గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

నున్నా నాగేశ్వరరావుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

నేటి ధాత్రి గార్ల:

 

సీతంపేట సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో శిఖం భూములు కబ్జాకు గురి కాకుండ శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరావు డిమాండ్ చేశారు.గార్ల మండల కేంద్రం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ,766 సర్వే నెంబరు లో ఉన్న వందలాది ఎకరాల భూమిని కొందరు కబ్జా దారులు ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా బావులు తీసి,విద్యుత్ మోటార్ లు ఏర్పాటు చేసుకొని చెరువు నీటిని వాడుకోవడం వలన ఆయకట్టు రైతుల భూములకు సాగునీరు అందని దుస్థితి దాపురించిందని అన్నారు.గార్ల పెద్దచెరువు శిఖం భూముల విషయంలో ఉన్నతాధికారుల కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న నామ మాత్రపు సర్వే లు చేసి చేతులు దులుపుకుంటున్నారని అందోళన వ్యక్తం చేశారు.స్దానిక ఎంపి బలరాం నాయక్,ఎమ్మెల్యే కోరం కనకయ్య లు ప్రత్యేక చొరవ తీసుకుని శిఖం భూములను కబ్జా నుండి కాపాడి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, రైతులు జి.వీరభద్రం, ఎ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

ఎమ్మెల్యే కోరం కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్షం…

ట్రెంచ్ హద్దులు ఏర్పాటు కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య…

నేటి ధాత్రి – గార్ల :-

 

 

 

సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ కోరారు. మంగళవారం గార్ల గ్రామ పంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన భూ భారతీ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే కనకయ్య ను సిపిఎం,సిపిఐ,న్యూడెమోక్రసీ పార్టీల అధ్వర్యంలో వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ,మండలానికే తలమానికంగా మారిన గార్ల పెద్ద చెరువులో 766 సర్వే నెంబరు లో శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయాని,766 సర్వే నెంబరు భూములతో పాటు 457, 440 సర్వే నెంబరు లలో ఉన్న ఎఫ్ సి ఎల్ భూములను సర్వే చేపట్టి శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెండ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాలు చేయించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్పందించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తక్షణమే హద్దులు గుర్తించి ట్రెంచ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ నాయకులు జి‌.సక్రు తదితరులు పాల్గొన్నారు.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

గార్ల నేటి ధాత్రి:

మండలంలోని సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో కబ్జాకు గురైన చెరువు శిఖం భూములకు వెంటనే ట్రెంచ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక మంగపతి రావు భవనంలో మల్లెల నాగమణి అధ్యక్షత జరిగిన మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్, సత్యవతిలు మాట్లాడుతూ, మండలానికే అతిపెద్ద చెరువు గా ఉండి,అటు ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇటు రైతుల లెక్కల ప్రకారం సుమారుగా 18 వందల ఎకరాల వరి పంటల భూములకు సాగునీరు అందించే ఈ చెరువు శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని పట్టాలు చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెంచ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు కె.ఈశ్వర్ లింగం, వి.పి.వెంకటేశ్వర్లు,ఐ.గోవింద్,ఎల్లయ్య, మౌనిక,ఉపేందర్ రెడ్డి, బి.లోకేశ్వరావు,కైబాబు,మౌలానా,సిహెచ్.మౌనిక,ఎ.రామకృష్ణ,కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version