నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు ఎంపీడీవో సుధాకర్ మరియు హౌసింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన బీజేపీ జహీరాబాద్ పట్టణ కమిటీ నియామకం.

నూతన బీజేపీ జహీరాబాద్ పట్టణ కమిటీ నియామకం

◆ బీజేపీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి
ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ నౌబత్ జగనాథ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సుధీర్ భండారి బక్కాయ గుప్తా సమక్షంలో జహీరాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ గారు తెలిపారు ఈ సందర్భంగా పూల సంతోష్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని నియమనిబంధన పాటించాలని రాబోయే స్థానిక జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగిరి విధంగా ప్రతి పదాధికారి కార్యకర్త పని చేయాలని క్రమశిక్షణతో పార్టీకి చేయాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన హుజూరాబాద్ యువజన కాంగ్రెస్ నాయకులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి :హైదరాబాద్ లో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులను మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ నియమక పత్రాలని విడుదల చేసిన భాగంగా అందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో హుజురాబాద్ నియోజకవర్గనికి

చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువజనకాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ నియోజకవర్గం కార్యదర్శి ఉమ్మడి సందీప్ జమ్మికుంట పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బిసది వంశి తదితరులు పాల్గొన్నారు.

కోటి ఎకరాల మాగాణం చేసినందుకు నోటీసులా.

కోటి ఎకరాల మాగాణం చేసినందుకు నోటీసులా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగరెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పౌర్ణమి సందర్భంగా గానుగాపూర్ దత్తాత్రేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ తొలీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి .అధికార కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నోటీస్ పంపడాన్ని నిరసిస్తూ.అట్టి కమీషన్ ఎదుట ఈరోజు హాజరు కావాల్సిందిగా కోరడం వల్ల కెసిఆర్ గారికి హా దేవ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకొని మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్న నన్నారు రైతులకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రపంచం లోనే ఎంతో పెద్ద ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణం చేసిన ఆయనకు నోటీసులా అని ఈసందర్భంగా బావోదెవ్గానికి గురై .తొలి ముఖ్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి హ దత్తాత్రేయుని ఆశీర్వాదం ఉండాలని కోరారు .ఎలాంటి మచ్చ లేకుండా ఎదుర్కొని బయట పడతారన్నారు.ఇట్టి పూజ కార్య క్రమంలో .యువకులు శ్రీనివాస్ సంగమేశ్వర్ తమ్మలి దశరథ్ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్

పరకాల నేటిధాత్రి

 

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి.

పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తో కలిసి పాకాల సరస్సు,పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

వరంగల్ జిల్లా పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుట కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో నర్సంపేట రేంజ్ లోని పాఖాలలో గ్రీన్ హెరిటేజ్ క్రింద అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కును, బట్టర్, ట్రిక్కింగ్, సైక్లింగ్, పగోడాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ పాకాల సరస్సులో బోటింగ్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాకాల సరస్సు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయుటకు పటిష్టమైన ప్రణాళికలు రచించాలని డీఎఫ్ఓకు సూచించారు.

 

Collector Dr. Satya Sarada.

 

 

అందులో భాగంగా బయోడైవర్శిటీ పార్క్ ను మరింత అభివృద్ధి పరచడం, పర్యావరణ పర్యాటక అభివృద్ధి చేయాలని, సఫారీ ట్రాక్ ఏర్పాటు, మూలికల తోట పునరుద్ధరణ, సందర్శకులకు రాత్రి బస సౌకర్యాల అభివృద్ధి, చెరకు ప్యాచ్ అభివృద్ధి, పర్యావరణ పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ ఓ రవికిరణ్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ,అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది.

ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

కేసముద్రం/ నేతి ధాత్రి

 

 

 

 

 

కేసముద్రం మండలం
కాట్రపల్లి గ్రామంలోని సంబంధిత హౌసింగ్ ఏఈ అభినయ్ మరియు పంచాయతీ సెక్రటరీ చీకటి రమ్య ఆధ్వర్యంలో. మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హక్కు పత్రాలు అందజేసి ముగ్గులు పోయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సందేపాక సంధ్య భర్త ప్రభాకర్ కు ఇందిరమ్మ ఇండ్ల హక్కు పత్రాన్ని అందజేసి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలోని నీరు పేద ప్రజలకు కనీసం ఉండటానికి ఇల్లు లేక సొంత ఇంటి కల నెరవేర్చక పోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు చూసిన,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ము ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిందని వారు కొనియాడారు.

