జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో.

జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో
బండి సంజయ్ కి వినూత్న వినతి పత్రం
జమ్మికుంట నేటిధాత్రి:

స్థానిక జమ్మికుంట పట్టణంలో గల పాత అంబేద్కర్ వద్ద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి చిత్రపటానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సెక్రెటరీ సజ్జు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ లు మాట్లాడుతూ;
జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ లో కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మాణం ప్రారంభించాలని, మరియు కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి ఒకసారి నడిచే ఎక్స్ ప్రెస్ రైలును రోజు నడిపించాలని అదేవిధంగా పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను దక్షిణ్ అప్ అండ్ డౌన్, దానాపూర్, నవజీవన్, గ్రాండ్ ట్రంక్ లాంటి ఇతర రైళ్లను జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్లో ఆపవలసిన అవసరం ఎంతగానో ఉందని తెలియజేసారు. జమ్మికుంట – హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి గానీ, ఈ ప్రాంతం అభివృద్ధి గానీ ఎంపీగా గెలిచినప్పటి నుండి నేడు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నప్పటికి కూడా హుజురాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి, బర్రెకు సున్నమేసి ఇది ఆవు అనిపించేలా ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇకనైనా హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోని కేంద్రం నుండి రావలసిన నిధులు అన్నిటిని తీసుకొచ్చి జమ్మికుంట మరియు హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మరియు ఇల్లంతకుంట దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి రెండవ దేవస్థానం కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుండి నేటి వరకు కూడా ఈ దేవస్థానానికి నయా పైసా కూడా తీసుకురాని నేటి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు రామభక్తుడిని నేనని ఎప్పుడు చూసినా రామజపం చేస్తూనే ఉంటాడే తప్ప ప్రజల అభివృద్ధి గాని ప్రాంత అభివృద్ధి గాని తనకు అవసరం లేదనట్టుగా ప్రవర్తిస్తూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, ఇకనైనా ఈ నియోజకవర్గ ప్రజలను ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, హుజరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, యూత్ నాయకులు పతకాల ప్రవీణ్, పచ్చిమట్ల భాను, ఏరెడ్డి సతీష్, రాగల్ల శివ, బండి పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version