రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

తహసీల్దార్ వి శ్రీనివాసులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలంలోని నాగారం ఆజంనగర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు హాజరైనారు అనంతరం దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిశ్క రించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూ ములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరిం చడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామస్వామి,అజహరో ద్దీన్, సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నస్కల్ లో రెవేన్యూ సదస్సు.

— నస్కల్ లో రెవేన్యూ సదస్సు
• భూ సమస్యలకు అర్జీలు చేసుకోండి
• ఎమ్మార్వో
శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ఎమ్మార్వో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయబ్ తహసిల్దార్ రమ్య శ్రీ, ఆర్ఐ లు ప్రీతీ, ఇమద్, ధరణి ఆపరేటర్ రాజు, గ్రామస్తులు దేశెట్టి సిద్దారములు, గుమ్ముల అజయ్, మద్దికుంట శ్రీను తదితరులు ఉన్నారు.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి

బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

 

బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం
ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని,పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని
బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

మండలంలోని చౌటుపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట గ్రామసభను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నడికూడ మండల విద్యాశాఖ అధికారి కె.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. అయితే దానికోసం మన ఊరిలో మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తూ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఐ ఎఫ్ పి టివి ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన చౌటుపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతుంది‌. నిరంతర సమగ్ర మూల్యాంకనం,కృత్యాధార, అనుభవజ్ఞులైన అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్,పాఠ్య పుస్తకాలు,వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తున్నారు, ప్రతిరోజు రుచికరమైన పౌష్టికాహారం మధ్యాహ్న‌ భోజనం,వారానికి మూడు గుడ్లు,మూడు రోజులు రాగి జావా,ప్రతినెల తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తున్నందున గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి,ప్రభుత్వ బడి అభివృద్ధి చెందేటట్లుగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు, యువజన సంఘాలు,పూర్వ విద్యార్థులు గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి గూడెం రమ్య విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు,మహిళా స్వయం సహాయక సంఘాలు,అంగన్వాడీ టీచర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,యువజన సంఘాల నాయకులు,పూర్వ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు.

కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది

మంచిర్యాల నేటి దాత్రి

 

 

 

 

మంచిర్యాల భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్లు

1.) ఈ పి ఎఫ్- 95 యొక్క కనీస పెన్షన్ 1000/- రూపాయల నుండి 5000/- రూపాయలకు వెంటనె పెంచాలి. మరియు చివరకు జీతంలో 50% + డి ఏ రిలీఫ్ పెన్షన్ ను చెల్లించాలి.

2.) ఈ పి ఎఫ్ జీత పరిమితిని 15,000/- నుండి 30,000/- పెంచాలి.
ఈ ఎస్ ఐ జీతం పరిమితిని 21,000/- నుంచి 42,000/- పెంచాలి.

3.) ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలి.

4.) బీమా ఆర్థిక రంగంలో 100% విదేశీ పెట్టుబడులను నిషేధించాలి.

5.) స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం మరియు సామాజిక భద్రత కల్పించాలి.

6.) అసంఘటిత కార్మిక రంగానికి బోర్డ్ లను ఏర్పాటు చేసి వాటికి తగినన నిధులను కేటాయించాలి.
7) మినిమం వేజెస్ 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్2016 నుండి పెండింగ్లో ఉన్న సమస్య 2012లో డిమాండ్ చేసిన విధంగా బిఎంఎస్ మినిమం వేజెస్ 25 వేల రూపాయలు ప్రకటించాలి
8) కార్మిక బోర్డులో ఉన్న వెయ్యి నాలుగు కోట్లు ఇతర శాఖలకు మళ్లించిన డబ్బులను తిరిగి బోర్డులో జమపరిచి కార్మికుల డెత్ క్లేములు మిగతా సౌకర్యల కొరకు వినియోగించాలి

సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజ్ధూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించడం జరిగింది

కార్మికుల తీవ్ర సమస్యల పరిష్కారం కోసం తక్షణమే రాష్ట్రంలోని జిల్లాస్థాయిలో నిరసన కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ సంబదిత అధికారుల ద్వారా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి కి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.

