కాంటా లగా షఫాలీ ఆకస్మిక మృతి.

కాంటా లగా షఫాలీ ఆకస్మిక మృతి…

కాంటా లగా సాంగ్‌ ఫేమ్‌ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్‌ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా..

‘కాంటా లగా’ సాంగ్‌ ఫేమ్‌ షఫాలీ జరివాలా(42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఉన్న షఫాలీని తన భర్త పరాగ్‌ త్యాగి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. ఆమె మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని.. ఈ కేసును అనుమానాస్పదంగానే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, 2002లో వచ్చిన ‘కాంటా లగా’ అనే రీమిక్స్‌ పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు షఫాలీ. ఆ తర్వాత ‘ముజ్సే షాదీ కరోగీ’, ‘హుడుగరు’ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ‘నాచ్‌ బలియే’, ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 13’ వంటి టీవి రియాలిటీ షోల్లో భాగమయ్యారు.

బీరప్ప కళ్యాణంలో కంట రెడ్డి తిరుపతిరెడ్డి.

బీరప్ప కళ్యాణంలో కంట రెడ్డి తిరుపతిరెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప కామరాతిల కళ్యాణ మహోత్సవం కురుమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కే. వెంకటాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప కళ్యాణానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంట రెడ్డి తిరుపతిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిపంటలు సుభిక్షంగా ఉండీ రైతులకు అధిక ధాన్యం దిగుబడి రావాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందన్నారు. బీరప్ప కళ్యాణం లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మావురం రాజు, ఎల్లం యాదవ్, దుర్గయ్య,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version