 

Chief Minister Revanth Reddy.

 

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి వెంకట్ రెడ్డి, ,సిరికొండ మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చాగంటి యాదగిరి, జల్లే యాకాంబరం, ఎస్సీ కాలనీ పెద్దమనిషి జల్లే జాన్సన్, కాలేపాక సహదేవ ,సునీల్ గ్రామపంచాయతీ సిబ్బంది, బాదావత్ బాల్య గుండెపాక మాణిక్యం తదితరులు పాల్గొని ఇందిరమ్మ ఇల్లులకు ముగ్గులు  పోయడం జరిగింది.

ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే.

– ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ములకలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వో లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు.

కొరికిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.

అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు.

గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపిటిసి…

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపిటిసి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల గోపి కుమారుడు. స్వాతి.క్.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అతి చిన్న వయసులోనే మరణించడం జరిగిందని. తన వంతు సహాయంగా అంకిరెడ్డి పల్లె మాజీ ఎంపిటిసి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు. రాగుల రాజిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పివారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాడ సానుభూతి తెలుస్తూ. ఎనగందుల గోపి. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త అని అతని కుమారుడు స్వాతి అనారోగ్యం కారణంతో మరణించగా నా వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని 2500 రూపాయలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను చనిపోయిన కుటుంబ సభ్యులు ఈ సహాయం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారుఇట్టి కార్యక్రమంలో ఓబులాపూర్ బూత్ అధ్యక్షులు .నందగిరి మధు. సీనియర్ నాయకుడు ఆసాని రామలింగారెడ్డి బీజేవైఎం జిల్లా సెక్రెటరీ చిందం నరేష్. సిరిసిల్ల వంశీ. సంపత్. చిలగాని నరేష్. గోకుల కొండ కృష్ణ. మెహర్ కృష్ణ. అనిల్. ప్రశాంత్. శ్రీకాంత్. నాయకుడు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.

మానకొండూరు ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల .

పార్టీ నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పల్లి.

సత్యనారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .

పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు.

కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందరు కలిసి ఇల్లంతకుంటమండలంలోని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ.

పుట్టినరోజు వేడుకలను మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ ను ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని CKR (చింతల కొండా రెడ్డి) ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం, చారకొండ మండాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఇంచార్జిలు తెజావత్ బెల్యా నాయక్, రాజశేఖర రెడ్డి, ప్రవీణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే…

నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే..

మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టే..

ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధులు గత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే ఆని బిఆర్ఎస్ రాష్ట్ర రైతు సమన్వయ మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి తెలిపారు.

బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగల్లి వెంకట్ నారాయణ గౌడ్ అధ్యక్షతన పట్టణంలోని సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట పట్టణ వార్డు ముఖ్యులు, క్లస్టర్ బాధ్యులతో పార్టీ సమావేశం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయిడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ
గత పేదేండ్ల కాలంలో నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చలేదని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.

అశాస్త్రీయంగా గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారని, ప్రజలతో ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదని చెప్పారు.

రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పూరితంగా మున్సిపాలిటీ వార్డుల విభజన చేసారని రవీందర్ రెడ్డి ఆరోపించారు.

ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా వార్డుల విభజన జరిగిందని,వార్డుల వారీగా కేటాయించిన ఓటర్ల సంఖ్యలో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుందని అన్నారు.

స్థానిక అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోను కాకుండా విభజనను పునఃసమీక్షించి శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన జరగాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నిజమైన పేదలకు అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని తెలుపుతూ పేదలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.

