నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం…

నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం

నెట్ బాల్ క్రీడలో అత్యున్నతమైన క్రీడను ప్రదర్శించిన సెయింట్ జోన్స్ హై స్కూల్ విద్యార్థి

కంకాల దిలీప్ ను అభినందించిన కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

ఈనెల 13వ తారీకు రోజున మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ ఎంపిక క్రీడలలో పాల్గొని తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడాలలో పాల్గొనడం జరిగింది దిలీప్ తన అత్యున్నతమైన క్రీడాను ప్రదర్శించి తెలంగాణ జట్టు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది,దిలీప్ యొక్క విజయాన్ని సెయింట్ జాన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ ఫాదర్ అల్లం శ్రావణ్ కుమార్ రెడ్డి, దిలీపును సన్మానించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఏం వెంకటేశ్వర్లు ఎన్ మహేష్ లు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెస్క్యు టీం ఏర్పాటు..

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెస్క్యు టీం ఏర్పాటు

పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

లోతట్టు ప్రాంతాలను, డంపింగ్ యార్డ్ పరిశీలించిన కమిషనర్

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కే.సుష్మ పారిశుధ్య పనుల నిర్వహణను ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం కార్మికుల హాజరు పుస్తకాన్ని పరిశీలించి అలసత్వంతో విధులకు హాజరువ్వని వారికి గైర్యాజరు వేశారు.వర్షాకాలాన్ని ద్రుష్టిలో పెట్టుకొని పారిశుధ్యం పైన మరియు లోతట్టు ప్రాంతాలలో నిలిచిఉన్న నీటిని ఎప్పటికప్పుడు మల్లించాలని జవాన్ లకు సూచించారు.అనంతరం డంపూయార్డ్ ను పరిశీలించి చెత్తను సేకరించే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని,పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిస్క్యు టీంను ఏర్పాటు చేశామన్నారు.ఏదైనా సమస్యలు తలెట్టితే స్థానిక జవాన్ లు మహేష్(9550629997),సతీష్(7386881788),రాజు(9177557767)గల నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.

తుది జట్టులో డాసన్‌.

తుది జట్టులో డాసన్‌

భారత్‌తో ఈనెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ప్రకటించారు. చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ స్థానంలో…

నాలుగో టెస్టుకు ఇంగ్లండ్‌ టీమ్‌

మాంచెస్టర్‌: భారత్‌తో ఈనెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ప్రకటించారు. చేతి వేలి గాయంతో జట్టుకు దూరమైన స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ స్థానంలో 35 ఏళ్ల లెఫ్టామ్‌ స్పిన్నర్‌ లియామ్‌ డాసన్‌కు చోటు కల్పించారు. లార్డ్స్‌ టెస్టులో ఆడిన ఇంగ్లండ్‌ జట్టులో ఇదొక్కటే మార్పు కావడం గమనార్హం. దీంతో డాసన్‌ ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడబోతున్నాడు. కెరీర్‌లో తను మూడు టెస్టులు ఆడగా 2017లో చివరిసారి దక్షిణాఫ్రికాపై బరిలోకి దిగాడు.

 

తుది జట్టు: స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రాలే, డకెట్‌, రూట్‌, పోప్‌, బ్రూక్‌, స్మిత్‌, వోక్స్‌, డాసన్‌, కార్స్‌, ఆర్చర్‌.

ఇంగ్లండ్‌ నిలిచింది.

ఇంగ్లండ్‌ నిలిచింది

భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్‌ సివర్‌ సేన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన…

లండన్‌: భారత మహిళలతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ జట్టు తమ ఆశలను సజీవంగా నిలుపుకొంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన రెండో వన్డేలో నాట్‌ సివర్‌ సేన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం సిరీ్‌సలో ఇరు జట్లు 1-1తో నిలవగా.. ఆఖరి మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది. వర్షం కారణంగా నాలుగు గంటలు ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. మంధాన (42), దీప్తి శర్మ (30 నాటౌట్‌) మాత్రమే రాణించారు. ఎకెల్‌స్టోన్‌కు 3.. ఎర్లాట్‌, లిన్సే స్మిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 రన్స్‌గా నిర్ణయించారు. ఓపెనర్లు అమీ జోన్స్‌ (46 నాటౌట్‌), బ్యూమంట్‌ (34)ల ధాటికి ఇంగ్లండ్‌ 21 ఓవర్లలో 116/2 స్కోరుతో మ్యాచ్‌ను ముగించింది.

