెలంగాణ అనిపించిన వీరుడు

`తన రాజకీయ భవిష్యత్తు ఫణంగా పెట్టి తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు

‘‘చీకటిలో చిరుదివ్వె కాదు’’…’’వెలుగు రవ్వ’’! ‘‘కేసిఆర్‌’’..అంటూ తెలంగాణ కోసం కేసిఆర్‌ అడుగులు వేసిన నాటి కాలం, కేసిఆర్‌ పాలనలో తెలంగాణ ప్రగతి మార్గం గురించి ‘‘బిఆర్‌ఎస్‌’’ సీనియర్‌ నాయకుడు, జనగామ శాసన సభ్యుడు ‘‘పల్లా రాజేశ్వర్‌ రెడ్డి’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే..

`తెలంగాణకు వేకువ తెచ్చిన సూరీడు

`తెలంగాణకు వెలుగులు పంచిన పాలకుడు

`పదేళ్లలో సంక్షేమాన్ని ,ప్రగతిని సమ పాళ్లలో బంగారు తెలంగాణ ఆవిష్కరించారు

`నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన దిగ్గజ నాయకుడు

`కేసీఆర్‌ కు సాటి దేశంలోనే మరో నాయకుడు లేడు

`రాష్ట్రం కోసం రాజకీయ పార్టీ పెట్టిన చాణక్యుడు

`తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కలను నిజం చేసిన పోరాట యోధుడు

`తెలంగాణ ప్రజల కన్నీటిని తుడిచిన సేవాతత్పరుడు

`ప్రజల కోసం తెలంగాణ నినాదమై సమైక్య పాలకులను గడగడలాడిరచారు

`తెలంగాణ సెగ డిల్లీకి తాకేలా చేసి తెలంగాణ ఇచ్చేలా చేశాడు

`తెలంగాణ ప్రజల తెగువను పోరాటంగా మలిచిన మలిదశ ఉద్యమ కారుడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కేసిఆర్‌ మహానాయకుడు. విశ్వనాయకుడు. ప్రపంచ ఉద్యమాలకే మార్గం చూపిన గొప్ప నాయకుడు. బిఆర్‌ఎస్‌ అదినేత కేసిఆర్‌ సాగించిన ఉద్యమం సామాన్యమైంది కాదు. అందరివల్ల అయ్యేది కాదు. తెలంగాణ సాధన ఉద్యమమనేది ఎంత భారమో కేసిఆర్‌కు తెలుసు. ఎంత కష్టమో గత ఉద్యమాలు చూసిన అనుభవం కూడా కేసిఆర్‌కు వుంది. అయినా తెలంగాణ సాధించడమే తన జీవిత లక్ష్యం చేసుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ తెలంగాణ సాధించముందు..తెలంగాణ రాకముందు నా నియోజకవర్గం జనగామ కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌గా వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఏటా కరువు ప్రాంతాలను ప్రకటిస్తూ వుండేవి. అలా నిత్య కరువు ప్రాంతంగా జనగామ మారిపోయింది. కేంద్రం నుంచి జనగామ ప్రాంత కరువు నివారణ కోసం కేంద్రం నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా జనగామకు ఖర్చుపెట్టకుండా సమైక్యపాలకులు తీవ్ర అన్యాయంచేశారు. అప్పటి కాంగ్రెస్‌ నాయకులు కనీసం ప్రశ్నించేవారు కాదు. జనగామకు న్యాయం చేయాలన్న సోయిలో ఎప్పుడూ లేరు. ఆ సమయంలో జనగామ, బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు మండలాలు కరువుతో విలవిలాడేవి. అయినా అప్పటి పాలకుల మనసు కరిగింది లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో బచ్చన్నపేటలో కరువును చూసి కేసిఆర్‌ చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే ముందు జనగామ నియోజకవర్గ కరువును రూపుమాపుతానని మాటిచ్చారు. అన్నట్లుగానే తెలంగాణ వచ్చిన తర్వాత ముందు కరువును జనగామ నుంచి తరమికొట్టిన నాయకుడు కేసిఆర్‌. మిషన్‌ కాకతీయ పనుల తొలి దశలోనే జనగామకు ప్రాదాన్యత కల్పించి, మొత్తం చెరువులను ఏకకాలంలో బాగు చేయించారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువుల పూడిక పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టారు. చెరువులన్నీంటికీ కొత్త మరింత పటిష్టమైన కట్టలను ఏర్పాటు చేశారు. చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. పదేళ్లపాటు ఏ ఒక్క చెరువులో చుక్క నీరు తగ్గకుండా ఎప్పటికిప్పుడు నింపుతూ, మండుటెండల్లో కూడా మత్తళ్లు దుంకేలా నీటితో కళకళలాడేలా చేశారు. సముద్ర మట్టానికి తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం జనగామ నియోజకవర్గం. అలాంటి నియోకవర్గంలో భూగర్భజలాలు అడుగంటి, వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరు వచ్చేది కాదు. బావులన్నీ ఎండిపోయి, ఎడారిగా మారిపోయింది. అలాంటి జనగామలో పాత బావులన్నీ పదేళ్లపాటు ఎల్లబోశాయి. బోర్లలో నిరంతరం నీరుండేది. కాంగ్రెస్‌ వచ్చింది. మళ్లీ కరవు తెచ్చింది. పదేళ్లపాటు ఎండిపోని బావులు ఎండిపోయాయి. పదేళ్ల కాలం చుక్క నీరు ఇంకనంత నిండుగా వున్న చెరువులన్నీ మళ్లీ ఎండిపోయాయి. చెరువులను నింపాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్‌కు లేకుండాపోయింది. అందుకే ప్రజలు మళ్లీ సారే రావాలంటున్నారు. కారే కావాలని కోరుతున్నారు. తెలంగాణ కళకళలాడాలంటే కేసిఆర్‌ నాయకత్వంలోనే పాలన సాగాలని బలంగా కోరుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవసభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి, బిఆర్‌ఎస్‌ మద్దతు పలికేందుకు సిద్దంగా వున్నారు. అరవై ఏళ్ల గోసను ఆరేళ్లలో తీర్చి, తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన కేసిఆర్‌ తెలంగాణ చీకట్లను పారద్రోలారు. వెలుగులు పంచారంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కలిసి పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే…

