బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద వీడియో కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ & డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు, వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అన్నారు. నేషనల్ స్కాలర్ షిప్ క్రింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2 వేల రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3 వేల రూపాయలు, డిగ్రీ, పిజి డిప్లమా కోర్సుల చదివే పిల్లలకు 6 వేల రూపాయలు, ఐటిఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8 వేల రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25 వేల రూపాయల ఉపకార వేతనం అందుతుందని అన్నారు.
Collector Sandeep Kumar Jha
1 నుంచి 10వ తరగతీ వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు,ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలందరూ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత గల బీడీ కార్మికుల పిల్లలందరూ scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ కోర్ట్ నందు దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కేంద్ర సంక్షేమ ఆసుపత్రి డా.మహేందేర్, డా.మధుకర్, డా.వెంకటేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ అదనాపు డిఆర్డిఏ శ్రీనివాస్ ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్ అన్నారు.ఈసందర్బంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్నందు కార్మికులతో కలిసి పోస్టర్ లను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆగస్టు 19,21,22న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజుల రామారం మహారాజు గార్డెన్లో ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు.భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆర్భవించి దేశ సంపూర్ణ స్వతంత్ర కోసం తిరుగుబాటు చేసిన మొదటి రాజకీయపార్టీగా చరిత్ర సృష్టించిందన్నారు.మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 1000 మంది ప్రతినిధులు పాల్గొని నాలుగు రోజులు ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటం కార్యక్రమాలను నిర్ణయిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ కార్యవర్గ సభ్యులు జక్కు రాజ్ గౌడ్,నకిరేత ఓదెలు,సిపిఐ మండల కార్యదర్శి ఇల్లందుల రాములు,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్,రైతు నిరంజన్,కుమ్మరి సదనందం తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 8 మంది లబ్ధిదారులకు చెక్కులను గాను ₹2,25,000 విలువ గల చెక్కులను క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అందజేయడం జరిగింది.
లబ్ధిదారుల వివరాలు:-
చిన్న హైదరాబాద్ కి చెందిన శారు బాయి మేఘవత్ ₹.21,000 గడి వీదికి చెందిన రైనగారి రాజ రత్నం ₹.12,000 పాండు రంగా స్ట్రీట్ కి చెందిన అమీనా సుల్తానా ₹.12,000 రంజోల్ కి చెందిన మోషప్ప ₹.60,000 & బ్యాగారి స్వప్న ₹.30,000 రచ్చన్నపేట్ కి చెందిన తర్లపల్లి ధనలక్మి ₹.39,000 & కమలాకర్ ₹.18,000 రాం నగర్ కి చెందిన దశరథ్ ₹.33,000 ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ తంజీమ్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,సత్యం, బరూర్ దత్తాత్రి,గణేష్,చంద్రయ్య ,దీపక్ ,అశోక్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు
మంత్రి శ్రీధర్ బాబు కి అరుదైన గౌరవం దక్కడం సంతోషకరం
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
తెలంగాణ రోడ్ మాడల్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అహర్నిశలు నిద్రాహారాలు మాని రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి ఇండియా 100 మోస్ట్ ఇన్ పూ యూనియల్ పీపుల్ ఏఐ జాబితాలో చోటు చేసుకోవడం సంతోషకరం ఎంతో గర్వకారణం అని ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు మంథని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు కేవలం రెండు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేస్తారని ఆశిస్తూ మా నాయకున్నీ అభివృద్ధి విషయంలో విమర్శిస్తున్న గులాబీ నాయకులకు ఇది ఒక చెంపపెట్టు అని అన్నారు
మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా స్పెషల్ పోక్సో జడ్జి జయంతి విధించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కథనం ప్రకారం సంగారెడి జిల్లా జహీరాబాద్ మండలం మధులై తండాకు చెందిన రాథోడ్ సంజీవ్ అదే తండాకు చేసిన మైనర్ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉండగా బాలికపై కన్నేసిన రాథోడ్ సంజీవ్ 2020 జులై 7 న ఇంట్లోకి తీసుకెళ్ళాడు.అరుస్తే చంపుతా అని బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడగా వెంటనే బాలిక అరుపులకు చుట్టుపక్కల వారు వస్తున్నారని గ్రహించి పారిపోయాడు.తల్లిదండ్రుల ఫిర్యాదుతో నాటి ఎస్సై కె.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
నిందితుని శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.ఎస్ ఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం. నేరం సంఖ్య: 51/2020- సెక్షన్ 354,ఎ 448,506,, ఐ పి సీ సెక్షన్ 7 %తీ/ష% బి ఆఫ్ పోక్సో యాక్ట్ 2012, చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్. వివరాలలోనికి వెళ్లితే: చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో హిర్యాధి కూతురు వయస్సు 14 సంవత్సరాలు తేదీ 07.07.2020 నాడు మద్యాహ్నం సమయంలో తమ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలిక పై, అదే తండ కు చెందినా నిందితుడు రాథోడ్ సంజీవ్ అక్రమంగా బాలిక ఇంటిలోకి పోయి అసభ్యంగా ప్రవర్తించి, ఆమె చేయి పట్టుకుని బలవంతంగా తనతో లైంగిక కోరిక తీర్చమని బలవంత పెట్టగ, మైనర్ బాలిక భయపడి అల్లరి చేయగా నిందితుడు ఆమెను భయపెట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి పారిపొయినాడు, అట్టి వ్యక్తిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేయగా అప్పటి యస్.హెచ్.ఒ కె గణేష్ ఎస్. ఐ కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ అనంతరం న్యాయ స్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు పూర్వపరాలను విన్న స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి జయంతి నిందితుడు రాథోడ్ సంజీవ్ కు 5-సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ: 10000/-జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుని వివరాలు: రాథోడ్ సంజీవ్ తండ్రి భీమ్ సింగ్, వయస్సు: 30 సంవత్సరాలు, వృతి: కూలిపని, కులం: ఎస్టీ (లంబాడ), నివాసం మధులై తండా, మండలం జహీరాబాద్ జిల్లా సంగారెడి. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ అధికారికె గణేష్ ఎస్. ఐ, ప్రస్తుత ఎస్. ఐ. రాజేందర్ రెడ్డి, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ కృష్ణ, కోర్ట్ లైజనింగ్ అధికారి హెడ్. కానిస్టేబుల్ శంకర్, కె. సత్యనారాయణ ఎస్ఐఐ. లను ఎస్పీ అభినందించారు.
`గతంలో నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు కదిలేవారు.
`ఇప్పుడు నాయకులు మాత్రమే కొత్త దారి వెతుక్కుంటున్నారు.
`బీఆర్‌ఎస్ నుంచి నాయకులు కారు దిగుతున్నారు.
`ఇతర పార్టీల నుంచి నాయకులు కారెక్కుతున్నారు.
`కారు దిగుతున్న నాయకులతో మేం రామంటున్నారు.
`అధికారంలో వున్న కాంగ్రెస్ వైపు కార్యకర్తలు ఎందుకు చూడడం లేదు!
`కాంగ్రెస్ లో కొత్త వారిని కలుపుకుపోరన్న భయమా!
