హైటెక్ కాలని నూతన కమిటీ ని సన్మానించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 9వ వార్డు లో గల హైటెక్ కాలనీ (వెంగళరావు వెంచర్) లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న కమిటీ యొక్క అధ్యక్ష, కార్యదర్శి శ్రీ క్యాతం సతీష్ కుమార్ బొమ్మకంటి పవన్ కుమార్ తో పాటు గౌరవ అధ్యక్షులు సామల లక్ష్మారెడ్డి సాదు సదానందం లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సన్మానించారు.
హైటెక్ కాలని అభివృద్ధి కోసం కోత్తగా ఎర్పాటు చేసుకున్న కమిటీ నిరంతరం కృషి చేసి హైటెక్ కాలనీని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.మీ కాలనిలో అభివృద్ధి పనులు చేయడం కోసం నా వంతు కృషి చేస్తానని తెలుపుతూ,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు కాలనీని విసిట్ చేసి,పెండింగ్ పనులను కంప్లీట్ చేస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉందని కాలని అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలని వాసులు తాడూరి రమణారెడ్డి, పసునూటి సుమన్, సల్ల సంపత్, చల్లా రవీందర్ రెడ్డి, గోపతి రాజు, రత్నం రోషి రెడ్డి, పోతునూరి శశికాంత్, నిమ్మతి జితేందర్, కట్కూరి శ్రీనివాస్, నేరెళ్ల సతీష్, రాగుల కనకయ్య, ఉమ్మనబోయిన రవీందర్, తిరుపతిరెడ్డి, పైతారి మహేష్, అలుగూరి సదయ్య, మాదారపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.