అలుపెరగని యోధుడుగా పద్నాలుగేళ్లపాటు నిరంతర పోరాటం సాగించి తెచ్చిన తెలంగాణను బంగారు మయం చేశారు. పన్నెండేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేది. ఏడాదిన్న క్రితం వరకు ఎలా వున్నది. మళ్లీ కాంగ్రెస్‌ రాగానే తెలంగాణ పరిస్ధితి మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లింది. ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. ఒక్క ఏడాదిలోనే తెలంగాణ ఎందుకు ఇలా ఆగమైంది. తెలంగాణ మీద మమకారం లేని పాలకులు పాలిస్తే ఇలాగే వుంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలోకి రావడమే పరమావది. కాని కేసిఆర్‌కు తెలంగాణను బంగారు మయం చేయడమే లక్ష్యం. అందుకే కేసిఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో కళకళలాడిరది. కాంగ్రెస్‌ చేతిలో ప్రజలు అధికారం పెట్టగానే ఆగమైపోయింది. ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. సాగను నీరివ్వడం కాంగ్రెస్‌ బందు పెట్టింది. తెలంగాణ రైతుకు పదేళ్లు పండుగ చేసి కేసిఆర్‌ రైతును రాజు చేశారు. కాంగ్రెస్‌ వచ్చి రైతును మళ్లీ బికారిని చేస్తున్నారు. వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేశారు. ఒక్కసారి 25 ఏళ్ల వెనక్కి వెళ్తే.. తెలంగాణ మాగాణ అంతా ఎక్కడ చూసినా బీళ్లే…తెలంగాణ బతుకంతా ఎడారే..ఎటు చూసినా చుక్కనీరు కనిపించేది కాదు. పొలాలు కనిపించేవి కాదు. పల్లెర్లు మెలిచిన భూములే తప్ప, పంటలు కనిపించే జాడలే వుండేవి కాదు. అప్పటి పరిస్దితులు ఈ తరానికి పెద్దగా తెలియవు. ఎందుకంటే కేసిఆర్‌ ఈ పదేళ్లకాలంలో కరువు అంటే ఎలా వుంటుందో కలలో కూడా తెలంగాణ ప్రజలకు కనిపించకుండా చేశారు. గతంలో పడిన అవస్దలు మళ్లీ తెలంగాణ ప్రజలకు రాకూడదని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కటిక పేద ప్రాంతం నుంచి తెలంగాణను సంపన్న రాష్ట్రంగా మార్చారు. కేసిఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదికాదు. తెలంగాణ ఇలా బంగారుమయ్యేది కాదు. ఇప్పటికీ అదే కరువు పరిస్దితులల్లో తెలంగాణ కొట్టుమిట్టాడుతూ వుండేది. పద్నాలుగేళ్లపాటు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ వల్లనే తెలంగాణ అభివృద్ది సాధ్యమౌతుందని బలంగా నమ్మారు. కేసిఆర్‌ చేసిన అభివృద్దిని చూసి మురిసిపోయారు. తమ జీవితాలను బంగారు మయంచేసుకున్నారు. కాని ఎలాగైనా,అడ్డుదారుల తొక్కైనా సరే, ప్రజలను మోసం చేసి పాలించాలని చూశారు. అదికారంలోకి రావాడానికి మోసపూరితమైన హమీలన్నీ గుప్పించి అదికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసినా, కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాతైనా కేసిఆర్‌ పథకాలు సక్రమంగా అమలుచేసినా తెలంగాణకు మళ్లీ పాత రోజులు వచ్చేవి కాదు. తెలంగాణ కాంగ్రెస్‌నాయకులకు ప్రజలు పచ్చగా వుండడం వుండడం ఇష్టం లేదు. ప్రజలు సంతోషంగా వుండడం ఇష్టంలేదు. అందుకే కేసిఆర్‌ అమలు చేసిన పథకాలను అమలుచేయడం లేదు. రైతు బంధు పేరు మార్చి భరోసా అన్నారు..దానికి రాం రాంచెప్పారు. రైతుబంధు సొమ్ములు మాయం చేశారు. రైతులకు మొండి చేయిచూపించారు. రుణమాఫీ అని గప్పాలు కొట్టి రైతులను నమ్మించి, ఇప్పుడు రైతులనోట్లో మట్టికొట్టారు. రుణమాఫీ జరిగినట్లు ప్రచారం చేసుకుంటూ మళ్లీ మోసం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణను మళ్లీ నాశనం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. తెలంగాణ ప్రజలను గోస పెడుతున్నది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో చీకట్లతెలంగాణ. కేసిఆర్‌ పదేళ్లలో వెలుగుల తెలంగాణ. కాంగ్రెస్‌ హాయంలో ఆకలి తెలంగాణ. కేసిఆర్‌పాలనలో అన్నపూర్ణగా మారిన తెలంగాణ. ఇలా ఒకటి కారు రెండు కాదు..అన్ని రంగాలలో తెలంగాణ అన్నింటా ఫస్టు…బెస్టుగా మారపోయింది. కాని కాంగ్రెస్‌ వచ్చిన అన్నింటిలో తెలంగాణను అధపాతాలానికి తొక్కేస్తున్నారు. తెలంగాణ పరువును గంగలో కలిపేస్తున్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు గోసలు లేవు. ఏ అవస్ధలులేవు. కరువు లేదు. కాని కాంగ్రెస్‌ వచ్చి ఏడాదికే తెలంగాణ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. తెలంగాణను కరువులోకి నెట్టేస్తున్నారు. తెలంగాణను మళ్లీ వలసలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చుతున్నారు. నిన్నటి దాకా కేసిఆర్‌ సాధించిన విజయాలలో తెలంగాణ అంతా అధ్భుతమైన పాడి పంటలతో కళకళలాడుతూ కోటిన్నర ఎకరాల మాగాణమైంది. సారు నీటి పరవళ్లు కదం తొక్కాయి. బంగారు పంటల దిగుబడులు రైతులు కళ్లారా చూశారు. రైతు బంధుతో రైతు సాగు కష్టం తీరింది. అప్పుల బాద తప్పింది. ఏరువాక సమాయానికి రైతు చేతికి రైతుబంధు సొమ్ము అందింది. విత్తనాలకు, పొలం పనులకు అవసరమైన సొమ్ము రైతు చేతి నిండేందుకు రైతు బంధు ఉపయోగపడిరది. పెట్టుబడి సాయం అన్నది రైతులకు ఎంతో మేలు చేసింది. ఇరవై నాలుగు గంటల కరంటుతో రైతుకు తిప్పలు తిప్పంది. రాత్రి వేళల్లో గోస తప్పింది. అన్ని రంగాలలో తెలంగాణ పరుగులు పెట్టింది. కాంగ్రెస్‌ వచ్చి అంతా ఆగం చేసింది. తెలంగాణను మళ్లీ ఎడారి చేస్తోంది.

