ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్ నేటి,ధాత్రి:
జైపూర్ మండలం మూడో విడత జడ్పీ హైస్కూల్ ఎన్నికల కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు.బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా పరిశీలించాలని,భోజన వసతి ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సునయాసంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏ.ఆర్ రాజ్ కుమార్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
