రైతు ఇంట సంక్రాంతి కాంతులు

సంక్రాంతి రైతు ఇంట కాంతిని నింపాలి…

మంత్రి సీతక్క సహకారం మరువలేనిది

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

రైతులకు పట్టు వస్త్రాలు పంపిణీ…

వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు….

మంగపేట నేటిధాత్రి

 

సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని ఆ దిశగా ప్రభుత్వాల సహకారం, ప్రకృతి కరుణ ఉండాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు బుధవారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాసిరెడ్డీ సాంబశివరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగ అభివృద్ధిలో మంత్రి శీతక్క సహకారం మరువలేనిదన్నారు సంక్రాంతి పర్వదినం వ్యవసాయ రంగానికి ప్రతీకగా రైతులు భావిస్తారని అన్నారు ఈ మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా వివేక ఎ ఫ్బి ఓ , వికాస్ అగ్రి ఫౌండేషన్ మరియు వికాస్ ఫర్టిలైజర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు జరీ పట్టు వస్త్రాలను బహుకరించటం ఈ కార్యక్రమంలో తాను కుటుంబ సభ్యులతో హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సాంబశివరెడ్డి అన్నారు తమ సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల కోసం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం ఎంపిక చేసిన తొంబై మంది రైతులకు పట్టు వస్త్రాలను బహూకరించినట్లు ఆయన తెలిపారు తమ సంఘం పరిధిలోని రైతులందరికీ ఉచిత ప్రమాద బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించినట్లు సాంబశివ రెడ్డి ప్రకటించారు అనంతరం సంక్రాంతి కానుక గా రైతులకు జరి పట్టు రామ్ రాజ్ పంచలు చొక్కా ల ను సాంబశివరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి కి పుష్పగుచ్చం అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి కటుకూరు శేషయ్య ధూళిపాల బాలకృష్ణ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు షేక్ మొయినుద్దీన్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్కీ వెంకన్న జిల్లా పేసా కమిటీ అధ్యక్షులు డబ్బుల ముత్యాలరావు దొడ్డ భాస్కర్ రమేష్ కృష్ణారెడ్డి పెండ్యాల హరి కృష్ణ వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు చెట్టుపల్లి తిరుపతిరావు జడ్డి పూర్ణ ప్రసాద్ నేలపట్ల శేషారెడ్డి వంద మందికి పైగా స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version