`ఇప్పటికే రెండేళ్ళు గడిచింది.. పార్టీ మారితే ఒరిగేముందన్న భావనా?
`బీఆర్‌ఎస్ లో కూడా కార్యకర్తలు అసంతృప్తిగానే వున్నారు.
`అయినా కారు దిగి జారుకోవడానికి సిద్ధంగా లేరు!
`ఇతర కండువాలు కప్పుకోవడానికి సిద్ధంగా లేదు.
`గువ్వల బాలరాజు మీటింగ్ తో కొంత తేట లెల్లమైంది.
`మేం రామని తెగేసి చెప్పినట్లైంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
అటు లీడర్..ఇటు క్యాడర్! తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం. పార్టీలు మారుతున్న నాయకులతో క్యాడర్ రావడం లేదు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్యాడర్ కదలేదు. ఏ ఎమ్మెల్యేతో పట్టు పని పది మంది వెళ్లలేదు. వెళ్లినా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పొసగడం లేదు. తమతో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు వస్తారని, రావాలని కూడా ఎమ్మెల్యేలు అనుకోలేదు. అందుకే కాంగ్రెస్‌లో చేరిన ఏ ఎమ్మెల్యే కూడా దర్జాగా కండువా కప్పుకోలేదు. గతంలో ఈ పరిస్దితి భిన్నంగా వుంది. కాంగ్రెస్ నుంచి గాని, తెలుగుదేశం నుంచి గాని బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరిన క్రమంలో పెద్ద పెద్ద ర్యాలీలు. వందల కార్లు కాన్వాయిలు. గులాబీలు. జెండాలో అబ్బో అదో పెద్ద సెటప్‌తో వెళ్లేవారు. జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులతో చేరి, కండువాలు కప్పుకున్నారు. కండువాలు కప్పే నాయకులు కూడా ఇంకా వున్నారా? అని ఎదురుచూసిన పరిస్దితి కనిపించేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలానే చేరారు. కాని వారి వెంట క్యాడర్ పెద్దగా కదిలినట్లు లేదు. వందల మంది చేత వచ్చి కాంగ్రెస్‌లో కలిసిన నేతలు లేరు. బిఆర్‌ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరి, కండువా కప్పుకొని, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ వెంట కూడా జనం వెళ్లలేదు. క్యాడర్ ఆయనతో కదలేదు. ఆయన అదృష్టం పాత పరిచయాలు ఆయనకు దానంకు పనికి వస్తున్నాయి. వ్యతిరేకతకు తావు లేకుండా చేస్తున్నాయి. కాని మిగతా ఎమ్మెల్యేలందరికి మాత్రం విచిత్రమైన వాతావరణమే వుంది. ఇందులో కడియం శ్రీహరి లాంటి నాయకుడు గతంలో తెలుగుదేశంలో వున్నంత కాలం బలమైన క్యాడర్‌ను మెంటైన్ చేశారు. తర్వాత పదేళ్లకాలం పాటు బిఆర్‌ఎస్‌లో కూడా బాగానే అధికారం చెలాయించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన జిల్లాకు, నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా మిగిలిపోయారు. ఆఖరుకు ఏ పార్టీలో వుండాలో ఆపార్టీలోనే వున్నానంటూ ముక్తాయించాల్సిన పరిస్ధితి తెచ్చుకున్నారు. కాకపోతే తన రాజకీయ చాణక్యంతో, చైతన్యంతో మాత్రం తన కూతురు కావ్యను ఎంపిని చేశారు. ఇది ఎంతైనా గొప్ప విషయం. రాజకీయాల్లో నైతికత అనే పదం ఈరోజుల్లో వాడడమే శుద్ద దండగ. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో వుండి, నైతికత గురించి మాట్లాడడం అంటేనే గొంగడిలో కూర్చొని అన్నం తిన్నట్లే లెక్క. పార్టీలు మారినా, తన రాజకీయ ప్రస్తానాన్ని దిగ్విజయంగా కొనసాగించిన నాయకులలో కడియంశ్రీహరి ఎంతైనా ప్రత్యేకమే. అందుకే ప్రత్యర్ధి రాజకీయాలు చేసినా, ఒకే పార్టీలో కలిసి రాజకీయాలు చేసినా ఆయన స్దానం ఎప్పుడూ నిలబెట్టుకున్నారు. అధికారం చెలాయించారు. ఇతరుల అదృష్టాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి నాయకుడు బహుశా దేశంలో కూడా లేకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు తనకు ఎదురులేకుండాపాలించారు. బిఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్ధి అదృష్టం లాగేసుకున్నారు. 2018 తర్వాత మంత్రి కాకపోయినా, సరే తన పాత్రలోకి ఎవరూ రాకుండానే చూసుకున్నారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో తన దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రాకుండాచూసుకున్నారు. ఇంత పెద్ద నాయకుడైనా సరే ఇప్పుడు క్యాడర్ ను వెతుక్కొవాల్సిన పరిస్ధితి వచ్చింది. రాజకీయాలలో వున్న వారు ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో..వుండాలో అన్న దానిపై ఎవరి స్ధిర నిర్ణయం లేదు. నిలకడ అసలే లేదు. గాలి వాటం రాజకీయాలు. ఎందుకంటే గతంలో తన జీవితమంతా గులాబీతోనే అని అనేక సార్లు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పేవారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా వేరే రక్తం మనలో పారదు అని కూడా చెప్పారు. కాని అధికారం పోయింది. ఆయన ఓడిపోయారు. బిఆర్‌ఎస్‌లో తనను అనుమానంగా చూస్తున్నారు. మరో వైపు లెక్క చేయడం లేదు. మహబూబ్ నగర్ బిఆర్‌ఎస్‌లో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పెత్తనం ఎక్కువైపోయింది. పార్టీ కూడా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. తనను లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాగే వుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా వచ్చే అవకాశం వుంటుందో లేదో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే మహబూబ్ నగర్ రాజకీయాలను ఇప్పుడున్న పరిస్దితుల్లో ఒంటి చేత్తో లాగించుకొస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గం, గువ్వల బాలరాజు సామాజిక వర్గం ఒకటే. అంతే కాకుండా అది రిజర్వుస్ధానం. రాజకీయ సమీకరణాలలో భాగంగా చూసుకున్నా, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ లాంటి వారిని జనరల్ సీట్లో పోటీ చేయించే అవకాశం వుండదు. రిజర్వు స్ధానంలో బలమైన నాయకులను పెట్టిన పార్టీలే గెలుస్తుంటాయి. కడియం రాజకీయం కూడా అలాగే సాగింది. ఆయన స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆది నుంచి అక్కడినుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. గెలుస్తున్నారు. 2014లో పార్లమెంటుకు ఎన్నికైనా సరే వరంగల్ ఎస్సీ రిజర్వుడు నుంచే గెలిచారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన సొంత జిల్లా నుంచే పోటీచేయాలని చూస్తున్నారు. గతంలో ఆయన ఆదిలాబాద్ నుంచి పోటీ చేసి పొరపాటు చేశారు. ఇది పాత రోజులు కాదు. గతంలో నాయకులకు పార్టీలు సీట్లు ఇచ్చినా గెలిచేవారు. అలా చరిత్రలో చాలా మంది వున్నారు. ఇప్పటికీ వున్నారు. మల్లు భట్టి విక్రమార్క అసలు జిల్లా పాలమూరు. కాని ఆయన మధిరను ఎంచుకొని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాని ఇప్పుడు కొత్త నాయకత్వానికి ప్రజలనుంచి ఆ సహకారం అందేలా వుండేలా లేదు. ఉమ్మడి జిల్లా వరకు సరే,గాని జిల్లాలు దాటి వెళ్లి గెలవడం అంటే సాద్యమయ్యే పని కాదు. నాయకులు కొత్త దారితోపాటు సరికొత్త పంధాలో వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా కారు దిగి, కమలం గూటికి చేరిన గువ్వల బాలరాజుతో పెద్దగా నాయకులు వెళ్లలేదు. దాంతో చేరిక సభ కార్యక్రమంలో గువ్వల బాలరాజుతో బిజేపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు వంద మందికూడా రాలేదని సభా సాక్షిగానే నవ్వుతూనే ఎద్దేవా చేశారు. పైగా వంద మంది జాయిన్ అయినప్పుడు అసలైన సభ్యత్వం ఇస్తామనే అర్దం వచ్చేలా చిన్న చెనుకు వదిలారు. కాని అది ఒక నాయకుడికి ఇబ్బందికరమే. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్ నుంచి పెద్ద నాయకులు కారు దిగిపోతున్నారు. అదే సమయంలో జిల్లాలలో నాయకులతో సంబంధం లేకుండా పెద్దఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. అలా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ఇటీవల చాలా మంది చేరారు. సహజంగా ఒక నాయకుడు ఎటు వైపు వెళ్తే క్యాడర్ అటు వైపు వెళ్లడమే చూశాం. కాని కారు దిగుతున్న నేతలతో క్యాడర్ మేం రామని తెగేసి చెబుతున్నారు. మీరు వెళ్తే వెళ్లండి..మమ్మల్ని రమ్మకనండి అని ముఖం మీదే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి కార్యకర్తలు ఒకింత భయపడుతున్నారు. కాంగ్రెస్‌లో కొత్తవారిని కలుపుకుపోయే వాతారణం కనిపించడం లేదు. పార్టీ మారినా పనులు వస్తాయన్న నమ్మకం లేదు. పదవులు వస్తాయన్న ఆలోచన వారిలో అసలే లేదు. ఎందుకంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా వుంటూ, సేవలు చేసిన నాయకులు, కార్యకర్తలను కాదని కొత్త వారికి పెద్ద పీట వస్తుందన్న విశ్వాసం కలగడం లేదు. పైగా చేరిన ఎమ్మెల్యేల పరిస్దితే అలా వుంటే, చేరితే మా పరిస్దితి అంత కన్నా భిన్నంగా వుంటుందా? అన్న ఆలోచనలో బిఆర్‌ఎస్ క్యాడర్ గులాబీ జెండాను వదలడం లేదు. పైగా కాంగ్రెస్, బిజేపిల నుంచి వస్తున్న వారిని వద్దని వారించడం లేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చేరే నాయకులు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడాల్సిందే. కొంత కాలం గడిస్తే అందరూ కలిసిపోతారు. పోటీ పడి పనులు చేస్తారు. పార్టీకి మరింత బలమౌతారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిఆర్‌ఎస్ క్యాడర్ కూడా నిరుత్సాహం, అసంతృప్తిగానే వున్నారు. కాని కారు దిగడానికి, జారుకోవడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్‌లో పొసగలేరు. బిజేపిలో చేరినా గుర్తింపు, ప్రజల్లో ఆదరణ వుంటుందన్న నమ్మకం అసలే లేదు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఒక్క బిఆర్‌ఎస్ క్యాడరే మరో కండువా కప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఇది మాత్రం నిజం.
గణపురం మండలo దేవాదుల ప్రాజెక్ట్ నుండి గోదావరి నీరు రామప్ప చెరువులో చేరడం జరుగుతుంది అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రం చెరువులోకి నీటిని వదిలి దాని ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా ఎమ్మార్వో కి వినతి పత్రం ను మండల అధ్యక్షుడు నవీన్ రావు ఆధ్వర్యం లో ఇవ్వడం జరిగింది ఇందులో సీనియర్ నాయకులు దుగ్గిశెట్టి పున్నం చందర్ ఉపాధ్యక్షులు మాదాసు మొగిలి. బూత్ అధ్యక్షులు కాశెట్టి సాయి కన్వీనర్ .మండల కన్వినర్ మండల రాజు పాల్గొనడం జరిగింది అలాగే రేపు మండల కేంద్రం లో జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో అందరు పెద్ద ఎత్తున పాల్గొని స్వాత్రంత్ర సమర్యోదులను గుర్తు చేస్తూ బావితరాలకు తెలియజేయాలనీ కోరడం జరిగింది
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పిక కిరణ్ ఆధ్వర్యంలో ప్రజాయుద్ధం నౌక గద్దర్ మూడో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్యముఖ్య అతిథి హాజరై ప్రజాయుద్ధనౌక గద్దర్ చిత్రపటానికి పూలదండలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టయ్య మాట్లాడుతూ, కామ్రేడ్ గద్దర్ అన్న తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన ప్రజాసామిక తెలంగాణ ప్రజా స్వామిక తెలంగాణ కోసం ప్రజలు పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని గద్దర్ అన్న విప్లవ సాంస్కృతికోధ్యమ సారధి ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న తన ఆట,పాట మాటతో పాలకవర్గాల దోపిడి దౌర్జన్యాలపై ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజా ఉద్యమాల వైపు నడిపించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది, యువతరాన్ని విప్లవ ఉద్యమం వైపు ఆకర్షించడంలో ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత దోహాధం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి గని కార్మికులను సమీకరించడానికి బాయి నుండి బాయి.కార్యక్రమం తెలంగాణ కొంగు బంగారం సింగరేణిలో ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆయన ఆట పాట మాటను నిర్మూలించడానికి రాజ్యం కాల్చిన తూటాలను సైతం ధిక్కరించి రాజ్య హింసను దోపిడి వ్యవస్థను ఎండ కట్టింది. సాంస్కృకోద్యమానికి ఆయన లోటు ఎనలేనిది, ప్రజా గళాలు, కళాలు కలుషితమవుతున్న నేటి సాంస్కృతిక ఉద్యమ, భావవాదం వైపు కొట్టుకుపోతున్న తరుణంలో ఆయన లోటు తీర్చలేనిది. ఆయన వదిలి వెళ్ళిన విప్లవ సాంస్కృతిక ఉద్యమ బాధ్యతను భుజానికి ఎత్తుకుందాం ఇదే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. అమరుడు గద్దర్ కు సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రజా సంఘాలు నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు. దాసరి జనార్ధన్. దుబాసి పార్వతి. కర్ణాటక సమ్మయ్య. అయితే బాపు. కోడిమేత సరస్వతి.సంజీవ్. వావిలాల లక్ష్మణ్. దేవి సత్యం. రాసమల్ల భద్రయ్య. జైపాల్ సింగ్. అక్కల బాపు. రాజన్న. తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది
కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్
పిసి గోష్ రిపోర్ట్ తప్పులతడక
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ ఫైర్
