భారతదేశపు ప్రముఖ డిటిహెచ్ సేవల సంస్థ ‘డిష్ టీవీ ఇండియా లిమిటెడ్’ దక్షిణ భారత వినియోగదారుల కోసం సరికొత్త,
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
ఆకర్షణీయమైన ప్రాంతీయ ఆఫర్లను ప్రకటించింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, అత్యంత అందుబాటు ధరలో అంతరాయం లేని వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీలను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.
రూ.149లకే 225కు పైగా ఛానళ్లు:
ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా నెలకు కేవలం రూ.149 ప్రారంభ ధరతోనే వినోదం, సినిమాలు, వార్తలు మరియు క్రీడల సమాహారంగా బేస్ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇందులో మొత్తం 225కి పైగా ఛానళ్లు ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రేక్షకులకు పెద్దపీట వేస్తూ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కో దానికి 30కి పైగా ఛానళ్లను, తమిళ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 36కి పైగా ఛానళ్లను ఈ ప్యాకేజీలలో చేర్చారు. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఈ ప్యాక్‌లను మార్చుకునే (కస్టమైజ్) సౌకర్యాన్ని కూడా కల్పించారు.
మొదటిసారిగా ‘స్పోర్ట్స్ ఆల్వేస్-ఆన్’ ఫీచర్:
క్రీడాభిమానుల కోసం డిష్ టీవీ ప్రత్యేకంగా ‘స్పోర్ట్స్ ఆల్వేస్-ఆన్’ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా కస్టమర్ల రీచార్జ్ గడువు ముగిసినా లేదా తాత్కాలికంగా సేవలలో అంతరాయం ఏర్పడినా.. ముఖ్యమైన క్రీడా ప్రసారాలు నిలిచిపోకుండా నిరంతరాయంగా వీక్షించవచ్చు.
ఈ సందర్భంగా డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ సీఈఓ మనోజ్ దోభాల్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశం తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని, ఇక్కడి కుటుంబాల వీక్షణ అలవాట్లను దృష్టిలో ఉంచుకునే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీలను తెచ్చామని తెలిపారు. నాణ్యమైన కంటెంట్‌ను, నిరంతరాయ సేవలను తక్కువ ధరలోనే అందించడం ద్వారా దక్షిణ భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్లు చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సుఖ్‌ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
