చందుర్తి మండల కేంద్రంలో బిజెపి సంబరాలు
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి ముల్క కొమురయ్య భారీ మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతా తెలియజేస్తూ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు, ఈ సంబరాల కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముల్క కొమురయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ పొంచేట్టి రాకేష్,మండల ప్రధాన కార్యదర్శి గంగరాజు, పత్తిపాక శ్రీనివాస్, కొక్కుల నరేష్, తోట శంకర్,అయోధ్య పర్శరాములు, మట్కామ్ మల్లేశం,లింగాల రాజయ్య, సిరికొండ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.