ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేము

ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేము

అమ్మ ప్రేమను వెలకట్టలేము
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పురిటి నొప్పులు పోస్టర్ ఆవిష్కరణ మండల తహసీల్దార్ జాలి సునీత గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఈ గేయాన్ని ఆలపించిన అంకుశాపూర్ గ్రామానికి చెందిన జీడి అనితను అభినందిస్తూ సామాజిక చైతన్య గీతాలు ఇంకా ఎన్నో పాడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని అమ్మ ప్రేమను వెలకట్టలేమనీ, ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమని, తన మనసు ఆకాశమనీ, కన్నతల్లి ప్రేమను మరువద్దని, జీవితాంతం అమ్మను కంటి రెప్పల కాపాడుకోవాలని ప్రతిరోజు అమ్మను ప్రేమించాలని మరియు పూజించాలని, పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మంగళపెల్లి శ్రీనివాస్, ఏంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నిమ్మల భద్రయ్య ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మంద సాంబయ్య,డీలర్ల జిల్లా కార్యదర్శి గంగాదార్ రాజు, ఏం ఆర్పిఎస్ మండల నాయకులు,జీడి సంపత్ ,గాయకులు పుల్ల ప్రతాప్ కార్యాలయ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version