గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..!

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..! ఫస్ట్ లుక్ అదుర్స్

 

తెలుగు సినిమా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన వారికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మక తెలుగు కవి గద్దర్ గౌరవార్థం ఆయన పేరు మీద ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (GTFA) ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు తాజాగా అవార్డు నమూనాకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటోలో అడుగు భాగంలో గద్దె ఆపైన చేతిలో ఓ మూవీ రీల్ బాక్స్ ఉండటం మనం గమనించవచ్చు.

కాగా, మే 29న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (Gaddar Telangana Film Award)లను ఇవాళ జ్యూరీ చైర్పర్సన్ జయసుధ (Jayasudha)తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ను వరించింది .

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (చిన్న కథ కాదు.. 35), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ (పుష్ప-2), ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామి) స్పెషల్ జ్యూరీ అవార్డులను దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్టూరి (లక్కి భాస్కర్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ (రజాకార్), ఉత్తమ హస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ స్టోరీ రైటర్గా శివ పాలడుగు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నారు. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రంగా 35.. ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’, ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) అవార్డులను కైవసం చేసుకున్నాయి.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

గద్దర్ సినిమా అవార్డులను వెంటనే రద్దు చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున కవి రచయిత మ్యాదరి సునీల్ మాట్లాడుతూ గద్దర్ అవార్డులలో తెలంగాణ సినిమాకు ఆన్యాయం జరిగిందని పులి అమృత్ నిర్మించిన సలాం హైదరాబాద్ సినిమాకు ఆన్యాయం జరిగిందని తెలంగాణ సినిమా రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రొడ్యూసర్, దర్శకులు రచయిత పులి అమృత్ సలాం హైదరాబాద్ సినిమా పాటల రచయిత మ్యాదరి సునీల్ ఆవేదన వ్యక్తం చేసారు, సలాం హైదరాబాద్ సినిమా పై వరకు వెళ్లి పైనల్ గా ఈ సినిమాను పక్కన పెట్టి ఆంధ్ర సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది గద్దర్ భావజాలానికి విరుద్ధమని అమృత్ మాట్లాడుతూ ఈ సలాం హైదరాబాద్ సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటిస్తే ఈ సినిమాలో ఒక మంచి పాట రాసిన కవి రచయిత మ్యాదరి సునీల్ కి గద్దర్ అవార్డు వచ్చే అవకాశం ఉండని ఇందులో నటి నటులకు కూడా అవకాశం ఉండని పులి అమృత్ అన్నారనితెలంగాణ చరిత్ర తెలువని వారికి జ్యూరీ చైర్మన్ల అని వెంటనే తెలంగాణ చరిత్ర తెలిసిన అటువంటి మేధావులను జ్యూరి మెంబర్ గా ఏర్పాటు చేసి తెలంగాణ సినిమాలను బ్రతకనివ్వండి అని సునీల్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version