శ్రీరాంపూర్ లో గంజాయి నివారణపై ప్రత్యేక తనిఖీలు
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో గంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా,రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ సహాయంతో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలు శ్రీరాంపూర్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు,పాన్ షాపులు,వైన్ షాపులు,ఖాళీ స్థలాలు,ప్లే గ్రౌండ్స్‌తో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టారు.గంజాయి అక్రమ రవాణా,వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
