శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవము.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ మరియు ఝరాసంగం మండల సరిహద్దు ప్రాంతందిగ్వాల్. ఈదులపల్లి ప్రాంతం లో గల శ్రీ మైసమ్మ దేవాలయం లో జరిగే జాతర ఉత్సవాలసందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని స్థానిక యం యల్ ఏ మాణిక్ రావ్ ఆఫీస్ .లో ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరణ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఉస్త వాలు ఘనంగా నిర్వహిస్తారాని ఇట్టి కార్యమం లో ప్రజా ప్రతినిధు స్థానిక అధికారులు నాయకులు .మైసమ్మ తల్లి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి ఉస్తావాలను విజయవంతం చెయ్యాలని పరమేశ్వర్ పాటిల్ పిలుపు నిచ్చారు.

కొనుగోలు వేగవంతం చేయాలి.

కొనుగోలు వేగవంతం చేయాలి

తాసిల్దార్ శ్రీనివాసులు

నిజాంపేట నేటి ధాత్రి:

ఐకెపి, సోసైటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనుగోలు జరుగుతుందని మండల తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యగా 7 సెంటర్లు పూర్తయ్యాయని 8 సెంటర్లు పూర్తి కాలేవున్నారు. మరో మూడు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తాం అన్నారు.

నిధులు లేక గ్రామాల్లో నిలిచిన పనులు.

నిధులు లేక గ్రామాల్లో నిలిచిన పనులు

-బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు
మొగులపల్లి నేటి ధాత్రి:

 

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కళకళలాడిన గ్రామపంచాయతీలు..ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయని బీఆర్ఎస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు ఆరోపించారు. మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పాలక వర్గాలు లేక పాలన పడకేసిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువై గ్రామాలు సమస్యల్లో చిక్కుకొని కొట్టుమిట్టులాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకపోవడంతో..నిర్వహణ భారం మోయలేక పంచాయతీ కార్యదర్శులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఈ కాంగ్రెస్ పాలనలో దాపురించాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ట్రాక్టర్లను కొనుగోలు చేయించిందని, పారిశుద్ధ్య నిర్వహణకు, ఇతర పనులకు వాహనం తప్పనిసరి కావడంతో ఆ భారం పంచాయతీ కార్యదర్శులకు తప్పడం లేదన్నారు. రుణం పై వాహనాలను కొనుగోలు చేయడంతో..ప్రతి మూడు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో డీజిల్ కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సిబ్బంది తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిధులు రాకపోవడం..వసూలు చేసిన పన్నులు సరిపోకపోవడంతో పారిశుద్ధ్య, మంచినీటి నిర్వహణ, ట్రాక్టర్ ఇతర వాటికోసం తప్పనిసరిగా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించాల్సి వస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు తనతో వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పలుచోట్ల లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్తున్నారని, ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడంతో..బదిలీ అయిన అనంతరం ఖర్చు చేసిన డబ్బులను ఎలా తీసుకోవాలన్న ఆందోళన కార్యదర్శుల్లో నెలకొందన్నారు.

పెన్షన్ల కోసం ఎదురు చూపులు.

పెన్షన్ల కోసం ఎదురు చూపులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రైకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగమైన వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. బుధవారం ఉదయం జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలానికి చెందిన పలువురు వృద్ధులు తెలిపారు.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్.

యాదాద్రి నరసింహస్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి:

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి.

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి

పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గురువారం భూపాలపల్లి జవహర్ నగర్ కాలనీలోని 8వ వార్డు 27వ వార్డు కాలనీలో గత 30సంవత్సరాల నుండి కాలనీలో రేషన్ షాపు లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువెళ్లిన కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి నేడు ఉదయం 9:00 గంటలకు ఐస్క్రీం కంపెనీ దగ్గర రేషన్ షాపు ఓపెన్ చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది రేషన్ షాప్ ఓపెనింగ్ తో పాటు పోచమ్మ టెంపుల్ ఆలయం లో బోరు ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కాలనీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధానం అభియాన్ వార్డు బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి హాజరవుతారు
కావున కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఐఎన్ టియుసి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులకు కార్యకర్తలకు అండ్ వార్డు ప్రజలకు పిలుపునిస్తున్నాం

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన.

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి:

ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ సింగరేణి కాలరీస్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ మందమరి నందు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ ను ఉద్దేశించి డివిజనల్ మేనేజర్ సింగరేణి సూపర్ బజార్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి పాలకుర్తి రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఆదేశానుసారము ప్రతి ఒక్క వంటగ్యాస్ వినియోగదారుడు వారి గ్యాస్ కనెక్షన్ నిమిత్తము.