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నవీన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి,డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని సమాజంలో బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, అది కాళేశ్వరం కమీషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ గా పని చేస్తుందన్నారు, పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగ పనిచేసి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన విషయాలనే రిపోర్టులో పొందు పరిచాడు అన్నారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో కట్టిన తెలంగాణ ప్రజల వరప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, లక్ష ఎకరాలకు తాగు,సాగునీరు ఇచ్చె ప్రాజెక్టు ను ఎండ బెట్టే కుట్రకు తెర లేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్షాలు లేక పంటలు ఎండుతుంటే కనీసం రైతులకు సాగు నీరు ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా రైతులను ఆగం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల గొస తగులుతుందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న దురదృష్టపు పాలన అన్నారు,కేసీఆర్ ను తెలంగాణ సమాజంలో తక్కువ చేయాలని తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను చెరిపేయాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల రైతులు రెండు కార్లు పంటలు పండి రైతులు సంతోషం వ్యక్తం చేసే వారు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని రాకుండా చేసి రైతులను ఆగం చేస్తుందన్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల ను ఎప్పుడు అమలు చేస్తారన్నారు,ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు,రైతులకు 100శాతం ఋణ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేతులెత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలో కి వచ్చి బీసీలను మభ్య పెట్టే విధంగా డిల్లీ లో ధర్నా లు అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు,మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన దిక్కులేదు గాని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వo, వికలాంగులు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వికలాంగులను మోసం చేసింది అన్నారు,బిఆర్ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మూల్యం తప్పదు అన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం వస్తుందని రైతులు,నిరుద్యోగ విద్యార్థులు, మహిళలు అందరు ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా రైతులు ఈ ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,గాదె అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తేజావత్ రవీందర్,కాలు నాయక్,కొమ్ము చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కొమ్ము నరేష్,బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రేఖ వెంకటేశ్వర్లు, వెంకన్న,సీనియర్ నాయకులు బాలాజీ నాయక్,గండి మహేష్ గౌడ్,గంధసిరి కృష్ణ,దుస్స నరసయ్య, అజ్మీర రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడి టీచర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ ఈనెల ఫస్ట్ తారీకు నుండి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి కేవలం ఆరు నెలల వరకే తల్లిపాలు ఇవ్వాలని బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని పోషక ఆహారం తీసుకున్నట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు కమల పిల్లలకు కూడా సమానంగా తల్లి పాలు ఇవ్వవచ్చని ఆరు నెలల వరకు కూడా తల్లికి పాలు సరిపోను ఉంటాయని అన్నారు కార్యక్రమంలో ఏఎన్ఎం సాయి సుధా గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు
ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి.
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
భూపాలపల్లి నేటిధాత్రి
2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవం వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజున మహా ముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన శైలి ఇతర సమాజాలకు భిన్నంగా ఉంటుందనీ, ఆదివాసులు విగ్రహ ఆరాధకులు కాదని, పకృతి ఆరాధకులని వీరి పూజా వ్యవహారాలు వేరుగా ఉంటాయని అన్నారు, వీరిని జనగణలలో ఏదో ఒక మతం కింద నమోదు చేయడం వలన వీరి అభివృద్ధి కి అస్తిత్వానికి ముప్పు
వాటిల్లుతుందని అందుకే 2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని అదేవిధంగా ఆదివాసి దినోత్సవం ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినప్పుడే ఆదివాసులలోని ఉద్యోగులు మేధావులు సంస్కృతి మీద సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొనడం వలన ఆదివాసులకు ఉపయోగం జరుగుతుందని కావున అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 ని ప్రభుత్వ సెల్లు దినంగా కేటాయించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించి ఆదివాసి గ్రామాలలో సమస్యలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ,అదేవిధంగా ఆదివాసి జెండా పండుగలు వారోత్సవాలలో భాగంగా ప్రతి గ్రామంలో జెండా పండుగలు చేసుకుంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలు కలలు పునర్జీవింప పడేవిధంగా ఆదివాసి సమాజం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు ఆదివాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పోలం సతీష్ బదిరాజయ్య రామినేని రాజు నాగరాజు తోట లక్ష్మయ్య గుంటి అంజలి తోట శ్రీ చందన గుండప్పు తేజస్విని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఐ ఎన్ టియుసి సంఘం
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ గత కార్మిక సంఘం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని భూపాలపల్లి ఏరియాలో సింగరేణి గుర్తింపు సంఘంగా ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాన్ని కార్మికులు ఎంతో ఆశతో గెలిపిస్తే ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘం నాయకులు కింది స్థాయి అధికారులను కార్మికులను కొంతమంది నాయకులు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉచిత మాస్టర్ల కు అలవాటు పడి కార్మికుల ఫోటోలు తీసి కార్మికులను బ్లాక్మెయిల్ చేస్తూ యాజమాన్యానికి పంపిస్తూ అదే విధంగా కంపెనీకి అధికారులకు ఇన్ ఫార్మర్లు గా వ్యవహరిస్తూ కార్మికులకు సస్మేట్లు షరీసిలు ఇప్పిస్తూన్నరు కార్మికులు గనులలో ఎదుర్కొంటున్న సమస్యలు గాలి లేక త్రాగునీరు లేక సరి అయిన పనిముట్లు లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గెలిచిన సంఘం నాయకులకు సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యల యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించకపోగా కార్మికుల పైన తిరగబడుతూ గుండాల్లాగా బెదిరింపుల పాల్పడుతున్నారు మాకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయంటూ విరవీగుతున్నారు ఇలాంటి కొంతమంది స్వార్థపరుల మూలంగా ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీకి ఐ ఎన్ టియు సి కార్మిక సంఘం కార్మిక వర్గంలో ఉనికి కోల్పోతున్నదని ఇప్పటికైనా ఎమ్మెల్యే అదే విధంగా ఐఎన్టియుసి యూనియన్ పై నాయకత్వం కార్మిక వ్యతిరేక నాయకుల పైన తగు చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తున్న కార్మికులకు యాజమాన్యంతో కుమ్మక్కై షరిసిట్లు సస్పెండ్ లేటర్ లు ఇపిస్తున్నారు ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే వీరికి రాబోయే రోజులలో కార్మిక వర్గం తగు గుణపాఠం చెప్తుంది వారు అన్నారు ఈ కార్యక్రమంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం నాయకులు దాసరి జనార్ధన్ నామల శ్రీనివాస్ రాళ్ల బండి బాబు జయశంకర్ కే నరసింహారెడ్డి ఎస్ కే సాజిద్ ఎండి సలీం సిహెచ్ లక్ష్మీనారాయణ కే మధుకర్ తదితరులు పాల్గొన్నారు