ఫీజులో కోత.. ఓ డీమెరిట్‌ పాయింట్‌..

ఫీజులో కోత.. ఓ డీమెరిట్‌ పాయింట్‌

ఇంగ్లండ్‌ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్‌ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు.

ప్రతికా రావల్‌కు జరిమానా

దుబాయ్‌: ఇంగ్లండ్‌ మహిళలతో తొలి వన్డేలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియా బ్యాటర్‌ ప్రతికా రావల్‌కు జరిమానా విధించారు. భారత ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ప్రతిక.. సింగిల్‌ తీసే క్రమంలో ప్రత్యర్థి బౌలర్‌ లారెన్‌ ఫిలర్‌ను ఢీకొట్టింది. అంతేగాకుండా తర్వాతి ఓవర్‌లో తాను అవుటవగానే ప్రతిక.. మరో బౌలర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో లెవెల్‌ 1 తప్పిదం కింద ప్రతికకు మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్‌ పాయింట్‌ను కేటాయించారు. అదే మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్‌ జట్టు సభ్యులకు మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోత విధించారు.

అప్పుడే ఎంత ఎదిగావు తల్లీ..

అప్పుడే ఎంత ఎదిగావు తల్లీ

కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్‌ జంట మనస్పర్థల కారణంగా…

న్యూఢిల్లీ: కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్‌ జంట మనస్పర్థల కారణంగా 2018లో విడిపోయినప్పటినుంచి ఐరా తల్లి వద్ద ఉంటోంది. ‘నువ్వు ఇంత త్వరగా ఎదిగావంటే నమ్మలేకపోతున్నా. జీవితంలో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. భగవంతుడు నీకు ప్రేమ, ఆనందం, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఐరాతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల నీ సన్మానించిన జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జ్యోతి పండాల్ తన నివాసంలో ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యులని సన్మానించడం జరిగింది. 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసి ఏ బి సి డి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి అండగా ఉండి వారికి సహాయం అందించి, అలాగే మొన్న మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను జరుపుకున్న సందర్భంగా పార్టీలకి అతీతంగా అందరి నాయకులను పిలిచి సన్మానించి వారి మంచి మనసుని చాటుకున్నారు, వారి మంచి మనసుని అభినందిస్తూ మన జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులని మరియు ఇన్చార్జిలందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన తీన్మార్ మల్లన్న బీసీ మీటింగ్ కి చాలా కృషి చేసి ఆ మీటింగ్ని చాలా విజయవంతం చేసినందుకు గాను తీన్మార్ మల్లన్న టీం సభ్యులకి కూడా సన్మానం జరిగింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో ఒక్క మీటింగ్ తో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి మన జహీరాబాద్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిన పవర్ ఫుల్ టీం కి జ్యోతి పండాల్ అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ ఇన్చార్జి నరసింహ, శ్రీకాంత్, హనుమంతు, రాకేష్, ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, జయరాజ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, నిర్మల్ కుమార్ మాదిగ మొగుడంపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, టింకు మాదిగ జహీరాబాద్ మండల ఇన్చార్జ్ ఎమ్మార్పీఎస్, సుకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి జహీరాబాద్, జీవన్ మాదిగ ఎమ్మార్పీఎస్, రాఘవులు, సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్..

