తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్…

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

హనుమకొండ: తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయాలు భగ్గుమన్నాయి. మాటల తూటాలతో రెండు పార్టీల్లోని నేతలు రెచ్చిపోయారు. భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వినయ్ భాస్కర్‌ అన్నారు. పూడికతీత పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని చర్చకు రమ్మను తాను సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కుడాకు ఒక రూపాయి అయినా నిధులు తెచ్చినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని నాయిని రాజేందర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు వీళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని నాయిని రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పరిస్థితి దొంగే దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. వరంగల్‌లో కుడా నిధులు దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చీడ పురుగులలాంటి వాళ్లు… వీళ్లను వెంటనే జైళ్లో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక్కడి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కి పారిపోతారని నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.

అభివృద్ధి ప్రదాతలకు క్షీరాభిషేకం.

అభివృద్ధి ప్రదాతలకు క్షీరాభిషేకం

కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి 100 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయం

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాతల చిత్రపటాలకు పాలాభిషేకం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో అమీనాపురం లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా కేసముద్రం మునిసిపాలిటీని ఏర్పాటు చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలలో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు వివిధ అభివృద్ధి పనుల క్రింద 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినందుకు అభివృద్ధి ప్రధాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, మహబూబాబాద్.

శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ కు పాలాభిషేకం చేసి కేసముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అదేవిధంగా గతంలో పాలిటెక్నిక్ కాలేజీని, డిగ్రీ కాలేజీని, అగ్నిమాపక కేంద్రాన్ని, బైపాస్ రోడ్డును, అంబేద్కర్ నుండి కోరుకొండ పెళ్లి క్రాస్ వరకు ఆర్ అండ్ బి రోడ్డును , 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గానికి అదనంగా 1000 ఇండ్లుమంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

కే సముద్రం మున్సిపాలిటీని అభివృద్ధి పదములో నడిపించే అభివృద్ధి ప్రదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, జన్ను కట్టయ్య, సామ సుధాకర్ రెడ్డి, మందుల కృష్ణమూర్తి, వేల్పుగొండ ఏలియా, కుడారి నాగేంద్రబాబు, లాకావత్ బాలు నాయక్, భోగం రమాదేవి, కుక్క ముడి యాకయ్య పాల్గొన్నారు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

అవినీతిని రూపుమాపి అభివృద్ధి చేసి చూపిస్తా

ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం,రసూల్ పల్లి,జైపూర్ వద్ద శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజికవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకట్ స్వామికి కాంగ్రెస్ నాయకులు మేళ తాళాలతో,బాణసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి పూలమాలలతో,శాలువాలతో సత్కరించారు.జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికిన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.అలాగే పేదవారికి సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అక్రమ అరెస్టులకు తావు లేకుండా చూసే బాధ్యత తనదే అని అన్నారు. పేదవారికి ఉచిత విద్య అందించాలనే కృషితో సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని అన్నారు.అలాగే చెన్నూరు నియోజకవర్గం లో అక్రమంగా ఇసుక రవాణా,మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.నేను ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎన్నుకున్న నాయకుడిని నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యోగక్షేమాలు చూసుకుంటూ వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలను అందే విధంగా నా సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు.

వ్యక్తిగత గొడవలకు పార్టీకి సంబంధం లేదు

జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్

జమ్మికుంట:నేటిధాత్రి

 

 

 

హుజరాబాద్ నియోజకవర్గం లో గత కొద్ది రోజులుగా ఇల్లంతకుంట మండలంలో ఇటు జమ్మికుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాడులు చేసుకుంటారని కొంతమంది గిట్టని వాళ్లు పార్టీలో విభేదాలు ఉన్నాయి వాళ్లకు వాళ్లకే పడతలేదు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది ప్రణవ్ మద్దతుదారులని బల్మూరు వెంకట్ వర్గమని బద్నాం చేస్తున్నారు అలాగే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అన్ని కార్యక్రమాలు నడిపించినటువంటి పత్తి కృష్ణారెడ్డి నీ ఇందులోకి లాగుతున్నారు హుజురాబాద్ నియోజకవర్గం లో మాది ఒకటే పార్టీ ఒకరే లీడర్ ఆది మా ప్రణవ్ బాబే బల్మూర్ వెంకట్ మా పార్టీ ఎమ్మెల్సీ మేమందరం ఐక్యతతో పని చేస్తాం మా పార్టీలో ఎలాంటి చీలికలు లేవు గొడవలు వ్యక్తిగతంగా పెట్టుకున్నవి పార్టీకి సంబంధం లేదని ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది .

