ఆర్థిక ఇబ్బందుల్లో అంబులెన్స్ డ్రైవర్లు..

ఆర్థిక ఇబ్బందుల్లో అంబులెన్స్ డ్రైవర్లు

* 9 నెలలుగా పత్తాలేని జీతాలు
* బోరున విలపిస్తున్న అంబులెన్స్ డ్రైవర్లు

మహాదేవపూర్ జూలై 30 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆంబులెన్స్ డ్రైవర్లకు 9 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నామని ఒక ప్రకటనలో బుధవారం రోజున తెలిపారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత సంవత్సరం నవంబర్ నుండి ఈరోజు వరకు జీతాలు ఇవ్వలేదని తెలుపుతూ అప్పట్లో కలెక్టర్ కి మొర పెట్టుకోగా డిఏంటి నిధుల నుంచి జీతాలు వచ్చాయని ప్రస్తుతం సిపిఓ జీతాలను ఆపేసిండ్రని తెలుపుతూ 9 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆర్థిక పరిస్థితి ధయనియంగా ఉందని మా గోడు మన్నించి మాకు జీతాలు వచ్చేలా చేయాలని బోరున విలపిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నటీనటులను ఎడా పెడా బాదేసింది…

నిర్మాత ప్రవీణ పరుచూరి ‘కొత్తపల్లిలో’ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మంగళవారం ఈ సినిమా ప్రీవ్యూ షోను వేశారు.

‘కేరాఫ్ కంచరపాలెం’ (Care of Kancharapalem), ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma maheswara ugra roopasya) చిత్రాల నిర్మాత పరుచూరి ప్రవీణ (Paruchuri Praveena) తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘కొత్తపల్లిలో…’ (Kothapalli lo). ఒకప్పుడు అనేది దాని ట్యాగ్ లైన్. 1980, 90లలో కొత్తపల్లి అనే గ్రామంలో జరిగే కొన్ని సంఘటనలను సినిమాగా దర్శకురాలు ప్రవీణ తెరకెక్కించింది.

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా మీద ఉన్న నమ్మకంతో విడుదలకు మూడు రోజుల ముందే మీడియాకు ప్రివ్యూ షో వేసి చూపించారు. గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాలను, వాటి పర్యవసానాలను తెలియచేస్తూ ఈ సినిమా సాగింది. రామకృష్ణ అనే యువకుడి జీవితం రాత్రికి రాత్రి ఎలా తల్లకిందులైందనేది ఇందులోని ప్రధాన కథాంశం. దీన్ని మూఢ విశ్వాసాలకు, అగ్రవర్ణాల అహంకారానికి, జలగల్లా పీడించే వడ్డీ వ్యాపారుల క్రూరత్వానికి లింక్ చేస్తూ ప్రవీణ పరుచూరి సినిమాగా తీశారు.

ఇటీవల ఓ ఇంటర్వూలో ఆర్టిస్టుల పట్ల తాను సినిమా షూటింగ్ లో అనుచితంగా ప్రవర్తించానని, సన్నివేశం బాగా రావడం కోసం కొన్ని సందర్భాలలో వారిపై చెయ్యి చేసుకున్నానని, కోపంతో రాళ్లూ విసిరానని చెప్పుకోవచ్చారు. నిజానికి ఇవన్నీ సినిమా కథలో భాగంగానే ప్రవీణ పరుచూరి చేశారని ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అర్థమౌతోంది.

ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో నాగమణి అనే డీ గ్లామరైజ్డ్ పాత్రను ప్రవీణ పోషించారు. ఓ మారుమూల పల్లెటూరిలో అట్లు వేసుకుని జీవితాన్ని గడిపే నిరుపేదరాలు పాత్రను ఆమె చేసింది. హీరో ప్రేమ విషయంలో జరిగే తగవులో అతని తరఫున వకాల్తా పుచ్చుకున్న ఈ పాత్ర… అవతలి పాత్రలతో ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగుతుంది. జుత్తు జుత్తు పట్టుకుని ఇద్దరు మహిళలు వీరంగం సృష్టిస్తారు. దర్శక, నిర్మాత కూడా అయిన ప్రవీణ ఆ సమయంలో కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెచ్చిపోయి… అవతలి వాళ్ళను తన్ని తగలేసి ఆ సన్నివేశాన్ని రక్తికట్టించింది. చిత్రం ఏమంటే… ‘కేరాఫ్ కంచరపాలెం’లో వేశ్యగా నటించడానికి వెనుకాడని ప్రవీణ… ఇందులోనూ తన పాత్రను కించపరిచే సంభాషణలను సైతం రాయించుకుంది. అక్కడ పాత్ర తప్పితే… మనకు నిర్మాతో, దర్శకురాలో కనిపించరు.

అమెరికాలో కార్డియాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్న పరుచూరి ప్రవీణకు సినిమా అంటే ఎంత పిచ్చో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది. మరి ఎంతో కష్టపడి, ఇష్టపడి పరుచూరి ప్రవీణ తెరకెక్కించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే

బాలానగర్  నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వీధుల్లో సీసీ రోడ్డు లేకపోవడంతో మట్టి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటో స్టాండ్ సమీపంలో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’ 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి, చిన్నరేవల్లి, మోదంపల్లి, హేమాజీ పూర్ తదితర గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దరేవల్లి రైతు వేదిక వద్ద ఈదురు గాలులకు ఆరబెట్టిన ధాన్యం స్వల్పంగా తడిసింది. ఈదురు గాలులకు కుప్పలపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిందని రైతులన్నారు. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ సైతం కూలిపోయిందన్నారు.

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: జిల్లాస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకు ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన, అధికారులు ఆదేశాలు జారీచేసిన కింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పూర్యా నాయక్ తండా, రామ్ చందర్ నాయక్ తండా , టోప్యా నాయక్ తండాలలో పలు సమస్యలు నెలకొన్నాయి. గురువారం పలు తండాలను పరిశీలించగా బోజ్యానాయక్ తండా లో సగం మందికి మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మరి కొంతమందికి నీటి సరఫరా కావడం లేదు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ గత మూడు నెలల నుంచి పనిచేయకపోవడంతో మూలన పడింది.పాఠశాల ఆవరణలో నర్సరీ పెంపకం నిర్లక్ష్యంగా కనిపించింది. రామ్ చందర్ నాయక్ తండా కు సరైన రోడ్డు మార్గం లేదు. పూర్యా నాయక్ తండా లో మినీ ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉంది. మురికి కంపు కొడుతుంది. తండావాసులకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదు. టోప్యా నాయక్ తండాలలో ఇటీవలనే నూతనంగా మంచినీటి బోర్లు వేశారు. బోర్ నుంచి తండా వరకు పైప్ లైన్ వేయకపోవడంతో ఓ మహిళ రైతుకు చెందిన వ్యవసాయ పైపులను అమర్చి నీటిని అందిస్తున్నారు. సిసి రోడ్లు అసలుకే కనిపించలేదు. నాలుగు తండాలో కలిపి అనుసంధాన రోడ్లు లేక వైద్యం, ఇతర గ్రామాలకు వెళ్లే గిరిజనులు, బడికి వెళ్ళే విద్యార్థులు వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే టోప్యా నాయక్ తండాకు గ్రామపంచాయతీ కార్యదర్శి సందర్శించడం లేదని గిరిజన వాసులు వాపోయారు.

సమస్యలు పరిష్కరిస్తాం.. ఎంపీడీవో సుధాకర్

బోజ్యానాయక్ తండా గ్రామపంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ వివరణ కోరగా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పైప్ లైన్ విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version