“ఏసీబీ” కీ చిక్కిన ఆర్ఐ.

*”భూ” సర్వే కోసం రూ.26 వేలు లంచం.* 

*రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్న “ఏసీబీ”అధికారులు.* 

*జనగామ జిల్లాలో ఘటన.*

 *”నేటిధాత్రి”,రఘునాథపల్లి:*

జనగామ జిల్లాలో ఏసీబీదాడులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని చిల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు చేయగా.. ఆర్ ఐ వినయ్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు సోమవారం రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆర్ ఐని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా చిల్పూర్ మండల కేంద్రంలో ఏసీబీ దాడులు జరగడంతో తీవ్ర చర్చగా మారింది..

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

U-Dise వెరిఫికేషన్ పైన సమీక్షా సమావేశం..

ఒదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ఎమ్మార్ సి కార్యాలయం లో ప్రధానోపాధ్యాయుల మరియు Diet కాలేజ్ కరీంనగర్ శిక్షణ ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం యం ఈ ఓ వై.రమేష్ ఆధ్వర్యం లో జరిగింది.
ఓదెల మండలంలో ఎంపిక కాబడిన 20 ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులు అఖిల మరియు అమూల్య ల చే వెరిఫికేషన్ చేపించడం జరిగింది. ఇందులో భాగంగా U-Dise లో నమోదు చేసిన సమాచారం క్రాస్ వెరిఫికేషన్ కోసం 20 పాఠశాలలను తేది 16.04.2025 నుండి తేది 21.04.2025 వరకు ప్రత్యక్షంగా పాఠశాల భవనాలు, తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీరు, ల్యాబ్, ఫర్నిచర్,క్రీడ స్థలం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు , మధ్యాహ్న భోజనం, Kitchen Garden, విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల వివరాలను సేకరించడం జరిగింది.ఈ వివరాలను సేకరించడం లో డైట్ కాలేజ్ శిక్షణ ఉపాధ్యాయులను, మరియు సీ ఆర్ పి లను యం ఈ ఓ సమన్వయ పరిచారు. సమావేశంలో శిక్షణ ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తించి వారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో complex ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య ,యం లక్ష్మీనారాయణ కేజీవీబీ ఓదెల ఎస్ఓకే జ్యోతి, యుపిఎస్ హరిపురం మహేందర్ రెడ్డి, రమేష్, సిపిఎస్ ఓదెల నాగరాజు, ఎంఆర్సి కార్యాలయ సిబ్బంది ఎం ఐ ఎస్ డి వెంకటేష్, సి సి ఓ ఎల్ కుమార్, సి అర్ పి టి ఓంకార్ బి రజిత ఈ రాజేందర్ టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి.!

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

ఏప్రిల్ 27న ఎల్కతుర్తి లో జరగబోయే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సభను రజక సంఘo కుల బంధువులు, రజక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఈరోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి (చందు)ఆధ్వర్యంలో తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్, ముస్తబాద్ మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ బిసినెస్ సెల్ కన్వీనర్ నమిలి నరసింములు,యూత్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజు యకయ్య,బీఆర్ఎస్ నాయకులు మచ్చ రవీందర్,పిల్లల తిరుపతి, ఒరుగంటి రమేష్ రజక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు 40.000 ఆర్థిక సాయం
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన మారుముళ్ల కుమారస్వామి
అనే కౌలు రైతు, అప్పుల బాధతో 21-10 -2015 నాడు పురగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది
తమ స్వంత భూమితో పాటు కొంత భూమి ని కౌలు తీసుకొని అందులో పత్తి,వరి పంటలు సాగు చేయగా అందులో పంట దిగుబడి రాకపోవడం వలన 3 లక్షల వరకు అప్పులు కాగా
తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇతనికి ఇద్దరు పిల్లలు, కూతురు,కొడుకు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక వారు పరామర్శించి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా వారు స్పందించి ఆ సంస్థ ద్వారా 40,000 నలభై వేయిల రూపాయల ఆర్థిక సహాయంతో మేకలు కొని ఇవ్వడం జరిగింది.

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు, బి, కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 194, జి ఓ ల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు,
6,00,000,రూలు, నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నూరి సదానందం రాచపల్లి సమ్మయ్య ఇంజన్ చైతన్యలు పాలుగోన్నారు.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా

 

పరకాల నేటిధాత్రి

 

పరకాల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల అన్న స్వామి అన్న పసుల సాంబయ్య సోమవారం రోజున అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ పరామర్శలో సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ పసుల రమేష్,ఏకు రాజు,నాయకులు కొయ్యడ చందర్,రవి తదితరులు పాల్గొన్నారు.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం కొండాపూర్ వెంకటేశ్వర్ పల్లె గ్రామాలలోభూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు అధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తల ను సమాయత్తం చేస్తూ రోజు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణపురం మండల పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి

ఆర్థిక సహాయం అందించిన.!

ఆర్థిక సహాయం అందించిన ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్

నేటి ధాత్రి

 

ఇటీవల మరణించిన సంస్కృతం అధ్యాపకులు రవీందర్ కుటుంబానికి తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది .తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎం సతీష్ కుమార్, జె ఎస్ డబ్ల్యూ టీవీ సీనియర్ ఇంగ్లీష్ అధ్యాపకులు చిలువేరు శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్యాల యుగంధర్, చిర్ర వెంకట్, ఆర్ తిరుపతి ల ఆధ్వర్యంలో అధ్యాపకుల సహకారంతోహనంకొండ లో వారి నివాసానికి వెళ్లి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి భార్యకు పిల్లలకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో పనిచేస్తూ ఇటీవల మరణించిన రవీందర్
మృతుని కుటుంబానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా అన్ని విధాల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున కోరడం జరిగింది. అదేవిధంగావారి పిల్లలకు చదువులకు వారి అవసరాలకు అయ్యే ఖర్చును ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version