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు

అద్దె ఇంట్లో ఉంటున్న వారికి నిరాశే

ఇందిరమ్మ కమిటీల మాయాజాలం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన రాజోలు నరహరిఅనే వ్యక్తికి సొంత ఇల్లు లేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిర మ్మ ఇళ్లలో అర్హునిగా తన పేరు ప్రకటించారు అయితే మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గతంలో కలిసిన క్రమంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశానని సాకును చూపి మంజూరైన ఇందిరమ్మ ఇల్లును ఇందిరమ్మ కమిటీ సభ్యులు తొలగించారు. అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేశారని బాధితుడు వేడుకొన్నాడు.గత పది సంవత్సరాలుగా కిరాయి ఇంట్లో అద్దెతో జీవనం గడుపు తున్నానని కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే చొరవతో ఇల్లు వస్తుందని ఆశపడిన తమకు స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీరని అన్యాయం చేశారని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి విచారణ జరిపి నాలాంటి వారికి అండగా నిలవాలని ప్రభుత్వం పై నమ్మకం ఉంచాలని కోరడమైనది

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

కాంగ్రెస్ పై కపట ప్రేమతో పుట్ట కొత్త కుట్ర.

బానిసలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తోనే ఈ స్థాయి.

ఉనికి కోసమే పుట్ట మధుకర్ కొత్త నాటకం, తాను అధికారంలో ఉన్నప్పుడు భార్యకు చైర్మన్ పదవి.

తన కొడుకు పబ్లిక్ సిటీ చెల్లలేదు, శీను బాబు పై అనుచిత వ్యాఖ్యలు.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై విరుచుకుపడ్డ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రాజబాబు.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెట్టి కొత్త కుట్రను తెరలిపి తందుకు పుట్ట మధుకర్ ప్రయత్నిస్తున్నాడని, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. మంథని కేంద్రంగా పుట్ట మధుకర్ చేసిన కామెంట్లపై కోట రాజబాబు తీవ్రంగా ఖండిస్తూ పత్రిక ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బానిసలు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు గుర్తింపు విలువలు ఇస్తూ పదవులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారిదని, పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు, మంథని నియోజకవర్గంలో పుట్ట మధుకర్ ప్రజల్లో ఉనికిని కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై కపట ప్రేమ చూపెడుతూ కొత్త నాటకానికి తీరలేపడం జరిగిందని అన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ 84 లోనే సమితి కోఆప్షన్ సభ్యుడిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ మహదేవ్పూర్ నుండి రెండు మార్లు సర్పంచ్ గా అవకాశం కల్పించడం జరిగిందని అంతేకాకుండా కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ పదవితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని, ఒకటి రెండు కాదు అనేక అత్యున్నత స్థానాలు కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ శ్రీపదరావు తో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తనకు అందించడం జరిగిందని రాజబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని అసత్యపు అర్థం లేని మాటలతో ఒక కొత్త నాటకాన్ని తెరలిపి ప్రయత్నం నియోజకవర్గ ప్రజల వద్ద చల్లదన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం గౌరవం ఇచ్చిందన్న విషయం పుట్ట మధుకర్ గుర్తుంచుకోవాలని, సాధారణ వ్యక్తిగా ఉన్న పుట్ట మధుకర్ కు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు కల్పించిన విషయం మర్చిపోయి కార్యకర్తలను బానిసగా అభివర్ణించడం సిగ్గుచేటని అన్నారు. పుట్ట మధుకర్ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు వారి సతీమణి శైలజాకు మంథని మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించడం జరిగిందని, కానీ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇక్కడ న్యాయం చేశారు అని రాజబాబు ప్రశ్నించారు. అలాగే పుట్ట మధుకర్ కొడుకు నియోజకవర్గంలో తిరిగినప్పటికీ కూడా పుట్ట మధుకర్ కు ఎమ్మెల్యే ఎన్నికల్లో కొడుకు పబ్లిసిటీ లో ఫీల్ కావడం జరిగిందని, కోపంతో మంత్రి సోదరు శీను బాబు పై ఆరోపణలు చేస్తున్నాడని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో శీను బాబు కు ప్రధాన కార్యదర్శి నియమించడం పార్టీ అంతర్గత విషయం అని కొడుకు పబ్లిసిటీ ఫెయిల్ అయితే సంవత్సరాల కాలంగా పెద్దపల్లి మంథని నియోజక వర్గాల్లో పార్టీ కోసం ఒక కార్యకర్తల పనిచేస్తున్న శీను బాబుకు గౌరవం దక్కిందన్న విషయం పుట్ట మధుకర్ జీర్ణించుకోలేకపోతున్నాడని కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంపై మాట్లాడే నైతిక హక్కు పుట్ట మధుకర్ కు లేదన్న విషయం గుర్తుంచుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.