టీమ్‌లో నుంచి అతడ్ని తీసెయ్.. పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడ్ని తీసెయ్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో విజయానికి చేరువలో ఉంది టీమిండియా. ఇంకో 7 వికెట్లు తీస్తే గెలుపు మనదే. లీడ్స్ టెస్ట్‌లో ఓడి సిరీస్‌లో 0-1తో వెనుకబడిన గిల్ సేన.. తాజా మ్యాచ్‌లో ఐదో రోజు గనుక చెలరేగి ఆడితే సిరీస్‌ను సమం చేయొచ్చు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టేందుకు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలసి స్కెచ్ వేస్తున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఏయే బ్యాటర్‌ను ఎలా ఔట్ చేయాలా? అని పథకాలు రచిస్తున్నాడు. ఈ తరుణంలో అతడ్ని తీసెయ్ అంటూ పంత్‌తో గంభీర్ మాట్లాడుతున్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

కపిల్ శర్మ షోలో గంభీర్, పంత్, అభిషేక్ శర్మ సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంత్-కపిల్ మధ్య సాగిన జోక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ శాలరీ (రూ. 27 కోట్లు) అందుకున్నావ్ కదా.. నీ టీమ్‌లో ఏదైనా తక్కువ వేతనం అందుకునే ఆటగాడు నీ కంటే బాగా ఆడితే ఏం చేస్తావంటూ పంత్‌ను ఆటపట్టించాడు కపిల్. నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ కంటే ఇంకెవరైనా బాగా కామెడీ చేస్తే ఏం చేస్తావంటూ కపిల్‌కు రివర్స్‌ కౌంటర్ వేశాడు పంత్. వీళ్ల మధ్య ఇలా జోక్స్ సాగుతుండగా మధ్యలో గంభీర్ కలుగజేసుకున్నాడు.

టీమ్‌లో నుంచి అతడ్ని తీసేస్తానని చెప్పమంటూ పంత్‌కు సూచించాడు గంభీర్. నీ కంటే ఎవరైతే బాగా ఆడతారో ఆ ప్లేయర్‌ను డ్రాప్ చేస్తానని చెప్పమని గంభీర్ అన్నాడు. దీంతో పంత్, అభిషేక్, కపిల్ సహా షోలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. గంభీర్ ఎక్కువగా సైలెంట్‌గా ఉంటాడు. అలాంటోడు జోక్ వేయడం, అది బాగా పేలడంతో అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంత్-గంభీర్ మామూలోళ్లు కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగానే అమల్లో పెడతారా? ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్…

 

టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.

ఇంగ్లండ్ పర్యటనను పరాభవంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్టులో ఓటమి గిల్ సేనను నిరాశలో ముంచేసింది. అయితే వెంటనే తేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. స్టోక్స్ సేన బెండు తీసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో మెన్ ఇన్ బ్లూకు అండగా నిలబడుతున్నాడో ఇంగ్లండ్ స్టార్. సొంతజట్టుకు వ్యతిరేకంగా, గిల్ సేనకు అనుకూలంగా పని చేస్తున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
మైండ్‌సెట్ ముఖ్యం..

భారత జట్టు ఆటగాళ్లకు సాయం చేస్తున్నాడు ఇంగ్లండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్. స్పిన్నర్లకు అంతగా అచ్చిరాని ఇంగ్లీష్ కండీషన్స్‌లో వికెట్లు ఎలా తీయాలో నేర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ బయటపెట్టాడు. ‘కెవిన్ పీటర్సన్ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఇంగ్లండ్‌లో ఎలా రాణించాలో చెప్పాడు. ఇక్కడి ఫీల్డింగ్ పొజిషన్స్, పిచ్‌ల గురించి అర్థం అయ్యేలా వివరించాడు. ఎలాంటి మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేయాలో సూచించాడు అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం
తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది
గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ ట్రాక్ సర్జరీ అవసరం ఉంది అని చెప్పారు
హాజర హాస్పిటల్ dr ఉషిక కిరణ్ యూరలజిస్ట్ తో ఫోన్లో మాట్లాడి సర్జరీకి సహకరించని విజ్ఞప్తి చేశారు
పైడిమల్ల ఐలయ్య గీత కార్మికుడు తడిచేట్టు మీదనుండి పడితే కాలు విరిగింది వారిని చూసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తేలుకోవడం జరిగింది టీం సభ్యుడు నాగరాజు కూతురు లాస్య వికలాంగురాలు కావున పెన్షన్ రావడంలేదని చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మాట్లాడి తప్పకుండా పెన్షన్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది
మెదరమెట్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ స్కూలుకు విద్యార్థులు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలని అలాగే గ్రామ ప్రజలు గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపించాలని పవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్నవారు గునీకంటి విష్ణు కొడారి రాజు గజ్జి కుమారస్వామి కొడారి రమేష్ కొణికటి దీక్షిత్ పెంతల రాజు p రాజేందర్ ఎడకుల సురేష్ పైడిమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు..

