ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలంలోని అంబేద్కర్ సెంటర్ లో బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను నెక్కొండ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరయ్యారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు మిఠాయిలు పంచుతూ బానసంచ పేల్చి సంబరాలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. అనంతరం వరంగల్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు యువతకు మార్గదర్శి తెలంగాణను గ్లోబుల్ హబ్ గా తీర్చి దిద్దిన నాయకుడు కేటీఆర్ అని తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.