కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రి సీజ్‌..

కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రి సీజ్‌

 

కిడ్నీ రాకెట్‌ కేసులో.. గ్లోబల్‌ ఆసుపత్రిని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్‌ థియేటర్‌, ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్‌ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.

 రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్‌ ఆసుపత్రి(Global Hospital)లో సోదాలు చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రితోని ఆపరేషన్‌ థియేటర్‌, ఆపరేషన్‌కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకుని ఆసుపత్రితో సహా సీజ్‌ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. గత నెల 9వ తేదీ జరిగిన ఈ సంఘటనలో ఆసుపత్రి అధినేత, అన్నమయ్య జిల్లా డీసీహెచ్‌ఎస్ కె.ఆంజనేయులుతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. అనంతరం ఆంజనేయులును సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందిఈ కేసులో ప్రధానపాత్ర పోషించిన డాక్టర్‌ ఆంజనేయులుతో పాటు మదనపల్లె డయాలసిస్‌ కేంద్రంలో పనిచేస్తున్న మేనేజరు బాలరంగడు, కదిరి డయాలసిస్‌ కేంద్ర మేనేజరు మెహరాజ్‌, విశాఖకు చెందిన పిల్లి పద్మ, కాకర్ల సత్య, సూరిబాబు, కిడ్నీ మార్పిడి చేసిన బెంగళూరు(Bengaluru)కు చెందిన డాక్ట్టర్‌ పార్థసారధిరెడ్డికి సహకరించిన కడపకు చెందిన అనుచరులు కొండయ్య, సుమన్‌లను రెండువిడతలుగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇదే కేసులో మరో ఆరుగురిపై కేసు నమోదైంది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా, గురువారం జరిగిన ప్రక్రియలో డీఎస్పీతో పాటు వన్‌, టూటౌన్‌ సీఐలు ఎస్‌.మహ్మద్‌రఫీ, రాజారెడ్డి, ఎస్‌ఐ రహీముల్లా, మదనపల్లె పీపీ యూనిట్‌ వైద్యులు డాక్టర్‌ శ్రీధర్‌, ప్రభాకర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్తగా ఉంటూ మానవఅవయవాల అక్రమ మార్పిడిలో ఆంజనేయులు ప్రధాన నిందితుడని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యులైన ఆయన కుమారుడు డాక్టర్‌ అవినాశ్‌, కోడలు శాశ్వతిపై కూడా కేసు నమోదైనట్లు తెలిసింది. అలాగే గ్లోబల్‌ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ అయిన ఆంజనేయులు భార్యపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆసుపత్రి ఎవరి పేరుపై ఉందో ఆ వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. అధికారిక సమాచారం వచ్చాక ఆసుపత్రి రిజిస్ర్టేషన్‌ అయిన వారిపై కూడా కేసు నమోదు చేయనున్నారు.

నాటుసారా స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు….

నాటుసారా స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

నమ్మదగిన సమాచారం మేరకు జహీరాబాద్ బృందం మొగుడం పల్లి మండలం సజ్జ రావు పేటలో ఆకస్మిక దాడులు నిర్వహించి, రెండున్నర లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అబ్కారీ మద్యనిషేధ శాఖ జహీరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ బి.రమేష్ తెలిపారు. ఈ దాడులు జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగాయి.

కల్తీ కార తయారీ కేంద్రాలపై దాడులు.. రెండు కేంద్రాలు మూసివేత…

కల్తీ కార తయారీ కేంద్రాలపై దాడులు.. రెండు కేంద్రాలు మూసివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో కల్తీ కారతయారీ కేంద్రాలపై పోలీసులు మంగళవారం భారీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కల్తీ కార తయారీ కేంద్రాలను మూసివేసి, ఇద్దరు యజమానులను రిమాండ్ చేశారు. ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే, పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరుకుతో పిండి
వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో ప్రగతి నగర్ కాలనీలోని “పరస్ కార తయారీ కేంద్రం” యజమాని పరాస్ నాథ్, అలాగే హమాలి కాలనీలోని “అభినయ శ్రీ స్పెషల్ కార తయారీ కేంద్రం” యజమాని ఆయెన పేరుమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు, జహీరాబాద్ టౌన్ ఎస్ఐలు కే.వినయ్ కుమార్, రాజేందర్ రెడ్డి, కే.సంగమేశ్వర్ లు తమ సిబ్బందితో కలిసి ఈ రెండు కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. పరిశీలనలో, ఆ కేంద్రాల్లో అగ్ని భద్రతా నియమాలు, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండానే కొంతమంది పని మనుషులతో కల్తీ పిండి వంటలు తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ విధంగా తయారు చేసిన పదార్థాలను జహీరాబాద్, పరిసర ప్రాంతాల్లో విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు కార తయారీకి వాడిన పదార్థాలు, యంత్రాలు, ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version