ప్రగతి ప్రణాళిక అభివృద్ది కాదు దోచుకోవడం…

ప్రగతి ప్రణాళిక అభివృద్ది కాదు దోచుకోవడం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం

మీడియా సెల్ ఇంచార్జి అశోక్

వనపర్తి నేటిదాత్రి .

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
మహిళలకు 2500 ఫించన్ ,తులం,బంగారం ,4000ఆసరా పింఛన్లు పెంపు ఎక్కడ అని అధికారులను కాంగ్రెస్ పార్టీ ,నాయకులను నిలదీయాలని జిల్లా మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రజా పాలన.ప్రగతి ప్రణాళికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల ఆగ్రహం గురి కాక తప్పదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6నుండి జూన్ 12వరకు నిర్వహించ నున్న ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్ర జల ముందర పరువు పోవడం తప్పదని బి. ఆర్. ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్ అన్నారు
పరిపాలన చేతకాక,ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమై రేవంత్ రెడ్డి రోజుకో నాటకాని తెరపైకి తెస్తున్నారని నందిమల్ల.అశోక్ తీవ్రంగా మండిపడ్డారు 420హామీలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం ఆయ్యారని విమర్శించారు బీ ఆర్ ఎస్ మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు ఉచిత కంటి అద్దాలు ,రైతు బంధు ఎకరాకు 6000 వేలు వేశారని ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు నాణ్యమైన మద్యహాన్న భోజనం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 5 రూపాయల భోజనం అమలు చేశారని అశోక్ ఆరోపించారు , రైతు బీమా,రైతు రుణ మాఫీ,24గంటల ఉచిత విద్యుత్,విద్యార్థులకు విద్యా బరోసా ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు
ప్రజా పాలన పేరిట గ్రామాలకు పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మా దగ్గరకు రావాలని నిలదీయాలని గ్రామల ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశములో యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి,మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్,సీనియర్ నాయకులు వెంకట్ సాగర్ సయ్యద్.జమీల్,మంద.రాము,విజయ్,సాయికుమార్ తదితరులు ఉన్నారు

మాజీ సింగిల్ విండో అధ్యక్షులు దివంగత తిరుమలయ్య…

మాజీ సింగిల్ విండో అధ్యక్షులు దివంగత తిరుమలయ్య చిత్రపటానానికి నివాళులు
అర్పించిన మాజీ మంత్రి బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిధాత్రి .

మాజీ సింగిల్ విండో అధ్యక్షులు దివంగత నందిమల్ల తిరుమలయ్య చిత్రా పటానికి మాజీ మంత్రి
సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి బీ ఆర్ ఎస్ నేతలు ఘనo గ నివాళులర్పించారు మాజీ గ్రంధాలయ చైర్మన్ బోలమోని న్యాయ వాది
.లక్ష్మయ్య, బీ ఆర్ ఎస్ నేతలుం.తిరుమల్, నాయుడు వేణు గోపాల్,గులాం ఖాదర్ ఖాన్,నీలస్వామి,బొబ్బిలి.ప్రేమ్ కుమార్,స్టార్.రహీమ్,నందిమల్ల.రాములు,రామకృష్ణ వెంకటేష్ తదితరులు ఉన్నారు ఈసందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలయ్య రాజకీయ ఆశయాలు నెరవేర్చాలని తిరుమయ్య కుమారుడు నంది మల్ల అశోక్ ను కోరారు ఈమేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావు ల చంద్రశేఖర్ రెడ్డి నంది మల్ల అశోక్ కుటుంబ సబ్యులకు మనో ధైర్యం కల్పించారు

మాజీ మంత్రిపుట్టినరోజు సందర్భంగా…

మాజీ మంత్రిపుట్టినరోజు సందర్భంగా

కాన్వాయితో స్వాగతం పలికిన బి.ఆర్ ఎస్ నేతలు

వనపర్తి నేటిదాత్రి .

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 67వ జన్మదిన వేడుకల సందర్భంగా కాన్వయితో బీ ఆర్ ఎస్ నేతలు స్వాగతం పలికారు . భారీ కాన్వాయ్ తో ఇంటికి చేరుకు న్నారు బీ ఆర్ ఎస్ నేతలు సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, సునీల్ వాల్మీకి ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు వేదపండితులు పెద్దల ఆశీర్వాదం మాజీ మంత్రి తీసుకున్నారు. మోహన్ పండ్లతో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు బీ ఆర్ ఎస్ వనపర్తి పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.నాగవరం గ్రామములో నిరంజన్ రెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పుట్టిన రోజు వేడుకలలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల్ బండారు కృష్ణ పెండం నాగన్న యాదవ్ జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా ఇంఛార్జి నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్ ఘన పురం బీ ఆర్ ఎస్ నేతలు లక్ష్మారెడ్డి,.కృష్ణయ్య, వనపర్తి మండల బీ ఆర్ ఎస్ నేతలు పెద్దగూడెం .మాణిక్యం చిట్యాల వెంకట్ రావు,మాధవ్ రెడ్డి,ధర్మా నాయక్, సాయి యాదవ్,పెద్దమందడి నేతలు రఘుపతి రెడ్డి,వేణు యాదవ్ మోహన్ యాదవ్ సేనాపతి పెబ్బేరు నాయకులు ఎద్దుల కరుణ శ్రీ,వనం.రాములు,దిలీప్ రెడ్డి,గోపాల్ పేట నాయకుల బాలరాజు చంద్రశేఖర్,శ్రీనివాస్,కె.భాస్కర్,మతీన్,మాన్య నాయక్ ఎదుల నాయకులు రమేష్,రాజారెడ్డి,అబ్దుల్లా రెవల్లి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారని నంది మల్ల అశోక్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version