సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ఈనెల 25న ములుగు జిల్లా వెంకటాపూర్ లో ముదిరాజ్ ల సింహగర్జన సభ చైతన్య ర్యాలీకి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటూ,అందరం ఒక తాటిపై వచ్చి సభను సక్సెస్ చేశామని సభకు అహర్నిశలు కష్టపడి విజయతీరాలకు చేర్చిన మెపా ఫౌండర్స్ మెంబర్స్,మెపా కోర్ కమిటీ సభ్యులకు,పిలవగానే సభకు వచ్చిన గౌరవ,ముఖ్య అతిథులకు,ముదిరాజ్ బందు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,వివిధ జిల్లా,మండల,గ్రామాల ముదిరాజ్ కుల బాంధవులకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ
ముదిరాజ్ ల బలగం,బలాన్ని,గలాన్ని చాటి చెప్పమని,మన హక్కుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసంవిద్య,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్దామని తెలిపారు.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆద్వర్యంలో కలం యోధుడు ఉద్యమనేత సీనియర్ పాత్రికేయులు దివంగత జర్నలిస్టు మునీర్ అన్నకు బెల్లంపల్లి పాత్రికేయుల నివాళులు అర్పించారు. సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్ర
పటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సజ్ను ఫఫీ మాట్లాడుతూ మునీర్ భాయ్ పత్రికా రంగానికి విశేష సేవలు అందించడం తోపాటు కార్మిక వర్గానికి చేసిన సేవ లను గుర్తు చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మడమతిప్పని పోరాటాలు చేసిన మహనీయుడని, పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయుడుగా రాణిస్తూ విశ్లేషణాత్మకమైన కథనాలతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషిని చేయడం జరిగిందని, నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో
బాధ్యతలు స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిని ప్రదర్శించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన మునీర్ భాయ్ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్ర
మంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ టేకుల బస్తి ఉపాధ్యక్షుడు ఇరుకుల్ల రమేష్,
ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే,కోశాధికారి కత్తుల నవీన్,కార్య
వర్గ సభ్యులు టి.శ్రావణ్, కె.రమేష్ ,
కె.సాగర్, ఉపాధ్యక్షుడు దండబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి సుభాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు నేడు పూర్ణాహుతితో ముగిశాయి. సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం.

మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం..

పెద్దపల్లి జిల్లా నేటి ధాత్రి:

వరంగల్ జిల్లాలోని మామునూరు క్యాంప్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) గా ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఈర్ల కృపావరం భార్య స్నిగ్ధ పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా ఆర్ ఎస్సై మాట్లాడుతూ తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఏరియాలోని బొంకూరి కాలనీకి చెందిన ఆర్ఎస్ఐ కృపావరం భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఆ జంట ఇతరులకు ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు.

నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన.!

నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే పాయం కు ఘన స్వాగతం పలికిన కొమరారం గ్రామ ప్రజలు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చిన ఎమ్మెల్యే పాయం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం నుండి గుండాల మండల కేంద్రానికి వయా శెట్టిపల్లి, శెంబునిగూడెం గ్రామ పంచాయతీ మీదుగా నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ని సోమవారం రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ప్రయాణికులతో కొమరారం నుండి గుండాల వరకు బస్సులో ప్రయాణించి లింగాపురం పోతురాజు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు ప్రయాణికులతో ఆప్యాయతగా మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కొమరారం నుండి శెట్టిపల్లి వరకు బస్ సర్వీసును తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఈ ప్రాంతానికి బస్ సర్వీసును ఏర్పాటు చేశామని గుండాల మండల ప్రజల సమక్షంలో బస్ సర్వీస్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు. బస్సు ప్రయాణించే రోడ్డు మార్గంలో గ్రామస్తులు ఎమ్మెల్యే ని స్వాగతిస్తూ పూలమాలలతో వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన పినపాక నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్న ప్రజా నాయకుడు ఎమ్మెల్యే పాయం ని గుండాల మండల ప్రజలు అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి ,గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముత్యమాచారి,మాజీ ఎంపీపీ చాట్ల పద్మ ,పిఎస్ఆర్, పీవీఆర్ మండల కోఆర్డినేటర్ ఖదీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RTC