రాను రాను రాజకీయాలు ఎటు పోతున్నాయి. రాజకీయాలలోకి ఎటు వంటి నాయకులు చేరుతున్నారు. రాజకీయాలను ఎటు వైపు తీసుకెళ్తున్నారు. పార్టీలు ఏవైనా సరే గొర్రెల మందలా, ఒక దానికి వెనుక మరొకటి వెళ్తోంది. ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాజకీయాలు అందరూ చేస్తామంటున్నారు. రాజకీయాలంటే అంత అలుసైపోయిందా? రాజకీయమంటే వ్యాపారమనుకంటున్నారా? ప్రజా ప్రతినిది అంటే పెత్తనం చేయడం అనుకుంటున్నారా? అసలు ఈ తరం నాయకులు ఏమనుకుంటున్నారు? పార్టీలు రాజకీయాలను ఎలా వాడుకుంటున్నాయి? అధికారంలోకి వస్తే చాలనుకుంటున్నాయి. అడ్డమైన మాటలు చెబుతున్నాయి. అదికారంలో వున్న వాళ్లు ప్రతిపక్షాలను, ప్రతిపక్షాలు పాలక పక్షాలను నిత్యం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ముసుగేసుకొని వస్తున్నాయి. పధకాలంటారు? సంక్షేమం అంటారు. ఎన్నికల ముందు హమీలు గుప్పిస్తుంటారు. అయినవి, కానివి అన్నీ చెబుతుంటారు. నోటికి ఏది వస్తే అది చెబుతుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు దేవుళ్లుగా కనిపిస్తారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హమీల గురించి అడిగితే దెయ్యాలుగా కనిపిస్తారు? శత్రువులుగా కనిపిస్తారు? ఓట్లు అడిగినప్పుడు మాత్రం ప్రజలు ఎంతో గొప్ప వాళ్లు. విజ్ఞులు. వివేకవంతులు. అసలు రాజకీయం అనే పదానికి చరిత్రలో ఎంతటి స్ధానం వుందో తెలియదు. కాని రాజకీయాలు చేయానుకుంటారు. నాయకులు కావాలనుకుంటారు? అసెంబ్లీలో కూర్చొని అద్యక్షా! అనాలనుకుంటారు. కుదిరితే కాలం కలిసొస్తే మంత్రి కావాలనుకుంటారు. బుగ్గ కారులో తిరగాలనుకుంటారు. జిల్లాలో చక్రం తిప్పాలనుకుంటారు. రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటారు. ఈ ఐదేళ్లలోనే సిఎం. కూడా అయిపోతే బాగుండనుకుంటారు. తాను బతికున్నంత కాలం పదవిలో వుండాలనుకుంటారు. ఇదీ నేటి తరం రాజకీయనాయకుల ఆలోచనలు. కాని అసలు రాజకీయాలను అర్ధం చేసుకున్నామా? రాజకీయాలకు అసలైన మూల సూత్రమేమిటి? ఒక నాయకుడికి వుండాల్సిన లక్షణం ఏమిటి? అనేది ఏ నాయకుడు ఆలోచించుకోవడం లేదు. కనీసం తెలుసుకోవాలనుకోవడం లేదు. దేశ చరిత్ర తెలియదు. దేశ రాజకీయ ముఖ చిత్రం తెలియదు. చారిత్రక విశేషాలు తెలియదు. చారిత్రాత్మక అంశాలు తెలియవు. దేశ చరిత్రకున్న మూలాలు తెలియవు. ఒక నాయకుడికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం వుందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కావొచ్చు. కాని ఈ తరం నాయకులు అవసరం. ఎందుకంటే మన దేశ విస్తీర్ణం, బౌగోళిక అంశాలపై నాయకులకు ఖచ్చితమైన అవగాహన వుండాలి. అప్పుడే దేశ రాజకీయాలలో సంపూర్ణమైన మార్పులు వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన నాయకులే ఎక్కువగా వుండేవారు. వారిలో ఉన్నత విద్యావంతులు, దేశ రాజకీయాలపై అవగాహన వున్న వాళ్లు మాత్రమే ఎన్నికౌతూ వచ్చేవారు. కాని ఇప్పుడు పార్టీల బలం, బలగం, అర్ధబలం, అంగబలం వుంటే చాలు నాయకులౌతున్నారు. గతంలో ఎలాంటి నాయకుడైనా సమాజం గురించి ఆలోచించేవారు. తన నియోజకవర్గం అభివృద్ది గురించి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడున్న నాయకులు ప్రజా సేవకన్నా, వ్యాపారాలపై దృష్టిపెడుతున్నారు. ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సంపాదించుకోవద్దా? అని నేరుగానే సమాధానం చెబుతున్నారు. రాజకీయాలు చేయాలనుకునేవారికి మన దేశమమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా తెలియాలి. తెలుసుకోవాలి. ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోంది. మనం ఎక్కడ వెనుకబడి వున్నామన్నది కూడా అధ్యయనం చేయాలి. దేశ విదేశాలలో జరుగుతున్న అభివృద్ది మీద అవగాహన పెంచుకోవాలి. పారిశ్రామిక ప్రగతిని అంచనా వేయాలి. మన దేశ ఆర్ధిక పురోగతి కోసం ఎలా ముందుకు వెళ్లాలి. అనే అంశాలపై సంపూర్ణమైన జ్ఞానం నాయకులకు కావాలి. ప్రపంచం కుగ్రామమైపోయింది. ఇంటర్ నెట్ చేతిలో వుంది. ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. నాయకులకు సమాజం మీద పూర్తి అవగాహన కావాలి. సామాజిక శాస్త్రం చదివి వుండాలి. ఒకప్పుడు టెక్నికల్ విద్య అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా వుండేది. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ తెలియకపోవడంతో తీరని నష్టం జరుగుతోంది. గతంలో ప్రతి యూనివర్సిటీలోనూ చరిత్ర, సోషియాలజీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్ధులు ఎక్కువగా చదువుకునేవారు. అందుకే ఆ రోజుల్లో ప్రజా ఉద్యమాలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు పదో తరగతి వరకు కూడా భూగోళం, చరిత్ర, అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం వుంటున్నాయి. కాని అవి మార్కుల కోసం మాత్రమే చదువుతున్నారు. ఎక్కువగా లెక్కలు, సైన్స్ మాత్రమే అభ్యసిస్తున్నారు. మిగతా సబ్జెక్టులను వదిలేస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ విద్య వ్యాపారమైపోవడంతో, ఈ సబ్జెక్టులు విద్యార్ధులకు దూరమౌతున్నాయి. ఇప్పటి విద్యార్ధులకు రాజకీయాలు అంటే నాయకులు, పాలకులు, ప్రతిపక్షాలు అనే మాట తప్ప మరొకటి తెలియదు. మన ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారన్న ఆలోచన కూడా ఈ తరానికి అవసరం లేకుండాపోతోంది. అదేదో సినిమాలో చెప్పినట్లు తిన్నామ, పడుకున్నామా, తెల్లారిందా? అన్నట్లు లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్నామా? ఉద్యోగం వచ్చిందా? జీవితంలో స్ధిరపడిపోయామా? అన్నదే ఆలోచిస్తున్నారు. స్కిల్ అనే పదం రాజ్యమేలుతోంది. నైతికత అనేది దూరమైపోయింది. దాంతో దేశంలోనే కాదు, విదేశాలలో చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. దేశాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులనే కాదనుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా నాయకులకు సమాజ శాస్త్రం తెలియాలి. కుటుంబ వ్యవస్ధలు నిర్వీర్యం కాకుండా చూడాలి. ఉన్నత లక్ష్యాలున్న సమజాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాయకులే తీసుకోవాలి. సమాజ శాస్త్రం గురించి తెలియని నాయకులకు ప్రజా సమస్యలు కూడా తెలియవు. పట్టవు. ఇవన్నీ తెలియాలంటే అసలైన రాజకీయ మూల సిద్దాంతాలను తెలియజేసే పొలిటికల్ సైన్స్ అనే పదమే చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు. పొలిటికల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సోషియో ఎకనామిక్స్ అంటే ఏమిటో అవగాహన లేదు. పాలిటీ అంటే అర్ధంకూడా ఎవరికీ తెలియకుండాపోతోంది. రాజకీయం కూడా ఒక శాస్త్రమన్నది తెలియని నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను పాలిస్తున్నారు. చిరిత్రలో సోక్రటిస్ దగ్గర నుంచి ఎంత మంది రాజకీయ విజ్ఞానవంతులున్నారో తెలియదు. రూసో అనే రాజనీతిజ్ఞుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనిషి బానిస సంకెళ్లలలో వున్నాడని ఎందుకన్నాడు? అనేది తెలియదు. మాకియా వెళ్లి లాంటి రాజనీతిజ్ఞుడు రాజకీయాలు, నాయకులకు గురించి ఏం చెప్పారన్నది ప్రతి నాయకుడు తెలుసుకోవాలి. అరిస్టాటిల్ ఏమని చెప్పాడు. ఆడమ్ స్మిత్ ఏమని చెప్పారు తెలుసుకోవాలి. ఆఖరుకు మన ఆమర్త సేన్ మన దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఏం చెప్పారన్నది ఎంత మందికి తెలుసు. మన దేశ మొదటి ఆర్ధిక శాఖ మంత్రి ఎవరికి తెలుసు. పంచ వర్ష ప్రణాళికల రూపకర్త మహలోనుబిస్ గురించి ఎంత మంది నాయకులు తెలుసుకున్నారు. ఇవేవీ తెలియదు. కాని నాయకులమౌతాం. గెలుస్తాం. పాలిస్తాం..ఇదేనా రాజకీయం అంటే ఇదేనా? రాజకీయాలంటే చెప్పడానికి పురాణాలు కాదు. రాజకీయమంటే వర్తమానం. ప్రజల సమస్యలు తెలుసుకోవడం మర్చిపోతున్నారు. కులం, మతం అంటున్నారు. మెజార్టీ ఓట్ల గురించి లెక్కలేసుకుంటారు. మైనార్టీ ఓట్లు ఎటు వైపు అని మాట్లాడుకుంటారు. అంతే తప్ప వారి అభ్యున్నతి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు మారడం లేదని ఆలోచించరు. ఇంత పెద్ద మన ప్రజాస్వామ్య వ్యవస్ధలో, ప్రపంచానికే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంలో మన జాతీయ గీతం కంఠస్తంగా వచ్చే నాయకులు ఎంత మంది? వారికి ఆ గీతంలో వున్న అర్దం, పరమార్ధం ఎంత మంది నాయకులకు తెలుసు. మన జాతీయ గేయం వందేమాతరం చూడకుండా చదవగలిగే వాళ్లు ఎంత మంది? అసలు వీటిలో జాతీయ గీతం, జాతీయ గేయం ఏదో చెప్పలేరు. మన జాతీయ జెండా ఎంత పొడవు విస్తీర్ణంలో వుండాలో తెలియదు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఏదీ తెలియడం లేదు. కాని నాయకులౌతున్నారు. మనల్ని పాలిస్తున్నారు. ఇదీ మన దౌర్భాగ్యం. అంతే…!
ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి..
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్ )
భూపాలపల్లి నేటిధాత్రి
గ్రామ గ్రామాన జెండా పండుగలు నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆదివాసి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. శుక్రవారం మహా ముత్తారం మండల పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగలు గ్రామ గ్రామాన నిర్వహిస్తూ ఆదివాసుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు కలలు పరిరక్షించుకునే విధంగా ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు మేధావులు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు కళాకారులు మేధావులు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆదివాసి ప్రాంతాల మీద దశాబ్ద కాలం పాటు అధ్యయనం చేసి ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ఇతర సమాజాలకు భిన్నంగా ఉందని ఏ దేశంలో నైనా పరిపాలకుల విధానాల వల్ల ఆదివాసి మనగడకే ప్రశ్నార్థకం అవుతుందని ఏ దేశంలో నైనా పాలకులు ఆదివాసి అభివృద్ధి పట్ల ఆదివాసి మనుగడను ప్రశ్నార్థకం చేసే విధానాలను అనుసరించవద్దని వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించినప్పటికీ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నిరంతరం ఆదివాసి హక్కుల మీద ఆదివాసి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు కావున ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వాల యొక్క ఆదివాసి వ్యతిరేక విధానాలను ప్రతి ఆదివాసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించినప్పుడే ఆదివాసి సమాజంలో ఉన్న మేధావులుగా ప్రజలందరినీ చైతన్యం చేసి వారు స్వేచ్ఛగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అలాంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించాలని లేనిపక్షంలో ఆదివాసి వ్యతిరేక ప్రభుత్వాలుగా మిగులుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు కాపుల విజయ్ మడకం నిర్మ ,గుంటి అంజలి ,తోట చందన ,గుండాపూ తేజ అశ్విని గుండం రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
నివాళులు అర్పించినతెలంగాణ తొలి శాసనసభాపతి- శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనా చారి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అకినపల్లి గ్రామ వాస్తవ్యుడు టేకుమట్ల మండల మరియు మొగుళ్ళపల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బండి సుదర్శన్ గారి ప్రథమ పుత్రుడు బండి కిరణ్ గారి సంస్మరణ సభకు విచ్చేసి నివాళులు అర్పించిన తొలి శాసనసభాపతి, శాసనమండలి ప్రతి పక్ష నాయకుడు గౌరవ శ్రీ” సిరికొండ మధుసూదనా చారి .
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం భూపాలపల్లి జిల్లా లోని, మొగుళ్లపల్లి మండలం, రంగాపురం గ్రామంలో వివిధ పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. యు నాగభూషణం మాట్లాడుతూ రైతులు కలుపు యాజమాన్యం పై రైతు జాగ్రత్త వహించాలని.. గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ (రైస్ స్టార్) అనే మందును ఎకరాకి 350 మిల్లీమీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే వెడల్పాటి ఆకు కలుపు మరియు తుంగ నిర్మూలనకై ట్రై ఫోమో + ఈత్ ఆక్సీ సల్ఫురాన్ ( కౌన్సిల్ ఆక్టివ్) మందును ఎకరానికి 90 గ్రాములు చొప్పునరో డువందలులీటర్ల నీటిలో పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.. అలాగే పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చేచే పురుగుల నివారణకై వేప నూనె (1500 పి పి ఎం) ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా అసిఫేట్ ఎకరాక మూడు వందల గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని. అంతేకాకుండా 1:4 నిష్పత్తిలో మోనోక్రోటఫాస్ లేదా 1:20 నిష్పత్తిలో ఇమిడా క్లోరోప్రీడ్ లేదా ఫ్లునికామైడ్ మందును నీటిలో కలుపుకొని బొట్టు పెట్టే పద్ధతి ద్వారా లేత కారణానికి అంటే విధంగా మొక్కలకు పూసుకోవాలి అని సూచించారు. ఈ బృందం సభ్యులు శాస్త్రవేత్త డా// ఆర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, తో పాటు ఏ ఈ ఓలు, అభ్యుదయ రైతులు పోలినేని రాజేశ్వర్ రావు,ఎర్రబెల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు.