స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, క్లస్టర్ బాధ్యులు మోతే జయపాల్ రెడ్డి,మచ్చిక నరసయ్య గౌడ్,బండి రమేష్ ,రాంప్రసాద్,కడారి కుమారస్వామి,బండి ప్రవీణ్,పట్టణ

ప్రధాన కార్యదర్శి వెన్నుముద్దల శ్రీధర్ రెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలు వాసం కరుణ,మాజీ కౌన్సిలర్స్,పట్టణ కమిటీ బాధ్యులు,వార్డు అధ్యక్షులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి

బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

 

బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం
ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని,పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని
బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.

స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన.

స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా వినాయకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
వినాయకుమార్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు బండి మోహన్, జే రవికిరణ్, శివప్ప, ఓంకార్, పరశురాం,ఫాయాజ్, తదితరులు పాల్గొన్నారు.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

ఎమ్మెల్యే కోరం కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్షం…

ట్రెంచ్ హద్దులు ఏర్పాటు కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…

నేటి ధాత్రి – గార్ల :-

 

 

 

సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ కోరారు. మంగళవారం గార్ల గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన భూ భారతీ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే కనకయ్య ను సిపిఎం,సిపిఐ,న్యూడెమోక్రసీ పార్టీల అధ్వర్యంలో వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ,మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తక్షణమే హద్దులు గుర్తించి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి‌.సక్రు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు నియామకం పట్ల యూత్ కాంగ్రెస్ సంబరాలు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీను బాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు.ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినీత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఇది నిదర్శనం అన్నారు.పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు కష్టపడి పని చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా పార్టీ వదిలిపెట్టదని వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక ఉంటుందని ఇలాగే క్రియాశీలంకంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ దుదిల్ల శ్రీను బాబు మరి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లక్కం రాజు, అనుము ప్రశాంత్, ఇనుముల ప్రదీప్, నాగరాజు,స్వామి,బర్ల రాజు, నాగరాజు,నేతెట్ల కిరణ్, ఎడుమెకల కిరణ్, ప్రదీప్, ఐత రాజు, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం –

 

బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.

 

దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటుందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరియు మైనార్టీ వారి పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉందోనని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

 

ఇది వారి వర్గానికి అన్యాయం చేయడమే అవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు.

 

మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా చిన్న చూపు మరియు వివక్ష చూపిస్తుందని జ్యోతి పండాల్ అన్నారు.

 

సెంట్రల్ లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అమలు చేసి అట్టడుగు వర్గాల మైనార్టీ వాళ్ళని ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.

 

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 నాటికే ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 14 లక్షలు పైగా ఇండ్లని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం జరిగింది.

 

అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే డబ్బులు పెట్టుకొని చదువుకో లేని స్థితిలో ఉంటారో వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇలా అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటుంది మా బిజెపి ప్రభుత్వం.

 

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మైనార్టీలను మభ్యపెట్టి ఎలక్షన్ టైం లో వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పైన చిన్నచూపు చూసి వాళ్ళని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ అన్నారు.

 

కావున కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీల పట్ల వివక్షత, చిన్న చూపు మరియు కించపరిచేలా ప్రవర్తించవద్దని జ్యోతి పండాల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న,

బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణం కేంద్రం లో ని ప్రెస్ క్లబ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ వాకిటి
శ్రీ హరికి మంత్రి పదవి ఇచ్చి,ముదిరాజులకు ఇచ్చిన మాట ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని, అన్నారు. అలాగే చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం ముదిరాజులు ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పిటిసి మరియు జడ్పీ చైర్మన్ స్థానాలను కూడా ముదిరాజులకు కేటాయించాలని అన్నారు. బీసీడీఈ లో ఉన్న ముదిరాజులను బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు సంయుక్త కార్యదర్శి జంగాపల్లి శేఖర్,రాయిని ప్రతాప్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు వంకాయల కార్తీక్,కోలా నరేష్, మామిండ్ల నారాయణ మునిగల రాజు చుక్క శేఖర్ బల్లెపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన.

రెడ్డి కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి
మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డికాలనీ పేస్ – 1 లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు రెడ్డికాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పిసిసి మెంబర్ చల్లూరి మధు అప్పం కిషన్ దాట్ల శ్రీనివాసు ముంజల రవీందర్ కేతరాజు సాంబమూర్తి కురుమిళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version