భారతీయ మజ్దూర్ సాంగ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

వీరిలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లగిసెట్టి కమలాకర్ మరియు సింగరేణి ఏ బి కె ఎం ఎస్ నాయకులు కె శ్రీనివాస్ మరియు మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ పెయింటర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సంగెం లక్ష్మణ్ ,వేల్పుల స్వామి పెయింటర్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కార్యదర్శి , ఆఫీస్ సెక్రటరీ మహానంద్ ప్రభాకర్, మరియు ఎస్ సి సి ఎల్ కన్వీనర్ ,మిట్టపెల్లి మొగిలి బిఎంఎస్ నాయకులు మంచిర్యాల జిల్లాలో బిఎంఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగినది

స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన.

స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా వినాయకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
వినాయకుమార్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు బండి మోహన్, జే రవికిరణ్, శివప్ప, ఓంకార్, పరశురాం,ఫాయాజ్, తదితరులు పాల్గొన్నారు.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

ఎమ్మెల్యే కోరం కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్షం…

ట్రెంచ్ హద్దులు ఏర్పాటు కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…

నేటి ధాత్రి – గార్ల :-

 

 

 

సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ కోరారు. మంగళవారం గార్ల గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన భూ భారతీ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే కనకయ్య ను సిపిఎం,సిపిఐ,న్యూడెమోక్రసీ పార్టీల అధ్వర్యంలో వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ,మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తక్షణమే హద్దులు గుర్తించి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి‌.సక్రు తదితరులు పాల్గొన్నారు.

అనాధ బాలకార్మికులం..!

శీర్షిక:

హైదరాబాద్,నేటి ధాత్రి:

అనాధ బాలకార్మికులం..!
కామాంధులు తిని వదిలేసిన చిదిమేసిన
ఎంగిలి విస్తరాకులం మేము
మేము అనాధ బాలకార్మికులం..!

 

హైదరాబాద్,నేటి ధాత్రి:

 

 

 

 

 

 

బ్రతుకు కోసం మెతుకుకోసం పోరాటం చేస్తున్న
ఆరవ పంచభూతమైన
ఆకలికి వారసులం మేము
మేము అనాధ బాలకార్మికులం..!

రోజంతా మస్తు పని చేస్తాం…కడుపును పస్థులు ఉంచుతాం…
వెట్టిచాకిరి చేస్తున్న భావిభారత పౌరులం మేము
మేము అనాధ బాలకార్మికులం..!

సమాజంలో తన్నులు తిట్లు అవార్డులు పొందిన
ఉదయిస్తున్న సూర్యులం మేము
మేము అనాధ బాలకార్మికులం..!

ఇరానీ హోటల్ నుండి ఇటుకల బట్టిల వరకు అంతట కట్టు బానిసలమై జీవనోపాధి కోసం
బాల్యాన్ని బలిపశువులుగా చేస్తూ…

 

Orphan child laborers

 

మోములో మోదమంటే ఎరగనోల్లం మేము
మేము అనాధ బాలకార్మికులం..!
మేము అనాధ బాలకార్మికులం..!
బడి ఈడు పిల్లలని బడిలో చేరుద్దాం!
బంగరు భవితకు బాటలు వేద్దాం!!
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం (జూన్ 12)
సందర్బంగా..బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి మనం అంతా కలిసి పనిచేయాలని ముఖ్యంగా ప్రభుత్వాలు,సామాజిక సంస్థలు కలిసి పనిచేయాలని కోరుకుంటూ..వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటూ…
రచన✍మంజుల పత్తిపాటి (కవయిత్రి).
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.

అమ్మిన సాగుచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు.

ఎస్సై జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున వ్యవసాయ శాఖ ఏడిఈ మరియు ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేయడం తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ త్రిబుల్ వన్ రకం పత్తి విత్తనాలను అమ్మిన సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు,రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదు షాప్ యజమానులు నుంచి తీసుకోవాలి అని అన్నారు,ఈ తనిఖీ లో ఏడి ఏ రమేష్.వ్యవసాయశాఖ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.

మండలంలో దోమల మందు పిచికారి.

మండలంలో దోమల మందు పిచికారి

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..

 

 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ముందస్తు జాగ్రత్తగా దోమల మందు డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల చిరు మల్ల మరియు కేజీబీవి స్కూల్లో ప్రారంభించి ముందస్తు మలేరియా పాజిటివ్ కేసులు ఉన్న 13 గ్రామాల్లో స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ పోలేబోయిన కృష్ణయ్య, కీటక జనిత వ్యాధుల నియంత్రణ సూపర్వైజర్ అరుణ్ బాబు, ఎం పి హెచ్ ఎ (ఎం) నరసింహారావు, రమాదేవి, ఆశాలు గణతమ్మ, పుష్ప, ఆదిలక్ష్మి, జగదీశ్వరి, కేజీబీవీ స్టాప్. వై రజిని, సుజాత మరియు పార్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు

రవాణా శాఖ మంత్రిని కలిసిన కోల్ బెల్ట్ ఏరియా.

