24 న మాదన్నపేటలో అమరవీరుల సంస్మరణ సభ

24 న మాదన్నపేటలో అమరవీరుల సంస్మరణ సభ

ఎంసిపిఐ (యు) డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈ నెల 24న నర్సపేట మండలం మాదన్నపేట గ్రామంలో జరిగే అమరవీరుల సంస్మరణ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంసిపిఐ (యు) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.ఈ మేరకు మంగళవారం మాదన్నపేట లో సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.పీడిత ప్రజల కోసం,మనిషిని మనిషి దోపిడి చేసే వ్యవస్థ మార్పుకోసం దొరల దోపిడి దారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అమరులైన వీరులను స్మరిస్తూ సంస్మరణ సభ జరుగుతుందన్నారు.వరంగల్ జిల్లాలో ఉప్పెనల ప్రజా పోరాటాలను చూసిన నాటి పాలకవర్గ పార్టీ కాంగ్రెస్ అండదండలతో భూస్వాములు , ప్రజా కంఠకులు , పీడిత ప్రజా ఉద్యమాలపై కక్షకట్టి సాగించిన మారణహోమంలో ఆణిముత్యంలాంటి విప్లవ ముద్దుబిడ్డలు నేలకొరిగారని గుర్తు చేశారు.ఈ సభలో పార్టీ రాష్ట్ర నాయకుల ప్రసంగాలు,ప్రజానాట్యమండలి కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించబడతాయన్నారు.వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని రాజమౌళి కోరారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం,కర్నే సాంబయ్య,అనుమాల రమేష్,గుర్రం రవి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version