పుచ్చలపల్లి సుందరయ్యకు ఘనమైన నివాళి…

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘనమైన నివాళి

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు

సిపిఎం పార్టీ నిర్మత పుచ్చల పల్లి సుందరయ్య 41వ వర్ధంతి నీ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య కాలనీలో నిర్వహించారు .
ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ , కార్మికులను ,పేదలను దోపిడీకి గురిచేస్తున్న పెట్టుబడి దారి వ్యవస్థను కూల్చీ సోషలిజం స్థాపించడమే సుందరయ్య కీ ఘనమైన నివాళి అని అన్నారు . భారత దేశంలో సంపద కొంతమంది దగ్గర పోగుబడుతున్నది 90శాతం మంది పేదలుగా నిరుపేదలుగా జీవనం కొనసాగిస్తున్నారు . నిరుద్యోగ సైన్యం పెంచి పోషించే వ్యవస్థ పెట్టుబడి దారి వ్యవస్థ అన్నారు . మహిళాలను ఆటబొమ్మలుగా చూయించేది ,అత్యాచారాలు జరగడం సహజమే అనే ధోరణి ఈ వ్యవస్థలో ఉన్నదన్నారు . కులం ,మతం పేరుతో సమాజాన్ని నిలువున చీల్చింది పెట్టుబడి దారి వ్యవస్థ అని మండి పడ్డారు . పెట్రోల్ ,డీజిల్ ,ఆదాచేయండి ,బంగారం కొనుగోలు చేయకండి అంటూ స్వయానా ప్రధాని ప్రచారం చేయడం వెనుక దాగివున్న ఉన్న అసలు రహస్యం సంక్షోభమే అన్నారు .పెట్టుబడి దారి వ్యవస్థ ఆర్థిక అసమానతలు ,సామజిక ,రాజకీయ అసమానతలు పెంచి పోషించే దుర్మార్గపు వ్యవస్థ అన్నారు . ఈ వ్యవస్థ మార్పుకోసం నేటి యువత ,కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలనీ ఆయన పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడప శేఖర్,, నాయకులు సిహెచ్ రవికుమార్, మేకల మహేందర్, మునుకుంట్ల రాజేందర్, జ్ఞానేశ్వరి, వసంత లక్ష్మి, గట్టు శంకర్, గడ్డం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version