రవాణా శాఖ మంత్రిని కలిసిన కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సిసిఐ గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి.

అయినా ఇప్పటివరకు అధికారుల వద్ద నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వినతి పత్రం అందించారు.

వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్, జైపూర్,భీమారం మండలాల పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సుమారు వేయి కుటుంబాలు స్థానికంగా ఉంటూ బొగ్గు,కర్ర,పత్తి మొదలగునవి రవాణా చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

కానీ ఈ క్రమంలో మా పరిధిలో గల నస్పూర్ మండలంలోని తీగల పహాడ్ సిసిఐ గోడౌన్ వారు పత్తి బెల్స్ ను నిలువ చేసి ఉంచడం జరిగింది.

నిలువ చేసిన పత్తి బెల్సును స్థానికంగా ఉన్న లారీలకు కిరాయిలు ఇవ్వకుండా బయటి ట్రాన్స్ పోర్ట్ వారితో చేతులు కలిపి బయట ప్రాంతాలకు రవాణా కొనసాగిస్తున్నారని అన్నారు.

స్థానికంగా ఉన్న లారీ ఓనర్స్ అయినటువంటి మేము అక్కడికి వెళ్లి బయట వారితో రవాణా చేపించడం ఏంటని ప్రశ్నించడంతో మాపై దౌర్జన్యానికి దిగి జిల్లా కలెక్టర్ కి మాపైన ఫిర్యాదు చేసి పోలీస్ వారితో అక్రమ కేసులు పెట్టించడం జరిగిందని విన్నవించారు.

మా సమస్యను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని రవాణా శాఖ మంత్రి ని కోరారు.

ఈ విషయానికి సానుకూలంగా స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

 

మెకానిక్ మిత్రునికి ఆర్థిక సహాయం.

మెకానిక్ మిత్రునికి ఆర్థిక సహాయం

నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జియా గ్యారేజ్ నడిపిస్తున్న మెకానిక్ యూనిస్ ప్రమాదవశాత్తు బైక్ చైన్ లో పడి ఎడమచేతి రెండు వెళ్ళు పూర్తిగా కట్ కావడం జరిగింది.ప్రమాదానికి గురైన వ్యక్తి నెల రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో అతని యొక్క జీవనాధారం కొరకు మెకానిక్ యూనియన్ ని సంప్రదించినట్లు తెలిపారు.ఈ విషయం పై వెంటనే స్పందించిన నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అతనికి ఆర్థిక సహాయంగా11,000 వేల రూపాయలను మంగళవారం అందించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్ మాట్లాడుతూ టూవీలర్ మెకానిక్ యూనియన్ ఉండడం వల్ల మెకానికులకు ఎలాంటి ఆపద వచ్చిన యూనియన్ అండగా ఉంటుందని యూనియన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా యూనియన్ లో లేనివారు కూడా సభ్యత్వం తీసుకుని యూనియన్ నుంచి ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మెకానిక్ సోదరులు ఉపయోగించుకోవాలని కోరారు.అలాగే ప్రతి కమిటీ సభ్యుడు మరియు మెకానిక్ సోదరులు యూనియన్ లో లేని వారిని కూడా యూనియన్ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రతి ఒక్క మెకానిక్ తో మాట్లాడి యూనియన్ వల్ల ఏమిటి లాభాలు ప్రతి ఒక్క మెకానిక్ మరియు యూనియన్ కమిటీ సభ్యులు తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల నరేష్ గౌడ్,ఉపాధ్యక్షులు పెండెం భాస్కర్,చంద్రమౌళి,ప్రసాద్, అల్లావుద్దీన్,బానేష్ పాల్గొన్నారు.

NTR – War 2: పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా లుక్స్‌..

NTR – War 2: పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా లుక్స్‌..