Indian Gas

ఈ-కేవైసీ అనుసంధానం చేసుకునే కొరకై సహకరించాలని కాల పరిమితి అయిపోయిన గ్యాస్ పైప్ ను వెంటనే మార్చుకోవాలని లేని యెడల ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన తెలిపారు ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్ ఎల్ పి జి కోఆర్డినేటర్ రాజు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఇన్చార్జ్ మాధవరావు ప్రసాద్ మరియు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ రామకృష్ణాపురం, మందమరి, బెల్లంపల్లి పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

భూసేకరణ వేగవంతం చేయండి కలెక్టర్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు, నిజ్జా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శంకర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ రెండు పనులు పూర్తయితే జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. నిమ్స్ కు 12, 500 ఎకరాలకి 7500 ఎకరాల భూ సేకరణ చేసి సేకరించిన భూమికి రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు.

ఏం తినేటట్లు లేదు ఏముకునేటట్లు లేదు

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులు మాటలకే పరిమితమా సింగరేణిలో కాంట్రాక్టు అంటే ఎగిరి గంతేస్తున్న బడా కాంట్రాక్టర్లు ? 8 రాష్ట్రాలలో అమలైనా హై పవర్ కమిటీ వేతనాలు మన తెలంగాణ రాష్ట్రం సింగరేణి బొగ్గు బావిలో ఎందుకు అమలు కాలేదు ఎవరిది వివక్షత సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీతాలు పెరిగితే జీర్ణించుకోలేకపోయే అప్పుడున్న పెద్దలు ఎవరు ఐ పవర్ కమిటీ వేతనాలలో సంతకాలు ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు కట్టు బానిసల వల్లే పని చేయాలని అర్థమా
తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మా శ్రమ మా కష్టం కడుపు మార్చుకో నీ పని చేస్తేనే దేశానికి వెలుగులు సింగరేణి పర్మనెంట్ కార్మికులకు తో సమానంగా పనిచేస్తున్న కానీ కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనం లేక హరి గౌస పడుతున్న విషయాన్ని సింగరేణి యాజమాన్యానికి తెలియదా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న సింగరేణి కాంటాక్ట్ కార్మికుల ఓటు బ్యాంక్ తో చెలగాటలాడుతున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు పర్మినెంట్ కార్మిక సంఘాలు స్టేజీల మీద మాటలకే పరిమితం అవుతున్నాయి వేజ్ బోర్డు సమావేశాలలో ఏ ఒక్కరోజు కూడా కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయించలేని దుస్థితిలో ఈరోజు మనము ఉన్నామంటే సిగ్గుచేటు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కానీ ఈరోజు కూడా మాటలకే పరిమితం అవుతున్న కార్మిక హక్కులను కాలరాస్తున్నారు అని కార్మికులు గుసగుసలాడుతున్నారు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాలు కాంట్రాక్టు వ్యవస్థని కట్టు బానిసలుగా మార్చే దిశగా పయనిస్తున్న ఆశ్చర్యపడేది లేదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలు ఈరోజు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం సింగరేణి బొగ్గు బావుల్లో పదకొండు డివిజన్లో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఎదురుచూపు కె పరిమితం తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఉద్యమాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ గారు సకల జనుల సమ్మెలో ప్రతి బొగ్గు బై పైన 11 డివిజన్లలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడి సకల జనుల సమ్మెలో 42 రోజుల సమ్మెను కాంట్రాక్టు కార్మికులు జీతం లేకుండా కుటుంబాలను ఆకలితో మార్చి సమ్మెలో విజయవంతం చేసిన ఘనత సింగరేణి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులది కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిపై కూర్చొని సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల లేరు అని నిండు అసెంబ్లీలో చెప్పి అవమానపరిచి కార్మికుల గొంతు కోశారు.నిజం కాదా
టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొట్టుకపోయి మార్పు జరగాలని ప్రజలు నిర్ణయాన్ని సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఏకతాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నాము సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత చరిత్ర సింగరేణి ప్రాంత బిడ్డలది కాదని ఈరోజు అడుగుచున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు 11 రివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని మాట్లాడి ఒక తాటిపైన ఉండి సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 22 జీవో.ఐ పవర్ వేతనాలు ఇప్పించే దిశగా మీరు ముందుండి కార్మికులకు అండగా ఉంటారని గడిచిన సంవత్సరం నెలలో రామగుండం ఎమ్మెల్యే ఒక్కడు రెండుసార్లు మాట్లాడడం జరిగింది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆశతో ఉన్నారు వారికి అతి తక్కువ వేతనాలు ఉన్నాయి వారికి కచ్చితంగా మనము ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని.22వ జీవో అమలు చేయాలని చెప్పడం సంతోషకరమైన విషయం కానీ అదే పది డివిజన్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆరోజు ప్రస్తావించి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియజేసి ఉంటే ఈరోజు కాంట్రాక్టు కార్మికులకు ఇంత అంత మేలు జరిగేది కూల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు ఈరోజు తెలియజేస్తున్నాం కార్మికుల పక్షాన విన్నమిస్తున్నాము అర్ధిస్తున్నాము వేడుకుంటున్నాము సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కాంటాక్ట్ కార్మిక సోదర సోదరీమణులకు జీతాలు పెంచే దిశగా మీరు అడుగులు వేయాలని మీ వెనకాల మేము ఉంటామని కాంగ్రెస్ పెద్దలకు మా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము

విత్తన దుకాణాలలో తనిఖీలు.

