సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోనీ ఈరోజు సిరిసిల్ల సాహితి సమితి అధ్యక్షులు జానపాల శంకరయ్య, మరియు కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మల్లేష్ చక్రాల కోనరావుపేటకు చెందిన రచయిత (ధర్పణం)కవిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.అధ్యక్షులు జానపాల శంకరయ్య మాట్లాడుతు..ధర్పణం పుస్తకం నేటి సమాజంలో
నేటి యువతకు ఎంతగానో తొడపడుతున్నది.
సాహిత్యంతో నేటి యువత సద్వినియోగం చేసు కొని సమాజం లో ఉన్న అసమానతలు తొలిగించాలి అని తెలిపారు. అలాగే బాల సాహిత్య వేత్త వాసరవేణి పర్శరాములు మాట్లాడుతు పుస్తక రచయిత తన అక్షరాలను పూల మల్లికాల కుర్చీ
సమాజానికి తెలియజేస్తుంది అని తెలిపారు.
మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంధర్ మాట్లాడుతు ధర్పణం ఒక అద్భుతం పుస్తకం అని
అంతేకాకుండా సమాజంలో జరిగే పరిమానాలు
తెలియజేసే విధంగా ఉన్నది అని తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల మానేరు కవులు, రచయతలకు ఒక పుట్టిన్నీళ్లు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కోడం నారాయణ, బూర దేవానందం, ఏనుగుల ఎల్లయ్య,గడ్డం పర్శరాములు,గాయకుడు సుల్తానా మల్లేష్,
అంకారపు రవి, తదితరులు పాల్గొన్నారు.

మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ.

మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ…

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిబాపూ పూలే ఆలోచన విధానం తో బిసి లు అందరూ ఐక్యవేదిక కిందికి రావాలని బీసీ బంధువుల సమక్షంలో సిరిసిల్ల జిల్లా శాఖ గాంధీ చౌక్ లోను మాస్ కన్వీనర్ వెంగల లక్ష్మణ్ జెండా ఆవిష్కరించారు.పాత బస్టాండ్ నేతన్న సాక్షిగా కన్వీనర్ డాక్టర్ జనపాల శంకరయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దొంత ఆనందం గారు ,రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటి యాదవ్ ,పాల్గొని విద్యార్థుల విద్యా ఉద్యోగాల అవకాశాలలో బీసీలకు కేటాయించిన సీట్లు తారుమారు కాకుండా ఉండాలంటే బీసీలు ప్రశ్నించే తత్వం డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఎంతోమంది బీసీ జనాభా ఉన్న అనైక్యత కారణంగానే ప్రశ్నించే తత్వం లోపించడం వల్లే ఎవరికో వంత పాడుతూ తిరగడం వల్లే బీసీల అనైక్యత చోటుచేసుకుందని ఈ కట్లను వదిలించుకొని ఐక్యంగా ముందుకు సాగితే అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగుతుందని వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యమైతే మనదే రాజ్యాంగ మై మన ఆత్మగౌరవాన్ని కాపాడు కుంటా మన్నారు అందుకు ఒక గేయాన్ని కోశాధికారి దొంత దేవదాస్ అందరూ పిలువ గానే తమ పనులను వదులుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు ఏనుగుల ఎల్లయ్య మాట్లాడుతూ అందరిని ఏకమైతే అధికారం సొంతమవుతుందన్నారు. కోడం నారాయణ బీసీ లందరూ సమైక్యత సాధిస్తే సాధికారం అందుతుందన్నారు. వెంగళ శ్రీనివాస్
గజ్జల్లి రామచంద్రం, ముత్తయ్య గౌడ్, కైరం కొండ నర్సింగ్ గంగపుత్ర రాష్ట్ర కార్యదర్శి,బూర దేవానందం, తడుక శ్రీహరి, దుంపటి కిషన్, మిరియాలు లక్ష్మణరావు,బాల రామస్వామి, మిరియాలుకార్,మేన రాములు, లైసెట్టి వెంకటేశం వడ్లకొండ తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ఆకాంక్షలే జన సమితి లక్ష్యం.

ఉద్యమ ఆకాంక్షలే జన సమితి లక్ష్యం

వనపర్తి లోఘనంగా జన సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలు

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో జన సమితి జెండా ను జిల్లా అధ్యక్షులు య౦ఏ.ఖాదర్ పాష.ఆవిష్కరించారు
. ఈ సందర్భంగా ఖాదర్ . మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షల సాదనే కర్తవ్యంఅని పేర్కొన్నారు.
ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేసిందని అన్నారు. నిరుద్యోగ సమస్యపై, రైతాంగ సమస్యపై, ఆర్టీసీ సమస్యలపై, ఆదివాసీల సమస్యలపై పోరాడుతూనే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం శ్రమించిందని అన్నారు గత పది సంవత్సరాలు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలను చైతన్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉద్యమ ఆకాంక్షల సాధనకు కృషి చేస్తుందని ఖాదర్ వెల్లడించారు. జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయని నిర్వహించామని తెలిపారు ఈ.
కార్యక్రమంలో.
య౦డి. షఫీ మైనార్టీ జిల్లా నాయకులు.
పిక్కిలి బాలయ్య మండల అధ్యక్షులు
శాంతారామ్ నాయక్.
కె వినోద్ కుమార్.పాన్ గల్
మైనుద్దీన్ సాబ్
జన సమితి జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ..

తెలంగాణ జన సమితి పార్టీ.!

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా
జెండా ఎగరవేసిన

తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్చార్జ్ ఎలిశాల రాజేష్

వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లంద గ్రామంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఎలిశాల రాజేష్ ఇంటి ఆవరణలో జెండా ఎగరవేసిన సందర్భంగా ఎలిశాల రాజేష్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో పోరాటాలకు పిలుపునిచ్చి రాష్ట్రాన్ని సాధించినం సబ్బండ వర్గాల ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆశయాలతో ముందుకు వెళతామని ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటం చేస్తూ వారి వెంట ఉంటామని తెలియజేస్తూ ఏడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట మండల నాయకులు పెద్దూరు నాగరాజు పరకాలఅజయ్ కుమార్ పాల్గొన్నారు.

రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి.!

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

ఏప్రిల్ 27న ఎల్కతుర్తి లో జరగబోయే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సభను రజక సంఘo కుల బంధువులు, రజక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఈరోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి (చందు)ఆధ్వర్యంలో తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్, ముస్తబాద్ మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ బిసినెస్ సెల్ కన్వీనర్ నమిలి నరసింములు,యూత్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజు యకయ్య,బీఆర్ఎస్ నాయకులు మచ్చ రవీందర్,పిల్లల తిరుపతి, ఒరుగంటి రమేష్ రజక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

 

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల సాహితి సమితి కార్యనిర్వాహణలో ఘనంగా వేడుకలు జరిగినది. సాహితి సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే అని జ్యోతిరావు పూలే భావితరాలకు ఆశ కిరణం అనిజ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీ సమితి కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, కవి రచయిత జుకంటి జగన్నాధం, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపురి బుచ్చయ్య, గుండెల్లి వంశీ, ఎండి ఆఫీజ్, గజ్జెల్లి సత్యనారాయణ, అంకారపు రవి,కవులు రచయితలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version