తెలంగాణలో ఏపీ ఫార్ములా..?
చంద్రబాబు-పవన్ తో ఆపరేటర్?
ఏపీలో హిట్ అయిన కూటమి ఫార్ములాతో … తెలంగాణలో ల్యాండ్ అవుతుంది బీజేపీ. గోల్కొండపై జెండా కోసం… మాస్టర్ ప్లాన్ రెడీ చేసి నట్టు తెలుస్తోంది.
2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.
నైజాం గడ్డపై అధికారమే టార్గెట్‌గా… గోల్కొండ కోటపై కమలం జెండా ఎగరవేయాలని పెద్ద స్కెచ్ వేసింది.
కానీ ఎన్నికల ముందు మారిపోయిన రాజకీయ సమీకరణాలు… కాంగ్రెస్ ఊహించని రైజ్… కమలనాథుల ప్లాన్‌కు బ్రేక్ వేశాయి.
అయినా బీజేపీ పూర్తిగా వెనక్కి పోలేదు.
గతంతో పోలిస్తే బలంగా నిలబడింది.
8 అసెంబ్లీ సీట్లు గెలిచింది.
దాదాపు 20 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా 8 సీట్లు సాధించింది.
దీంతో… “సరైన స్ట్రాటజీ పడితే తెలంగాణలో అధికారమే అసాధ్యం కాదు” అన్న నమ్మకం బీజేపీ హైకమాండ్‌లో పెరిగిందట.
అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ఫస్ట్ పొలిటికల్ టూర్ తెలంగాణ నుంచే స్టార్ట్ అయ్యిందన్న చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.
కానీ ఈ టూర్‌లో అసలు పొలిటికల్ హీట్ పెంచింది మరో అంశం.
ప్రధాని మోదీ… ఏపీ సీఎం చంద్రబాబు… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం.
బయటకు ఇది సాధారణ సమావేశంలా కనిపించినా… లోపల మాత్రం తెలంగాణ రాజకీయాలపైనే కీలక చర్చ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అసలు టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ అని చెబుతున్నారు.
హైదరాబాద్… మల్కాజ్‌గిరి… సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కమలం పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోందట.
డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ సీట్లు 56 వరకు పెరిగే అవకాశం ఉండటంతో… ఇప్పటినుంచే అర్బన్ తెలంగాణపై ఫోకస్ పెంచిందని చెబుతున్నారు.
అందుకే ఏపీలో సూపర్ హిట్ అయిన బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలన్న ఆలోచనలో మోదీ ఉన్నారన్న గుసగుసలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే బీజేపీ లెక్కలు చాలా క్లియర్‌గా ఉన్నాయట.
తెలంగాణలో బీజేపీకి… టీడీపీ పాత క్యాడర్ కలిస్తే…
జనసేన యువత ఫాలోయింగ్ యాడ్ అయితే…
అర్బన్ ఓటింగ్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారట.
ముఖ్యంగా సెటిలర్ ఓటు బ్యాంక్‌పై ఈ కూటమి కన్నేసిందన్న చర్చ బలంగా నడుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు… ఉమ్మడి రంగారెడ్డి… ఖమ్మం… నల్గొండ… మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆంధ్రా సెటిలర్ల ప్రభావం ఇప్పటికీ గట్టిగానే ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఈ ఓటు బ్యాంక్ ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపింది.
కానీ తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో కాంగ్రెస్ వైపు కూడా షిఫ్ట్ అయిన సంకేతాలు కనిపించాయి.
ఇప్పుడు అదే ఓటు బ్యాంక్‌ను తిరిగి తమ వైపు తిప్పుకోవడమే బీజేపీ అసలు గేమ్ ప్లాన్ అంటున్నారు.
చంద్రబాబుకు ఇప్పటికీ తెలంగాణలో… ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక సెక్షన్ క్యాడర్ ఉందని చెబుతుంటారు.
ఖమ్మం… నల్గొండ… మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా టీడీపీ పాత నెట్‌వర్క్ పూర్తిగా మాయం కాలేదన్న అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో పవన్ కల్యాణ్‌కు తెలంగాణ యువతలో ఉన్న ఇమేజ్… జనసేన సోషల్ మీడియా స్ట్రెంగ్త్ కూడా కూటమికి అదనపు బలం అవుతుందని భావిస్తున్నారట.
ఇప్పటికే తెలంగాణలో జనసేన నిర్మాణంపై కూడా కసరత్తు మొదలైనట్లు సమాచారం.
అంటే… ఇది కేవలం ఒక పొత్తు చర్చ మాత్రమే కాదు…
2029 తెలంగాణ ఎన్నికల కోసం ముందుగానే గ్రౌండ్ రెడీ చేసే ఆపరేషన్‌గా కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా… యాంటీ ఇన్‌కంబెన్సీ మొదలయ్యేలోపు అర్బన్ ఓటును కన్‌సాలిడేట్ చేయాలని బీజేపీ భావిస్తోందట.
ఇక బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా రికవర్ కాకపోవడం కూడా కమలనాథులకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
అంటే… తెలంగాణలో రాబోయే అసలు పోరు ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతుందా..?
ఏపీలో సక్సెస్ అయిన కూటమి ఫార్ములా… నైజాం గడ్డపై కూడా రిపీట్ అవుతుందా..?
లేక తెలంగాణ రాజకీయాల లెక్కలు… ఢిల్లీ వ్యూహాలనే తలకిందులు చేస్తాయా..?