విత్తన దుకాణాలలో తనిఖీలు

ఎం ఏ ఓ సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

మండల కేంద్రంలో గల విత్తన దుకాణాలను వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఇన్చార్జ్ ఎస్సై సృజన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు విత్తన చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించాలన్నారు. రైతులకు అమ్మిన విత్తనాలను బిల్లు రూపంలో అందించాలన్నారు.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చిన్న బోనాల మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గాం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, మరియు జిల్లా కలెక్టర్ కి , సంబంధిత జిల్లా పశు వైద్యాధికారులకు విన్నవించడం ఏమనగా, నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బోనాల లో నిన్న మమిండ్ల నాగరాజు అనే రైతు యొక్క ఆవు పిడుగుపాటు గురై మరణించడం జరిగినది తెలిపారు. ఆ రైతు యొక్క జీవన ఉపాధి పశువులపైనే ఆధారపడి ఉన్నందున, సుమారు 50 వేల నుండి 80 వేల విలువగల ఆవు మరణించినందునకు, ఆ రైతు రోధిస్తున్నాడు తెలిపారు.కావున వెంటనే ప్రభుత్వం తరఫున రైతుకు నష్ట పరిహారాన్ని చెల్లించి, జీవన ఉపాధిని కల్పించాలని స్థానిక మాజీ కౌన్సిలర్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలిపారు.

50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు.

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి.మండలం కస్పే కట్కూరు గ్రామానికి చెందిన శనిగరం దిలీప్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా. వారి. తల్లిదండ్రులను . కుటుంబ సభ్యులను. పరామర్శించి. మనోధైర్యం ఇచ్చి. వారి కుటుంబానికి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ. సత్తు శ్రీనివాస్ రెడ్డి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేసిన సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఈ oదుకుగాను బాధిత కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి. వారి కుటుంబానికి. పార్టీ పరంగా కాను ప్రభుత్వపరంగా కాను. అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. బాధిత కుటుంబానికి సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్. కే రాజేశ్వరరావు. కిషన్ కుటుంబ సభ్యులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి:

 

ఈ నెల 26,27 న హసన్ పర్తిలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హనుమకొండ జిల్లా మహాసభలలో భాగంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావుకి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ర బిక్షపతికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,పరకాల కార్మికులకు పక్షాన నియోజకవర్గంలో ఉన్న చర్లపల్లి,పోచారం తదితరుల గ్రామాలలో కార్మికులు సంఘాలకు నాయకత్వం వహించి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మున్సిపాలిటీ భవన నిర్మాణం,హమాలీ బజార్,అమాలి ఐకెపిఆర్ లకోసం నా వంతు పనిచేస్తానని నాపై నమ్మకంతో ఈ పదవిని నాకు అప్పగించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండలం కేంద్రంలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ కేతక సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించారు.

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు.!

గుట్ట పై షెడ్డును కూల్చారు…మరి ఆశ్రమ కబ్జా కట్టడం పై చర్యలేవి..??

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు??

రెవెన్యూ అధికారుల కబ్జా నివేదిక పైన చర్యలేవి??

అధికారుల అత్యుత్సాహం కేవలం గుట్ట పైనేనా??

ఆశ్రమ భూ కబ్జా లో ముడుపులేమైన ముట్టాయా అని ప్రజల మాట ముచ్చట…

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

ఎల్లారెడ్డిపేట మండలం లో రెండు వేరు వేరు ప్రదేశాలలో భూకబ్జా సమస్య. వెంకటాపూర్ గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆ విషయంలో రెవెన్యూ అధికారులు నివేదిక ఉన్నతాధికారులకు పంపిన , హై కోర్ట్ సంగెం బాలయ్య భూమి కబ్జా గురి అయిందని అక్కడ ఉన్న అక్రమ కట్టడం కూల్చి వేయాలని ఆర్డర్ ఉన్న కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు.ఆ మౌనానికి ముడుపులేమైన ముట్టాయా అని మండల ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 14,15 వ తేదీలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని సింగారం గ్రామం లో కుల,మతాలకు అతీతంగా దర్శావళి గుట్ట పైన ప్రతి సంవత్సరం లాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న దర్గా లకు ఉర్సు పండుగ అంగరంగ వైభవంగా జరిపారు.ఈ క్రమంలో విశిష్ట అతిధుల ఆహ్వానం ఉండడం వలన అక్కడ ఉన్న గుట్టను చదును చేసి షెడ్ ని నిర్మాణం చేశారు. అది ప్రభుత్వ భూమిలో ఉందని కొద్దిరోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఒక పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