7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

శనివారం కలకుర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డులో హనుమాన్ నగర్, గాజులవాడ, అంబేద్కర్ నగర్, కాలనీలలో కల్వకుర్తి నియోజకవర్గo ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈరోజు ఉదయం బృంగి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమo నిర్వహించారు7వ వార్డులో 17మంది నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో పది మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేసి ముగ్గు పోశారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శ్రీలత గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు జ్యోతి, మాజీ కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీ చిన్నరామిరెడ్డి, నేరటి చిన్న, బాలునాయక్, బృంగి ప్రవీణ్, వర్కాల భాస్కర్ రెడ్డి, మబ్బు సాయిలు, చంద్రకాంత్ రెడ్డి, జమ్ముల శ్రీకాంత్, రావుల శ్రీనివాసులు, రేష్మా బేగం, ఝాన్సీ, జ్యోతి, గంగావతి, రాహుల్, వర్షపాకల శేఖర్, సైదులు యాదవ్, ఆంజనేయులు, కార్తీక్, తరుణ్, పరుశురాములు, షమీం, రియాజ్ ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం:-

పొన్నం బిక్షపతి గౌడ్ జయశంకర్ భూపాలపల్లి బిఎస్పి అధ్యక్షులు:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శనివారం నాడు టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తూ వారు చెప్పిన వారికే ఇండ్లను మంజూరు చేస్తూ, గ్రామంలో లేని వారికి స్థిరమైన గృహాలు ఉన్నవారికి కూడా ఇండ్లను మంజూరు చేస్తున్నారని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించకుండా చేస్తున్న అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఇట్టి దందా నడిపిస్తున్నారని అన్నారు. తక్షణమే ఇట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు కలెక్టరేట్ ముందు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యే పేదలతో ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ మండల తదితర నాయకులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండా గ్రామంలో శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు హనుమంత్ నాయక్,రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, పులియ నాయక్, సేవ్య నాయక్, శక్రు నాయక్, కమలమ్మ, శాంతి, సరోజా, శోభా,ఆశ వర్కర్లు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు.

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం అల్లీపూర్ లోని ఫయాజ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ మరియు వారి బృందం కాంగ్రెస్ పార్టీ లో నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని,మైనార్టీ లకు మంత్రివర్గం లో చోటు కల్పించకపోవడం మైనారిటీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఎంటో అర్థమైంది అని,రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ దే అని,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అని అన్నారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఇబ్రహీం,మొహమ్మద్ అలి,ఆల్లిపూర్ నాయకులు శంకర్ పటేల్,దీపక్,మోహన్,ప్రవీణ్ మెస్సీ , తదితరులు పాల్గొన్నారు..

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు గాను ₹1,46,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ , పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ జగదీష్ గ్రామ పార్టీ అధ్యక్షులు సత్వర్ సయీద్ ,అల్గోల్ చంద్రకాంత్ రెడ్డి, అనెగుంట జగ్గనాథం,నాయకులుస్వామీదాస్,రాజు,వేంకటి,మల్లేష్ ప్రశాంత్ తదితర ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు.సత్వార్ గ్రామానికి చెందిన మోగులప్ప గారికి ₹.15,000/- అనెగుంట గ్రామానికి చెందిన నిర్మలమ్మ గారికి ₹.55,500/- అల్గొల్ గ్రామానికి చెందిన మీనా గారికి ₹.20,500/- చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జంగలి శ్రీకాంత్ గారికి ₹.29,000/- , బస్వరాజు గారికి ₹.26,000/- ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం నేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లి గ్రామంలో పంచాయితీ కార్యదర్శి ఎండి రజియా స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జ కృష్ణంరాజు తో కలిసి ప్రోసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు.బొజ్జ కృష్ణంరాజు మాట్లాడుతూ శాసనసభ్యులు మాధవరెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసడింగ్ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు ఐలయ్య,రంజిత్, సురేష్
తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.

సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.

సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

భూపాలపల్లి నేటిధాత్రి:

సిపిఐ 18వ పట్టణ మహాసభలను పురస్కరించుకొని సిపిఐ ఎల్బీనగర్ శాఖ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సోత్కు ప్రవీణ్ కుమార్, గురిజాల సుధాకర్ రెడ్డి,మాతంగి రామచందర్, రాయ మల్లు, కత్తెర శాల, పత్తి వేణుగోపాల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలో శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల శ్రీనివాస్ పదివేలు విలువ గల నోట్ బుక్స్ అందజేశారు. అట్టి నోట్ బుక్స్ పంపిణీ చేసిన రామడుగు మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ ముఖ్యఅతిథిగా హాజరై నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మాగ్రామ ప్రభుత్వ పాఠశాలకు గత సంవత్సరం నోట్ పుస్తకాలతో పాటు వంట పాత్రలు అందజేశారు. మాపాఠశాలకు ఇంత సేవ చేస్తున్నందుకు మాగ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గుంట ఓంప్రకాష్, గుత్తూరి శ్రీనివాస్, పొన్నాల అజయ్, రవీందర్, లక్ష్మయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేసిన.

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

గూడు లేని తమకు సొంత ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటాలకు కేసముద్రం మండలం ఉప్పరపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారురాలు పాల్వాయి మౌనిక పాలాభిషేకం చేశారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో పాల్వాయి మౌనిక,మురళి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం తమకు ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటాలకు ఆ దంపతులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉప్పరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లకు రూ.6లక్షలు, ఇతరులకు రూ.5లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. ఉప్పరపల్లి గ్రామంలో 39 ఇల్లు మంజూరు కాగా లబ్దిదారులందరు ఇంటి నిర్మాణాలు ప్రారంభించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు, వివిధ పార్టీల కార్యకర్తలు కోమాకుల రమేష్, తండ సంపత్, ఎట్రోజు సత్యనారాయణచారి, పసుల వెంకన్న, పోలేపాక ఉప్పలయ్య, మంద సాయిబాబా, మంద విక్రమ్, పందుల నాగేంద్రబాబు, పందుల అజిత్ తదితరులు పాల్గొన్నారు.

టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.

టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నేటి ధాత్రి:

 

ఇటీవల నూతనంగా టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన నమిండ్ల శ్రీనివాస్ ను 14 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ హనుమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిచేరి రాధాకృష్ణ. ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు. త్రికోవెల శీను. బాలాజీ నగర్ గ్రామ అధ్యక్షుడు కడెం కుమార్ ఎస్సార్ నగర్ యూత్ అధ్యక్షుడు పల్లకొండ చందు. సౌరం ప్రభాకర్ సౌరం అభిలాష్. కోగిల సుధాకర్. ఖల్నాయక్ కాశెట్టి కమలాకర్. సౌరం మాణిక్యం ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకాబ్రాచారి. తిరుపతి.ఎండి సంధాని. ఎండి యూసుఫ్ సంగారబోయిన రాజు. ఎండి ఖాజా రేహాన్ ఖాన్. వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.

అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి.

అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిధాత్రి;

 

 

పెబ్బేరు మండలం అయ్యవారి పల్లి గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమిపూజ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా నిలబెట్టుకున్నద ని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పేదల కు వరమని అన్నారు
గత బిఆర్ఎస్ పాలనలో మాట ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు_
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది.

ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది???

మండలంలో మార్క్ చూపని ప్రతిపక్ష పా(ర్టీ)త్ర

ప్రజా సమస్యలపై పోరాటమే లేదు??

సామర్ధ్యం ఉంటే సంఖ్యా బలం ఎందుకు.??

గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు ఎంతో కొంత ప్రాధాన్యత..

 

ఎగరటం మరిచిపోయిన పక్షిలా ప్రతిపక్ష పార్టీ???

పెద్ద సారు రెండు పడవల ప్రయాణం పార్టీకి చేటు తెస్తుందా??

నియోజకవర్గ ఇంచార్జి ఇప్పట్లో లేనట్లేనా??

పార్టీ క్యాడర్ పెంచాల్సింది పోయి పదవులకై కొట్లాట??.

 

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

 

 

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సక్కగా ప్రజలకు చేరాలన్నా ప్రజల పక్షాన స్థానికంగా ఉన్న ప్రతిపక్షం బాధ్యతగా నిలిచి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేయడంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంతో కీలకమైంది.