 

35 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే

ఎమ్మెల్యే పాయం కు ఘన స్వాగతం పలికిన గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండాల మండల పర్యటనలో భాగంగా గుండాల మండలంలో ని నల్లచేలక, శoభూనిగూడెం,గుండాల ఎస్టీ కలనీ,మటన్ లంక,జామరిగూడెం
పరిధిలో 35 లక్షల అంచన ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్నామని తెలియజేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
తదితరులు పాల్గొన్నారు.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే

బాలానగర్  నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వీధుల్లో సీసీ రోడ్డు లేకపోవడంతో మట్టి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటో స్టాండ్ సమీపంలో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో.

జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో
బండి సంజయ్ కి వినూత్న వినతి పత్రం
జమ్మికుంట నేటిధాత్రి:

స్థానిక జమ్మికుంట పట్టణంలో గల పాత అంబేద్కర్ వద్ద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి చిత్రపటానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సెక్రెటరీ సజ్జు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ లు మాట్లాడుతూ;
జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ లో కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మాణం ప్రారంభించాలని, మరియు కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి ఒకసారి నడిచే ఎక్స్ ప్రెస్ రైలును రోజు నడిపించాలని అదేవిధంగా పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను దక్షిణ్ అప్ అండ్ డౌన్, దానాపూర్, నవజీవన్, గ్రాండ్ ట్రంక్ లాంటి ఇతర రైళ్లను జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్లో ఆపవలసిన అవసరం ఎంతగానో ఉందని తెలియజేసారు. జమ్మికుంట – హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి గానీ, ఈ ప్రాంతం అభివృద్ధి గానీ ఎంపీగా గెలిచినప్పటి నుండి నేడు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నప్పటికి కూడా హుజురాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి, బర్రెకు సున్నమేసి ఇది ఆవు అనిపించేలా ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇకనైనా హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోని కేంద్రం నుండి రావలసిన నిధులు అన్నిటిని తీసుకొచ్చి జమ్మికుంట మరియు హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మరియు ఇల్లంతకుంట దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి రెండవ దేవస్థానం కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుండి నేటి వరకు కూడా ఈ దేవస్థానానికి నయా పైసా కూడా తీసుకురాని నేటి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు రామభక్తుడిని నేనని ఎప్పుడు చూసినా రామజపం చేస్తూనే ఉంటాడే తప్ప ప్రజల అభివృద్ధి గాని ప్రాంత అభివృద్ధి గాని తనకు అవసరం లేదనట్టుగా ప్రవర్తిస్తూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, ఇకనైనా ఈ నియోజకవర్గ ప్రజలను ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, హుజరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, యూత్ నాయకులు పతకాల ప్రవీణ్, పచ్చిమట్ల భాను, ఏరెడ్డి సతీష్, రాగల్ల శివ, బండి పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

 

నడికూడ నేటిధాత్రి:

నడికూడ మండల కేంద్రం లో స్థానిక మండల రెవెన్యూ ఆఫీస్ లో తాహసిల్దార్ రవీందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి దొగ్గేల వినయ్,వరికోలు గ్రామ కమిటీ అధ్యక్షులు దేవు రమేష్, తదితరులు పాల్గొన్నారు

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం.