poor farmers

ప్రభుత్వ భూమిలో షెడ్ నిర్మాణం జరిగింది అని మే 27 న ఉదయం అధికారులు, పోలీసుల సమక్షంలో జెసిబి తో ఆ నిర్మాణాన్ని కూల్చారు.ఈ రెండు సమస్యలో కబ్జా అనేది కనిపిస్తున్న అధికారులకు,ఆ పార్టీ నాయకులకు కేవలం దర్శావళి గుట్ట ను రాజకీయం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ భూమి, పేద రైతు భూమి కబ్జాకు గురై అధికారుల నివేదిక,హై కోర్ట్ ఆర్డర్ లు ఉన్న కూడా పట్టించుకొని అధికారులకు దర్శావళి గుట్ట పైన షెడ్ నిర్మాణం కబ్జా భూమి లో జరిగిందని అధికారుల అత్యుత్సాహాన్ని చూస్తే ఓ మౌజయ ఆశ్రమానికి సంబంధించి ముడుపులు ఏమైనా ముట్టాయ అని ప్రజలు నుండి సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. అధికారుల తీరు ప్రజల సందేహాలకు తగ్గట్టుగానే ఉండడం, ఒక పార్టీ నాయకులు కుల,మతాధిపత్యం పరంగా ఫిర్యాదులు చేస్తూ మతాల మధ్య చిచ్చులు రేపే విధంగా గొడవలు సృష్టించాలని రాజకీయం చేస్తున్నారని సింగారం గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన.

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన

మున్నూరుకాపు సంఘము మండల అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో గుడివాడలో కాంగ్రెస్ సినియర్ నాయకుడు సిరంగి బిక్షపతి పటేల్ తల్లి సిరంగి రాధమ్మ స్వర్గస్తులయ్యారు కావున వారి కుటుంబ సభ్యులను పారమర్శించి ఓదార్చి మనోధైర్యం చెప్పిన గణపురం మండల మున్నూరుకాపు సంఘము అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్ వారి వెంట తో దేవేందర్ పటేల్ సిరంగి రామకృష్ణపటేల్ రిటైడ్ ఈఈ,ప్రభాకర్ పటేల్, రాజేశ్వర్ రావుపటేల్, అన్నం అనిల్ పటేల్,పటేల్,సురేష్ పటేల్,సుధాకర్ పటేల్,విడిదినేని రవి పటేల్ విద్యుత్ ఏ ఈ, శంకర్ పటేల్ పుప్పాల రామారావు పటేల్ నర్సింగం పటేల్ రామదాసు బాబు రాముణయ్య రవీందర్ రెడ్డి ల్యాదేళ్ల సమ్మయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ పురపాలక కమిషనర్ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రత్యేక బృందాలతో దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు, కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తూ పట్టుబడిన వారికి వెయ్యి రూపాయల నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని కమిషనర్ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మండల ఇన్చార్జి రాజిరెడ్డిని స్కాల్కల్ మండలము న్యాల్ కల్ తహసిల్దార్ నియమిస్తూ జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.ఇది వరకు మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన భూపాల్ మేడ్చల్ కు బదిలీ అవ్వడంతో మండల ఉప తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని అదనపు బాధ్యతలు అప్పగించడంతో మండల ఇన్చార్జి తహసిల్దారుగా విధుల్లో చేరారు. విధి నిర్వహణలో రెవెన్యూ చట్టానికి లోబడి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విధులు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి తహసిల్దార్ రాజిరెడ్డి స్పష్టం చేశారు.

వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.

నేడు వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులు నేడు వనపర్తి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు నామినేషన్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఆదేశాలు నియమ నిబంధనలు పాటిస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు ఆర్యవైశ్య యువకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని పూరి బాలరాజ్ పేర్కొన్నారు

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లిమండలం బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు. సత్తు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు.కార్యక్రమాలు తీసుకొచ్చి. రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం కార్యక్రమాన్ని అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ. ప్రభుత్వం ఇచ్చినటువంటి . ఆరు గ్యారంటీలే కాకుండా. ఎన్నో సంక్షేమ.పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధిలో ఉంచాలని. ప్రజలకు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని. అలాంటిది దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దువ్వాసి దేవరాజు. సెక్రెటరీ వేణు. బలసాని శ్రీనివాస్ గౌడ్. అల్లూరి తిరుపతిరెడ్డి. బద్రి. లింబాద్రులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version