 

వార్‌-2 (War 2) చిత్రం తారక్‌ (Jr NTR) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

 

వార్‌-2 (War 2) చిత్రం తారక్‌ (Jr NTR) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల టీజర్‌ విడుదల చేయగా దానికి చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్‌లో ఎన్టీఆర్‌ లుక్‌, స్టైలింగ్‌ అదిరిందనే ప్రశంసలు వచ్చాయి. ఆ క్రెడిత్‌ మొత్తం అనైతా ష్రాఫ్‌ అడజానియాకే (Anaita Shroff Adajania) దక్కుతుంది. తన కాస్ట్యూమ్స్‌కి, తన పని తనానికి వచ్చిన ప్రశంసని, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి ‘వార్‌ 2’ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఆనందంతో మునిగి తేలుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన అనైతా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘వార్‌ 2’లో మొదటిసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పని చేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. అదొక కొత్త అనుభూతి. ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్‌ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్‌ కోసం చాలా లుక్స్‌ డిజైన్‌ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాం. ఓ లక్ష్యంతో, ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రమిది. కియారా అద్వానీ కథానాయిక. ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వార్‌ 2 భారీ ఎత్తున విడుదల కానుంది.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్
అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు

నలుగురు హీరోయిన్లతో జయం రవి హీరోగా, నిర్మాతగా.. 

నలుగురు హీరోయిన్లతో జయం రవి హీరోగా, నిర్మాతగా.. 

 

కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్‌’ (Brocode) చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ప్రకటించారు. ‘డిక్కీలోనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో పేరొందిన కార్తీక్‌ యోగీ దర్శకత్వంలో ‘బ్రోకోడ్‌’ చిత్రం తెరకెక్కనుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ఎస్‌.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. స్ల్లాప్‌ స్టిక్‌ కామెడీ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రవి మోహన్‌ (Ravi Mohan) స్టూడియోస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు జయం రవి. మహిళా నటీమణులు ఎవరనేది త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. రవి మోహన్‌ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేష్‌ కె. బాబు డైరెక్ట్‌ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు కార్తీక్‌ యోగీ మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. ఈ చిత్రంలో స్లాప్‌ స్టిక్‌ కామెడీ బేస్డ్‌ సినిమా ఇది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అందించేలా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. పోర్‌ తోజిల్‌ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్‌ శివాజీ, యానిమల్‌, అర్జున్‌ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్థన్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్‌ ఇ. రాఘవ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఎ. రాజేష్‌ వ్యవహరించనున్నారు.

మరింత వెనక్కి దేవరకొండ సినిమా!

మరింత వెనక్కి దేవరకొండ సినిమా!
సినిమా పుస్తకాలు

Kingdom: నేటి ధాత్రి

 

 

 

 

 

జూలై 4న రావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మూవీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. జూలై నెలాఖరుకు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం.

Kingdom: మరింత వెనక్కి దేవరకొండ సినిమా!

ఇవాళ భారీ తెలుగు సినిమాలన్నీ విఎఫ్ఎక్స్ (VFX) మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి.

ఆ వర్క్ కాస్తంత ఆలస్యమైనా…

పోస్ట్ ప్రొడక్షన్ లో ఊహకందని జాప్యం ఏర్పడుతోంది.

దాంతో సినిమాలను ముందు ప్రకటించిన తేదీకి విడుదల చేయలేని నిస్సహాయ స్థితిలోకి నిర్మాతలు జారిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కారణంగానే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా పూర్తి కావడం లేట్ అయ్యిందన్నది వాస్తవం.

అయితే… పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి, షూటింగ్ పూర్తి చేసినా…

విడుదల మరోసారి వాయిదా పడింది.

ఇప్పుడు దానికి కారణం సకాలంలో కాని వీఎఫ్ఎక్స్ పనులు.

జూన్ 12న జనం ముందుకు రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడింది.

ఎప్పుడు వస్తోందో మేకర్స్ ఇంకా చెప్పలేకపోతున్నారు. సినిమా పుస్తకాలు

 

ఇదిలా ఉంటే… విఎఫ్ఎక్స్ కారణంగానే పలుమార్లు వాయిదా పడిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ఎట్టకేలకు ఈ నెల 27న విడుదల అవుతోంది.

అలానే అనేక సార్లు పోస్ట్ పోన్ అయిన నితిన్ ‘తమ్ముడు’ (Thammudu) సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నారు.

నిజానికి ఇదే తేదీన విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ (Kingdom) సైతం రావాల్సి ఉంది.

కానీ ఇప్పుడు ఆ తేదీన అది రావడం లేదని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బాలెన్స్ ఉందని తెలుస్తోంది.

ఇప్పటి నుండి నాన్ స్టాప్ గా టీమ్ వర్క్ చేస్తే…

జూలై 25న ఈ సినిమాను విడుదల చేసే ఆస్కారం ఉందట.

మొదట్లో జూలై 24న చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల కావచ్చుననే వార్తలు వచ్చాయి.