నెట్ బాల్ క్రీడలో అత్యున్నతమైన క్రీడను ప్రదర్శించిన సెయింట్ జోన్స్ హై స్కూల్ విద్యార్థి
కంకాల దిలీప్ ను అభినందించిన కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ రెడ్డి
కేసముద్రం/ నేటి ధాత్రి
ఈనెల 13వ తారీకు రోజున మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ ఎంపిక క్రీడలలో పాల్గొని తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడాలలో పాల్గొనడం జరిగింది దిలీప్ తన అత్యున్నతమైన క్రీడాను ప్రదర్శించి తెలంగాణ జట్టు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది,దిలీప్ యొక్క విజయాన్ని సెయింట్ జాన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ ఫాదర్ అల్లం శ్రావణ్ కుమార్ రెడ్డి, దిలీపును సన్మానించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఏం వెంకటేశ్వర్లు ఎన్ మహేష్ లు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
కోటపల్లి,నీల్వాయి సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న విస్తృత వాహన తనిఖీలు
జైపూర్,నేటి ధాత్రి:
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ చేసి విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్న చెన్నూర్ పోలీసులు.మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో రామగుండం కమిషనర్,మంచిర్యాల డీసీపీ,జైపూర్ ఏసీపీ ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ కోటపల్లి,నీల్వాయి పోలీసులు చెన్నూర్ రూరల్ సీఐ,కోటపల్లి ఎస్సై లు విస్తృతంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానితుల వివరాలను సేకరిస్తున్నమన్నారు. మావోయిస్టులు అడవులలో ఉండి హింసాత్మాక ఘటనలకు పాల్పడుతూ సాధించేదేమి లేదు జనజీవన స్రవంతిలో కలసి తమ కుటుంబ సభ్యులతో కలసి ఆనందమైన జీవితం గడపాలని,లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను పొందాలని చెన్నూర్ రూరల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
`ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.
`అయితే అవినీతి ఆరోపణలు!
`లేకుంటే నీతి మాలిన ఆరోపణలు!
`నిత్యం అవే ఆరోపణలా!?
`నాయకులు రాసలీల బాగోతాలా!
`చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడడం లేదు!
`విమర్శలు చేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాజకీయాలలో నాయకుల మాటలకు హద్దూ బద్దూ లేకుండాపోతోంది. గతంలో ప్రతిదానిని రాజకీయం చేయడం అలవాటైందని పార్టీలు అంటుండేవి. ఇప్పుడు రాజకీయాలు మానేసి, అశ్లీలాలు మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడు వ్యవహరం ఇలా, ఈ నాయకుడి చీకటి బాగోతం ఇలా అనే మాటలు తప్ప మరేం వినిపించడం లేదు. అసలు సమాజం ఏమనుకుంటోంది? అన్న ఆలోచన కూడా లేకుండాపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత రాజకీయాలలో కూడా విపరీత ధోరణలు పెరిగిపోతున్నాయి. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అసలు నాయకుల వ్యక్తిగత జీవితాలలోకి ఎందుకు తొంగి చూస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. నిజంగానే నాయకులు ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తే సమాజమే ఊపేక్షించదు. కాని లేని పోని బురదను జల్లుతూ, పేరున్న మహిళలను జీవితాలను ఎందుకు రోడ్లమీదకు తెస్తున్నారో అర్దం కావడంలేదు. ఇలాంటి విషయాలు ప్రజలు కోరుకుంటున్నారనుకోవడం రాజకీయ పార్టీల అవివేకానికి పరాకాష్ట. ఓ పక్క ప్రజా సమస్యలు నలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎంత సేపు ఆధిప్యత రాజకీయాలు..కక్షపూరిత రాజకీయాలకు దారులు వేస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు ఒక రోజు నిందించుకున్నారంటే వేరు. నిత్యం నిందలేనా? రాసలీలల కధనలేనా? మొన్నటి దాకా కేటిఆర్ గురించి చెప్పిందే చెప్పి, రాసిందే రాసి అటు నాయకులు, మీడియా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విషయాలపై మాట్లాడడడం సరైంది కాదు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ లో కేటిఆర్ దోషిగా తేలితే శిక్ష పడుతుంది. కాని అది నిజమే కాదో తెలుసుకోకుండానే రకరాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి మేమేం తక్కువ తిన్నామా? అన్నట్లు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలుగుప్పించారు. నిజానికి ముఖ్యమంత్రి పదవిలో వున్న నాయకుడు అర్దరాత్రులు ఒంటరి ప్రయాణం చేసే అవకాశం వుంటుందా? రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా కౌషిక్ రెడ్డికి తెలియదా? గతంలో మేం బురద జల్లుతాం తుడుచుకోండి? అనే రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు మేం బురదే జల్లుతాం..మీరు బురదే చల్లండి.. చూసుకుందాం? అన్నట్లు వుంది. ఇవేనా ప్రజా సమస్యలు లేవా? అవి పాలక , ప్రతిపక్షాలకు పట్టవా? ప్రజలు ఎనుకున్న ప్రభుత్వాలు ఏంచేయాలి? ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు ఏం చేయాలన్నదానిపై స్పష్టత వుంది. కాని తెలంగాణలో ఏం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ 18నెలలు గడుస్తోంది. అనేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతున్నాయి. కాని అవి ప్రజల్లోకి చేరడంలేదు. కాని నిత్యం అదికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న వివాదాలు మాత్రం మీడియాలో వార్తలౌతున్నాయి. పెద్ద పెద్ద హెడ్డింగులౌతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. ప్రతిపక్షాలను పాలక పక్షాలు నిందించడం వేరు. వేదించడం వేరు. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రజా సమస్యలు గాలికి వెళ్తున్నాయి. నిజంగా ప్రజల కోసం ఆలోచించే పార్టీలు ఏవైనా వున్నాయా? ఎన్నికల ముందు ఓడిపోయిన బిఆర్‌ఎస్ ఇచ్చిన హమీలు, గెలిచిన పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన హమీల ఎక్కడైనా చర్చ జరుగుతోందా? లేదు. కేవలం నిందలు, ఆరోపణలు తప్ప నిజాయితీ మాటలు ఎక్కడా లేవు. ఎంత సేపు రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ దోచుకున్నది అంటూ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదికారంలోకి వచ్చిన ఈ పద్దెనమి నెలల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతోందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మధ్యలో బిజేపి చోద్యం చూస్తోంది. ప్రతిపక్షంగా వున్న బిజేపి కూడా ఏ ప్రజా సమస్య మీద స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఏ క్షణాన ఏ పార్టీ ఎటువైపు మాట్లాడుతుందో అర్దం కావడంలేదు. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే బిజేపి పాలక పక్షం మీదకన్నా, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ మీదనే యుద్దం చేస్తోంది.. బిఆర్‌ఎస్‌గతంలోనే చేసిన తప్పులనే తవ్వితీస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మీద ఇప్పటి వరకు బిజేపి ప్రస్తావించపోవడం గమనార్హం. బిఆర్‌ఎస్ పార్టీకి ప్రశ్నించే నైతికలేదనే అనుకుందాం? కాని బిజేపి ఏం చేస్తోంది. ఎందుకు మౌనంగా వుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేవడం లేదు. పైగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ను ఎంత కార్నర్ చేస్తున్నారో అంతే విధంగా బిజేపిని కూడా కార్నర్ చేస్తున్నారు. అయినా బిజేపిలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. వాటితోపాటు మరో 420 హామీలు కూడా ఇచ్చింది. వాటిపై ఏ ఒక్క బిజేపి నాయకుడికైనా అవగాహన వుందా? ఎప్పుడైనా కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివారా? అందులోని అంశాలపై చర్చించారా? కార్యచరణ ప్రకటించారా? లేదు. కనీసం ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలౌతున్నాయి. ఎన్ని అమలు కావడం లేదన్న వాటిపైనైనా బిజేపికి అవగాహన వుందా? సహజంగా ప్రబుత్వం మీద యుద్దంచేసేప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాకపోయినా సరే, ఒకే ఎజెండాతో ఉద్యమాలు సాగిస్తాయి. కాని ఇప్పుడు పరిస్దితి భిన్నంగా వుంది. బిఆర్‌ఎస్ అధికారంలో వున్నప్పుడు ఆపార్టీని దింపడానికి, కేసిఆర్‌ను గద్దెదించడానికి ఏక కాలంలో రెండు పార్టీలు చేయాల్సినంత పోరాటం చేశాయి. అన్ని విషయాల మీద పోరాటంలో ఎవరి పై చేయి అన్నట్లుగా సాగాయి. కాని ఇప్పుడు ఆ బిజేపిలో ఆ దూకుడు లేదు. అసలు ప్రజా సమస్యల మీద స్పందనే లేదు. ముఖ్యంగా రైతుల సమస్యల మీద కూడా బిజేపి మాట్లాడలేకపోతోంది. రైతులకు రైతు భరోసాపై బిజేపి స్పందనలేదు. వృద్దాప్య పించన్లు ఎప్పుడు పెంచుతారని అడిగింది లేదు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. అది ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించిన బిజేపి నాయకుడు లేడు. విద్యార్ధినులకు లాప్ టాప్‌లు ఇస్తామన్నారు. విద్యార్దులందరికీ విద్యా భరోసా కార్డులిస్తామన్నారు. వీటి మీద బిజేపి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు మౌనంగా వుంటున్నారు. నిజంగా బిఆర్‌ఎస్ పార్టీ పదేళ్లకాలంలో తప్పులు చేస్తే శిక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. నిజంగా కేసిఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లైతే ఎందుకు ఉపేక్షిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ప్రజలు కేసిఆర్ పాలన వద్దనుకున్నారు. కేసిఆర్ నాయకత్వం అవసరమే లేదనుకున్నారు. ఫామ్ హజ్ పాలన వద్దని నిర్ణయంతీసుకున్నారు. ప్రజలను కలవని కేసిఆర్ వద్దనే ఓడిరచారు. ఇంకెందుకు కేసిఆర్ ప్రస్తావన. ఓ వైపు కేసిఆర్ సిఎం. రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు. అయినా కేసిఆర్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి ఏం పని. ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని మర్చిపోయారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. కేసిఆర్ వద్దనుకున్నారు. ఇంట్లో రెస్టు తీసుకునేలా చేశారు. ఓడిస్తే ఇంట్లో కూర్చుంటానని కేసిఆర్ చెప్పారు. అదే చేస్తున్నారు. వదిలేయండి? అధికారంలోవున్నప్పుడు గెలిపించిన ప్రజలే కేసిఆర్ బైటకు రావాలని ఉద్యమాలు చేశారు. ప్రగతి భవన్ దాటి రావాలని డిమాండ్ చేశారు. ఆయన రాకపోతే ప్రజలే ప్రజాస్వామ్య పద్దతిలో ఓడిరచి, ప్రగతి భవన్ నుంచి గెంటేశారు. ఇంకా ఎందుకు కేసిఆర్ పేరును కాంగ్రెస్ కలవరిస్తోంది. పలవరిస్తోంది. కేసిఆర్ ముచ్చట చెప్పకుండా వుండలేరా? కేసిఆర్ ప్రస్తావన లేకుండా ప్రభుత్వం నడపలేరా? కేసిఆర్ పేరెత్తకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కేసిఆర్ పేరును గుర్తు చేస్తుంటే ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ నాయకులు కూడా కేసిఆర్ గురించి మనకెందుకు అంటున్నారు. ప్రజలు మర్చిపోదామనుకున్నా, కేసిఆర్‌ను కాంగ్రెస్ నాయకులే మర్చిపోకుండాచేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తు చేసి జపం చేస్తున్నారు. అలాంటప్పుడు కేసిఆర్‌పై కేసులు పెట్టినా జనం పట్టించుకోరు. పైగా కేసిఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతాలు వెళ్లే అవకాశం వుంటుంది. కేసిఆర్ ఆనవాలు చెరిపేస్తామంటూనే నిత్యం బిఆర్‌ఎస్ నాయకులకన్నా, కాంగ్రెస్ నాయకులే కేసిఆర్ జపం చేస్తున్నారు. పొద్దుకు పదుల సార్లు గుర్తు చేస్తున్నారు. కేసిఆర్ తప్పులు నిత్యం ఎత్తి చూపుతూ పోతుంటే లాభం లేదు. కేసిఆర్ కన్నా మంచి పాలన అందించే ప్రయత్నం చేయండి. కేసిఆర్ చేయని సంక్షేమాన్ని అందించండి. అంతే కాని పూట పూటకు, కేసిఆర్ ప్రస్తావన ఎందుకు? అంతే కాదు కాంగ్రెస్ నాయకులకన్నా సిఎంతోపాటు, ఇతర నాయకులంతా బిఆర్‌ఎస్ నాయకులు కేటిఆర్, హరీష్‌రావు, కవితల పేర్తు ప్రస్తావిస్తూ జనం వారి పేర్లను మదిలో నింపుకునేలా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్ నాయకుల పేర్తు తప్ప, కాంగ్రెస్ నాయకుల పేర్లు మర్చిపోయేలా పాలకులే చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ రైతు సభలో వేదిక మీద వున్న పెద్దలెవరో తెలియదని ఓ రైతు అన్నాడంటే అర్దం ఏమిటి? రెండేళ్లు దగ్గరకు వస్తున్నా, మంత్రుల పేర్లు కూడా జనం నాలుకల మీద ఆడడంలేదు. కాంగ్రెస్ పార్టీ వల్ల బిఆర్‌ఎస్ నాయకులను ప్రజలు మర్చిపోవడం లేదు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ను గుర్తు చేసుకోవడం కాంగ్రెస్‌పెద్దలు మర్చిపోండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రచారం చేసుకోంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.