ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన శ్రీరాంపూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ…

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన శ్రీరాంపూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ

శ్రీరాంపూర్,నేటి ధాత్రి:

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో,మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్,వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.నూతన పార్టీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని,ఏప్రిల్ 25న జరిగే పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు సిద్ధంశెట్టి సాజన్,ఐద ప్రశాంత్,రామ్మోహన్ చారి, అడ్లకొండ రవి గౌడ్,ముష్క రవి కిరణ్,పానుగంటి అశోక్,లక్ష్మణ్, కందుల స్వరాజ్,మేడి రాజశేఖర్, సాయి,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి…

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి

బాల్క సుమన్ పిలుపు

మంచిర్యాల,నేటి ధాత్రి:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 12న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆహ్వానం మేరకు ఖరారైన ఈ పర్యటనలో భాగంగా,కేటీఆర్ ఆదివారం ఉదయం గం 11 లకు నస్పూర్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు.అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను సన్మానించి,మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.ఆ తర్వాత క్యాతనపల్లిలోని బాల్క సుమన్ నివాసంలో వివిధ సంఘాల నేతలతో సమావేశమై, చివరగా మీడియాతో మాట్లాడనున్నారు.ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు.

సీతారాముల కల్యాణానికి 5,016 రూపాయల విరాళం…

సీతారాముల కల్యాణానికి 5,016 రూపాయల విరాళం

ఇందారం వార్డు సభ్యులు బేదా లాస్య- ప్రసాద్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఇందారం వార్డు సభ్యులు బేద లాస్య – ప్రసాద్ తమ ఉదారతను చాటుకున్నారు.
​మంగళవారం ఆలయ కమిటీని కలిసి,కల్యాణోత్సవ ఏర్పాట్ల నిమిత్తం రూ. 5,016/- నగదును విరాళంగా అందజేశారు.అలాగే స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు నిర్వహించే అన్నదాన కార్యక్రమం కోసం 25 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం వల్ల అందరికీ శుభం చేకూరుతుందని, తమ వంతుగా ఈ చిన్న సాయం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.​దాతలైన బేద లాస్య – ప్రసాద్ లను టేకుమట్ల ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బల్ల వెంకటేష్,మాజీ సర్పంచ్ గొనె నర్సయ్య,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి..

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

https://youtu.be/l0AynUdkDb8

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల డిసిపి భాస్కర్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. కార్యక్రమం జూన్‌ 12 వరకు కొనసాగుతుందని, ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ చైర్మెన్ ,సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.

పెండింగ్‌ ఫైల్స్‌ పరిష్కారం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో జిల్లాలో తాగు నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు మునిసిపాలిటీల చైర్ పర్సన్లు వైస్ చైర్ పర్సన్లు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కార్మికుల ప్రాణాలు పట్టణి సింగరేణి యాజమాన్యం…

కార్మికుల ప్రాణాలు పట్టణి సింగరేణి యాజమాన్యం,

మందమర్రి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మంచిర్యాల జిల్లా కమిటీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రమాదల నివారణకు సి అండ్ ఎండీ చైర్మన్,డైరెక్టర్లకు,సేప్టి జీఎం జోక్యం చేసుకోవాలి.

ఓకే కుటుంబం,ఒకే లక్ష్యం,ఓకే గమ్యం అనే నినాదం పేరుకేనా?
అధికారులకు సిపిఎం సూటి ప్రశ్న

సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి

గనిప్రమాదాలు,రక్షణ చర్యలు,
పని ఒత్తిడి,వైద్య సౌకర్యాల్లో కొనసాగుతున్న లోపాలపై జిఎం కార్యాలయం వద్ద సీపీఎం నిరసన పర్సనల్ మేనేజర్ గార్క్ వినతి పత్రం.