కానీ ఆ సినిమా విఎఫ్ఎక్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మళ్ళీ చేస్తున్నారు.

సో… అవి ఒక కొలిక్కి వచ్చే వరకూ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ గురించి ఆలోచించవద్దని చిరంజీవే స్వయంగా చెప్పాడని అంటున్నారు.

దాంతో జూలై 25వ తేదీ స్లాట్ దాదాపుగా ఖాళీ ఉన్నట్టే!

కేవలం హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ నరసింహా’ అనే పాన్ ఇండియా మూవీ మాత్రం ఆ రోజున వస్తుందని గతంలో ప్రకటించారు.

సో… విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’కు జూలై 25 బెస్ట్ డేట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ విషయమై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

పవన్‌తో హరీశ్‌ శంకర్‌ ఫ్లో మొదలైంది..

పవన్‌తో హరీశ్‌ శంకర్‌ ఫ్లో మొదలైంది..

 

 

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు.

 

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు. ఇటీవల ఓ షెడ్యూల్‌తో హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి ఓజీ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagath singh) వంతు వచ్చింది. హరీశ్‌ శంకర్‌(HariSh Shankar) దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ మళ్లీ ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో షూటింగ్‌ జరగనుంది. ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తదుపరి ఈ నెల 12 నుంచి పవన్‌కల్యాణ్‌ సెట్‌లో అడుగుపెడతారని తెలిసింది.

 ఈ సినిమా అనుకున్నప్పుడు ‘తెరీ’ మూవీ రీమేక్ అనుకున్నారు. ఏపీ ఎలెక్షన్ ముందు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు
అందుకు తగ్గట్టుగా డైలాగ్స్ సీన్స్ రాసుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం కాబట్టి కంప్లీట్ గా సీన్స్, డైలాగ్స్ మార్చారని సమాచారం. మార్పులు చేర్పులు చేసిన కథతో సెట్స్‌ మీదకెళ్లనున్నారని సమాచారం.
 అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే దర్శకుడు స్పందించాల్సిందే. పవన్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారని తెలియగానే అభిమానులు హంగామా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక.

 

 

పోతిరెడ్డిపల్లిలో భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు.

పోతిరెడ్డిపల్లిలో భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కోహిర్ మండల పోతిరెడ్డిపల్లి గ్రామంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న శంకర్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదిక వద్ద భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యలను అధికారుల వద్దకు తీసుకొచ్చారు. సత్వరమే భూ సమస్యలకు కృషి చేస్తామని తహశీల్దార్ జయరామ్ నాయక్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు రైతులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా దుద్దిళ్ళ శ్రీనుబాబు నియామకం పట్ల యూత్ కాంగ్రెస్ సంబరాలు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీను బాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు.ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినీత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఇది నిదర్శనం అన్నారు.పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు కష్టపడి పని చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా పార్టీ వదిలిపెట్టదని వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక ఉంటుందని ఇలాగే క్రియాశీలంకంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ దుదిల్ల శ్రీను బాబు మరి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లక్కం రాజు, అనుము ప్రశాంత్, ఇనుముల ప్రదీప్, నాగరాజు,స్వామి,బర్ల రాజు, నాగరాజు,నేతెట్ల కిరణ్, ఎడుమెకల కిరణ్, ప్రదీప్, ఐత రాజు, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం –

 

బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.

 

దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటుందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరియు మైనార్టీ వారి పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉందోనని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

 

ఇది వారి వర్గానికి అన్యాయం చేయడమే అవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు.

 

మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా చిన్న చూపు మరియు వివక్ష చూపిస్తుందని జ్యోతి పండాల్ అన్నారు.

 

సెంట్రల్ లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అమలు చేసి అట్టడుగు వర్గాల మైనార్టీ వాళ్ళని ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.

 

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 నాటికే ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 14 లక్షలు పైగా ఇండ్లని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం జరిగింది.

 

అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే డబ్బులు పెట్టుకొని చదువుకో లేని స్థితిలో ఉంటారో వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇలా అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటుంది మా బిజెపి ప్రభుత్వం.

 

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మైనార్టీలను మభ్యపెట్టి ఎలక్షన్ టైం లో వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పైన చిన్నచూపు చూసి వాళ్ళని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ అన్నారు.

 

కావున కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీల పట్ల వివక్షత, చిన్న చూపు మరియు కించపరిచేలా ప్రవర్తించవద్దని జ్యోతి పండాల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version