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలంలోని అజిలాపురం, కుందారం తండా, లాలు తాండ, గ్రామాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీ చేయడం జరిగింది.ఈ పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధగొని రమేష్ గౌడ్ , ఆశ వర్కర్ కలమ్మ, సిద్ధగోని పరమేష్, బుడ్డ రాములు, ఆర్కే గౌడ్, కుమార్, ఎండి ఖాజాబీ, కాలే నరసింహ, ఎండి జాఫర్, నిరంజన్, లింగం, కేశముని పరమేష్, కొప్పుల యాదయ్య , మహేష్, రామచంద్రి, దాములా నాయక్, రమేష్ నాయక్ , వెంకటేష్ నాయక్ గ్రామ పెద్దలు మహిళలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలోనే
నాణ్యమైన విద్య

నిజాంపేట నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో సోమవారం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతను విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యతో పాటు పౌష్టికాహారం కూడా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, దశరథం లు ఉన్నారు.

బీరప్ప కళ్యాణంలో కంట రెడ్డి తిరుపతిరెడ్డి.

బీరప్ప కళ్యాణంలో కంట రెడ్డి తిరుపతిరెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప కామరాతిల కళ్యాణ మహోత్సవం కురుమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కే. వెంకటాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప కళ్యాణానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంట రెడ్డి తిరుపతిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిపంటలు సుభిక్షంగా ఉండీ రైతులకు అధిక ధాన్యం దిగుబడి రావాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందన్నారు. బీరప్ప కళ్యాణం లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మావురం రాజు, ఎల్లం యాదవ్, దుర్గయ్య,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి.

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి

తిరుగు ప్రయాణం లో స్వామివారి దర్శనం

చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో గత 12 రోజులుగా కొనసాగుతున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కోటగుళ్లను సందర్శిస్తున్నారు. సోమవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతా నికి చెందిన భక్తులే కాకుండా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులు కూడా కోట గుళ్ళ ను సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఆలయ విశిష్టతను వివరించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు.

రైతులకు సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ.

రైతులకు సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

కేసముద్రం నేటి ధాత్రి:

కేసముద్రం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు ఏవో బి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వ్యవసాయ శాఖ 50% సబ్సిడీ ద్వారా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన, రైతులకు అందజేసిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు, కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఏవో వెంకన్న మాట్లాడుతూ మండలం రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సగం ధరకే అందిస్తుందని రైతులు యొక్క పంట పాస్ పుస్తకాల జిరాక్స్ మరియు ఆధార్ కార్డు లను జతపరచి రైతు సేవ కేంద్రంలో సమర్పించి సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాలను సగం ధరకే కొనుగోలు చేసుకోవాలని ఈ అవకాశం రైతులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.పచ్చి రొట్ట విత్తనాలను వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు పల్చగా వెదజల్లాలని అప్పుడే భూమి సాంద్రత పెరిగి మంచి పంట దిగుబడులను ఇచ్చి రైతుకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మండలంలోని రైతు సేవా కేంద్రాలలో పచ్చి రొట్ట విత్తనాలు 800 బస్తాలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా రైతులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,ఆగ్రోస్ నిర్వాహకులు గోపాల వెంకట్ రెడ్డి, రాజు, అగ్రికల్చర్ విస్తరణ అధికారులు రాజేందర్, రవి వర్మ, సాయి చరణ్,లావణ్య, ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్.

జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్…

తిరుపతి(నేటి ధాత్రి) మే 27:

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు 100 మంది మహిళ కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇంచార్జ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇంచార్జ్ పొన్నా యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో వందమందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు.మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వందమంది ఆధార, అభిమానాలు పొందిన నల్లాని నిర్మల కి పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి మరియు జనసైనికులు నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు.

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు గండ్ర సత్తన్న

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రానికి చెందిన అల్లెపు హరీష్ ఇటీవలే మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గణపురం టౌన్ ప్రెసిడెంట్ ఓరుగంటి కృష్ణ భూపాలపల్లి జిల్లాయువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ సీనియర్ నాయకులు దూడపాక దుర్గయ్య మాజీ వార్డ సభ్యులు గ్రంథం ఓధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు

నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం.

నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

తెలంగాణ ప్రభుత్వం సాహిత్య అకాడమీతో కలిసి యువ కథకుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కథల కార్యశాల తేదీ 27 మే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రవీంద్రభారతి మినీ హాల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ కథల కార్యశాలలో ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ “కథలు ఎలా రాయాలి” అనే అంశంపై యువ కథకులకు రోజంతా శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కొత్తగా రాస్తున్న యువ రచయితలకోసమే నిర్వహిస్తున్న కార్యశాల అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి పేర్కొన్నారు.పెద్దింటి ఇప్పటికే యూనివర్సిటీలలో, డిగ్రీ కళాశాలలలో అనేక కథల కార్యశాలలు నిర్వహించారు. ఆయన రచించిన కథలు, నవలలు పలు యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కథలు పాటలు మాటలు రాస్తున్నారు.

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సహారా ఇండియా బాధితుల సంఘం సమావేశమై ఈ క్రింద పేర్కొనబడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించనైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్ మాట్లాడుతూ సహారా డబ్బులు విషయంపై మందమర్రి ఏజెంట్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్. టి. రావు ను నిలదీయగా గత ఐదు నెలల క్రితం లీగల్ నోటీసులు జారీ చేశారు.. అంటే అడిగితే న్యాయానికి సంకెళ్లు వేస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం? చట్టానికి కళ్ళు ఉన్నాయని నిరూపిస్తాం. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గాని ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు భారతీయ శిక్ష స్మృతి ప్రకారం అని పేర్కొన్నారు. ఈ విషయం పై త్వరలో జిల్లా కలెక్టర్, రామగుండం సిపి పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి పత్రం అందజేసి. అనంతరం ధర్నాలు రాస్తారోకలు గ్రామాల నుంచి మండలాల వరకు మండలం నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు పోరాడి మా డబ్బులు మాకు తెచ్చుకునే దిశగా ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. అలాగేసింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జల్లి వెంకటయ్య మాట్లాడుతూ
సహారా ఇండియా సంస్థలో కాలపరిమితి పూర్తి అయిన ఖాతాదారులకు వెంటనే సహారా సంస్థ డబ్బులు చెల్లించాలి. అలాగే బెల్లంపల్లి మంచిర్యాల నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి సహారా ఇండియా మేనేజర్లకు బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి తీర్మానం చేయనైనది.సంవత్సరాల తరబడి సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ డిపాజిట్లు చెల్లించకపోవడం వలన వృద్ధులు వితంతువులు సీనియర్ సిటిజల్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఇతరులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయంపై కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కి అదేవిధంగా బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల శాసనసభ్యులకు కూడా సహారా బాధితుల పక్షాన వినతి పత్రాలు సమర్పించి బాధితులను ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతూ తీర్మానించడమైనది.ఇట్టి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, డి. రాజమౌళి నస్పూర్, డి. కొమురయ్య గంగారం, వెంబడి రాజేందర్ బెల్లంపల్లి, బొల్లు రాంబాబు మందమర్రి, దండు మల్లయ్య, యాదన్న, రాజమల్లు, సదానందం, నోముల వెంకన్న, సత్యనారాయణ, అజారుద్దీన్, ఓదేలు తదితరులు మహిళా సహారా బాధితులు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గడ్డం నర్సయ్య

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

ఈరోజు ఇటీవల తెలంగాణ నూతన సమాచార కమీషనర్ గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు పి.వి. శ్రీనివాస్ ని హైదరాబాద్ లోని వారి కార్యాలయములో టీ.పి.సి.సి మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి.

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి..

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన కథనంప్రకారం, తనకి చెందిన సుమారు రూ.30 వేల విలువగల గేదె రోజువారి రీత్యా మేతకి వెళ్లడం జరిగిందని, ఈ నేపథ్యంలో గేదె ఇంటికి రాలేదని చుట్టుపక్కల ఉన్నటువంటి చేనులలో తిరగడంతో గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందిందని తెలిపారు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుపై పెట్టకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడం విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై గేదె మృతి చెందిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని బాధితుడు వేడుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version