మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య.

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

పని కోసం వెళితే… ప్రాణాన్ని సైతం వదులుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన జెల్ల రమేష్ -లక్ష్మి కుమారుడు వేసవికాలం సెలవులు ఉండడంతో తమకున్న నాలుగు మేకలు మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఈ నేపథ్యంలో కోలా కొమరమ్మ అనే మహిళ ఒక మేకను కోయటానికి జెల్ల శ్రీకాంత్ (14) పత్రి అశోక్ లను పిలవగా మేకను కోసిన తర్వాత శ్రీకాంత్ అతని చేతులకు అంటిన రక్తాన్ని నీళ్ల తొట్టిలోని నీటితో శుభ్రపరుస్తుండగా తొట్టిలోని నీటితో చేతులను ఎందుకు కడుగుతున్నావని ఆగ్రహించిన కొమురమ్మ కులం పేరుతో దూషిస్తూ విచక్షణ రహితంగా కర్రతో కొట్టడంతో బాధ భరించలేక మనస్థాపం చెంది సమీపాన ఉన్న గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉండడంతో ఇది గమనించిన స్థానికులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు బాలుడు మృతి చెందడంతో గ్రామంలోని విషాద ఛాయల అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడి చిరుప్రాయంలోనే తండ్రి మృతి చెందాడు. మృతునికి తల్లి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మృతుడి తల్లి జెల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కోల కొమరమ్మపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై గోవర్ధన్ పేర్కొన్నారు.

పురుగు మందుల చట్టంపై అవగాహన.

పురుగు మందుల చట్టంపై అవగాహన 
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి      
      
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మొగుళ్ళపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారులకు(డీలర్లకు) రైతు వేదిక మొగుళ్ళపల్లి లో విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల చట్టాలపై అవగాహన/సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో   ఈ క్రింద సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని . 
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా  
    ఎదురుగాపెట్టాలి. లైసెన్సు లేకుండా విత్తనాలు గాని, ఎరువులు గాని మరియు పురుగు 
    మందులు అమ్మకం చేయరాదు. డీలర్ యొక్క షాప్ పేరు, ఇంటి/డోర్ నెంబర్ మరియు ఇతర  
    వివరాలు పేయింట్ తో రాయాలి
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి. డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు  
    ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి. 
కంపనీల నుండి వచ్చే సరుకులకు ఇన్వాయిస్ లేనిదే అమ్మకాల స్థలంలో లేదా గోదాముల్లో 
    దింసుకోనరాదు.బిల్లు మరియు డి.సి.లు లేనిదే స్టాక్ సరఫరా చేయరాదు.స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్ 
     బోర్డుపై రాయాలి.బ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును.లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా  
      పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా   నిల్వచేయాలి. డీలర్లు తామ యొక్క లైసెన్సు గడువు మీరినట్లైతే ఎటువంటి అమ్మకాలు జరపరాదు.డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం  జరపరాదు.లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలి.డీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి.
 స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి మరియు. అలాగే అన్ని గ్రామాల డీలర్లు, AEO లు ఇట్టి సమావేశంలో పాల్గొన్నారు

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు 40.000 ఆర్థిక సాయం
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన మారుముళ్ల కుమారస్వామి
అనే కౌలు రైతు, అప్పుల బాధతో 21-10 -2015 నాడు పురగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది
తమ స్వంత భూమితో పాటు కొంత భూమి ని కౌలు తీసుకొని అందులో పత్తి,వరి పంటలు సాగు చేయగా అందులో పంట దిగుబడి రాకపోవడం వలన 3 లక్షల వరకు అప్పులు కాగా
తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇతనికి ఇద్దరు పిల్లలు, కూతురు,కొడుకు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక వారు పరామర్శించి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా వారు స్పందించి ఆ సంస్థ ద్వారా 40,000 నలభై వేయిల రూపాయల ఆర్థిక సహాయంతో మేకలు కొని ఇవ్వడం జరిగింది.

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు, బి, కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 194, జి ఓ ల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు,
6,00,000,రూలు, నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నూరి సదానందం రాచపల్లి సమ్మయ్య ఇంజన్ చైతన్యలు పాలుగోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version