అధికారపక్షం కన్నా ప్రతిపక్షమే ఎక్కువగా ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా పోరాటాలు చేయవలసి ఉంటుంది.

ఐతే అయినవోలు మండలంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరుగుతుంది.

మండలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోలేకపోతోంది.

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ రెక్కలు ఉన్న ఎగరడం మర్చిపోయిన పక్షిలా అచేతనావస్థలో ఉండడం విడ్డూరంగా అనిపిస్తుంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న బిఆర్ఎస్ పార్టీని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో నిలిపారు.

అంతటి బాధ్యతాయుతమైన స్థానాన్ని మోస్తూ మండలంలో సంక్షేమ పథకాల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజా క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల తరఫున నిలబడి కొట్లాడితేనే కదా గత ఎన్నికల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ పొందగలిగేది.

మండలంలో సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్న, అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్న, మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రతిపక్ష నాయకుడు అర్హుల తరుపున మాట్లాడింది లేదు.

టిఆర్ఎస్ పార్టీ అంటే కేవలం సభలకు సమావేశాలకు మాత్రమే పార్టీ శ్రేణులు రోడ్లమీద కనిపిస్తరు అన్న అపవాదు స్థానికంగా వ్యక్తం అవుతుంది .

ఇది ఇలాగే కొనసాగితే సంక్షేమ పథకాలు ఇస్తామన్న సాకుతో అధికార పార్టీ గీసే పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చి బిఆర్ఎస్ పార్టీలో పని చేయాలంటే పార్టీలో ఉన్న నాయకులు సామాన్యులకు ఎంత భరోసా కల్పించాల్సి ఉంటుందో నాయకులు గ్రహించాలి.

అయితే బిఆర్ఎస్ అచేతన వ్యవస్థకు నేతలు చెబుతున్న కారణాలు నియోజకవర్గంలో తమకంటూ ఒక స్థాయి కలిగిన నాయకుడు లేకపోవడము కొంత ప్రతికూల అంశం.

బిఆర్ఎస్ పార్టీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్దన్నపేటలో కర్చిప్ వేసి పాలకుర్తిలో తన కార్యకలాపాలను కొనసాగించడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నా, అది స్థానిక నాయకత్వలేమిని సూచిస్తుంది.

సరైన సంఖ్య బలం లేక అధికార కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వెనకడుగు వేస్తుందా అన్నది మరో కారణం అంటే క్షేత్రస్థాయిలో మండలంలోని సుమారు 17 గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారు.

మండల స్థాయిలో ఉన్న నాయకులు వారిని సమన్వయపరిచి ఏకతాటి మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదు అనే అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పదవుల కోసం వర్గ పోరాటాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రజల పక్షాన నిలిచేందుకు సంఖ్యాబలం ముఖ్యం అనుకుంటే గత పదిహేను అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ తమ పరిపాలన కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంతలా ఇరుకున పెట్టింది లేదు.

సంక్షేమ పథకాల అమలులో ప్రశ్నిస్తూ, సంక్షేమ పథకాలలో కొంత వాటాను లబ్ధి పొందడంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు సఫలీకృతం అయ్యారు .

అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో బిఆర్ఎస్ విఫలమవుతుందని చెప్పాలి.

అసలు పార్టీ నాయకులకు క్యాడర్ను పెంచాలన్న ఆసక్తి కంటే రాబోయే ఎన్నికల్లో పదవుల కోసం పోరాటం చేయడమే ఎక్కువ అవుతుందన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.

మండలంలో పార్టీని విస్తృతపర్చకుండా కేవలం అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు బ్యాంకును తీసుకొస్తుందన్న బిఆర్ఎస్ నాయకుల భ్రమ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమవుతుందా?

లేదా మరోసారి గత ఎన్నికల మాదిరిగానే ప్రజానాడిని గుర్తించడంలో బొక్క బోర్లా పడతారా అన్నది వేచి చూడాల్సిన అంశం.

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి.

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”

“భూ సమస్యల పరిష్కారానికి భూభారతి”

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ..

భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.

భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని..

రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యను అధికారులు పరిష్కరిస్తారన్నారు.

 

MLA G. Madhusudhan Reddy

 

 

అనంతరం గ్రామంలో వడ్డెర, యాదవ సంఘాల కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ పెండింగ్ పనులకు, కుర్వ సంఘం కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు తెలుగు బాలమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version