ఎస్ సి సి ఎల్ మందమర్రి,
శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలల్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పర్మనెంట్,
కాంట్రాక్టు కార్మికులు విధుల నిర్వహణలో అనేక ప్రమాదాలు జరిగి మరణించడం, గాయలపాలు కావడం జరుగుతుంది.తమ ఆప్తులను కోల్పోయిన
వారి కుటుంబాలు మానసికక్షోభకు గురై పోతున్నారు.సంస్థను లాభాల బాటలో నడిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడడంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నది.ఉత్పత్తి,లాభలు సాదిసిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం రక్షణ వ్యవస్థను పటిష్టం చెయ్యడం లేదు,రక్షణ సూత్రాలను యాజమాన్యం పాటించడం లేదు.పని ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులున్నాయో కార్మికులు,కార్మిక సంఘాలు చెప్పిన కూడ కనీసం వినడం లేదు,
పట్టించుకోవడం లేదు.
కాల పరిమితి నిండిపోయి,చెడిపోయిన యంత్రాలతో పని చేయిస్తు.
ప్రమాదాలకు కారణం అవుతున్నారు.ప్రమాదంలో గాయపడ్డవారిని గనిలో నుంచి తీసుకురావడం కోసం కనీసం స్త్రేచ్చర్ లేకపోవడం,అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం,నిపుణులైన వైద్యులు లేకపోవడాన్ని చూస్తుంటే సింగరేణిలో ఆటవీక రాజ్యం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది.పని స్థలాల్లో స్వచ్ఛమైన గాలి అందకపోవడం,రక్షణ చర్యలు చేపట్టకపోవడం,
ఉత్పత్తి,లాభాల కోసం షిప్ట్ ల సంఖ్యను పెంచడం,
నాసి రకమైన రక్షణ పరికరాలతో బలవంతంగా ప్రమాదకరమైన పరిస్థితిల్లో కార్మికులను యంత్రాల్లగా పని చేయించడం జరుగుతుంది.
గడిచిన 2,3 సం.రాల నుంచి నేటి వరకు అనేక ప్రమాదాలు జరిగి పలువురు పర్మనెంట్,కాంట్రాక్టు కార్మికులు
మరణించడం,గాయల పాలుకావడం జరిగింది.
ఇన్ని ప్రమాదాలు జరిగినా బాధ్యులపై చర్యలు లేవు, భవిష్యత్తులో జరగకుండ చెయ్యడం కోసం యాజమాన్యంలో చలనం లేదు.
ఉత్పత్తి,లాభాల కోసం యాజమాన్యం ఎంతైతే శ్రద్ద పెట్టుతున్నదో అంతకంటే ఎక్కువ శ్రద్ద కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం తక్షణమే రక్షణ వ్యవస్థను బలోపేతం కోసం తగిన చర్యలు చేపట్టాలి.లేకుంటే
ప్రతి మరణం,ప్రమాదం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం చేస్తున్న కుట్రలుగా కార్మికులు,ప్రజలు బావించ వల్సిసి వస్తుంది.
సి & ఎండీ చైర్మన్,డైరెక్టర్లకు,
సేఫ్టీ జీఎం,కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్మికుల ప్రాణాలను కాపాడలని డిమాండ్ చేస్తున్నాము.

డిమాండ్స్

1,జరిగిన ప్రమాదాలు,దాని కారణాలు,రక్షణ వ్యవస్థ పని తీరుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.
2,తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తక్షణమే అన్ని పర్మనెంట్,కాంట్రాక్టు యూనియన్లతో,నిపుణులతో,సీనియర్ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి.
3,ప్రమాదాలకు బాధ్యులుగా స్థానిక అధికారి,సేఫ్టి అధికారి, ఏరియా జనరల్ మేనేజర్లపై చర్యలు తీసుకోవాలి.
4,డీజీఎంఎస్ తో జరిగే త్రిసభ్య కమిటి సమావేశంలో అన్ని కార్మిక సంఘాలను, కాంట్రాక్టు కార్మిక సంఘాలను పిలవాలి.
5,ప్రతి షిఫ్ట్ లో సెప్టి అధికారులను నియమించాలి.
6,పని ప్రదేశాల్లో పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.
7,ప్రతి విభాగం వద్ద ప్రాథమిక వైద్యంతో పాటు,అంబులెన్స్ లు,
స్త్రేచ్చర్లు,ఆక్సిజన్,ఫస్ట్ యిజ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలి
8,బెల్లంపల్లి,రామకృష్ణ పూర్ ఏరియా ఆసుపత్రిలల్లో అన్ని రకాల వైద్య నిపుణులతో పాటు,తగినంత సిబ్బందిని నియమించాలి.
9,ఉత్పత్తి,లాభాలే కాదు కార్మికులు,వారి కుటుంబాలు,ప్రాణాలు,
సంక్షేమం మాదే అనే విధంగా యాజమాన్యం వ్యవరించాలి.
10,ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ తో పాటు డాక్టర్లను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించాలి.
11,కార్మికులకు రక్షణ మరియు సంక్షేమానికి నిధులను పెంచాలి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు

సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
గోమసా ప్రకాష్,బోడెంకి చందు
జిల్లా కమిటీ సభ్యులు
దూలం శ్రీనివాస్,గుమసా అశోక్,సామల ఉమ రాణి.

నాయకులు దాగం శ్రీకాంత్,
జి.మహేందర్,సిడం సమ్మక్క, బి.రమాదేవి,నిర్మల
,సిడం జంగు బాయి,
కె.రాజేశం, రాజలింగు, పోషం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version