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు.. మార్క్రమ్ ఎమోషనల్!

 

 

 

 

 

ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.

సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం.. గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా పరిస్థితి ఇది. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడాల్లేకుండా ప్రతి ఫార్మాట్‌లోనూ అదరగొట్టడం, మేజర్ టోర్నమెంట్స్‌లో నాకౌట్స్ వరకు దూసుకురావడం.. కీలకపోరులో చతికిలపడటం వాళ్లకు ఓ సంప్రదాయంలా మారింది. దీంతో వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలా మంది అనుకున్నారు. అయితే అంతా రివర్స్ అయింది. చెలరేగి ఆడిన బవుమా సేన.. కంగారూలను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ హీరో ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఆసీస్‌పె చిరస్మరణీయ విజయం సాధించడంతో మార్క్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2025 ఫైనల్‌ను తలచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతుల్లో ఓడటంతో తనకు నిద్రపట్టలేదన్నాడు. ఆ పోరులో ఔట్ ‌అయ్యాక ఒంటరిగా కూర్చొని ఉండిపోయానని, ఆ క్షణం చాలా నిస్సహాయంగా అనిపించిందన్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నానని, ఇలాంటి సమయం వస్తే అలా కూర్చోకూడదని, అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యానని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

‘నిన్న మొత్తం టీ20 ప్రపంచ కప్ గురించి ఆలోచించా. ఔట్ అయ్యాక నిస్సహాయంగా ఎలా కూర్చున్నానో గుర్తొచ్చింది. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని నిర్ణయించుకున్నా. ఇది నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆసీస్‌తో పోరులో క్రీజులో పాతుకొనిపోయా. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, జట్టు గెలుపు కోసం సాధ్యమైనంతగా పోరాడాలి అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేశా’ అని మార్క్రమ్ వ్యాఖ్యానించాడు.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక…

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. (The raja saab) జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.
లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసే వాళ్లపై  కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్‌ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్‌ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్‌ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

మొదలుపెట్టిన టీమిండియా..

మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

 

నేటిధాత్రి:

 

 

 

 

భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.

వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురూ లేని భారత టెస్ట్ జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్నీ తామై నిలిచారీ త్రిమూర్తులు. మన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

 

బెండు తీయడం ఖాయం!

ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్‌‌తో పాటు ఫుట్‌బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్‌, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్‌తో పాటు ఇటు ఫిట్‌నెస్ డ్రిల్స్‌ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు.ఇంగ్లండ్ గ్రౌండ్స్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాళ్లతో చర్చిస్తూ కనిపించాడు. అటు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లండ్ జట్టు బెండు తీసేందుకు లండన్‌లో ల్యాండ్ అయిన భారత బృందం.. ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తాము వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.

 

డీఎస్పీని కలిసిన ఎన్హెచ్ఎరిసి బృందం.

డీఎస్పీని కలిసిన ఎన్హెచ్ఎరిసి బృందం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డిఎస్పీని ఎన్హెన్ఆర్సి బృందం కలవడం జరిగింది. వారికి జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థులు, యువకులు మాదకద్రవ్యాలకు పాల్పడకుండా, మైనర్లు టూవీలర్స్ కానీ పోర్ వీ లర్స్ వాహనాలు నడపటం జరుగుతుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయి. కావున వీటిపై దృష్టి సారించాలని కోరారు. లైసెన్స్ లేని వాహనాలు ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఐర్సి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్పవర్, వారితోపాటు సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి సి. వీరేందర్, న్యాల్కల్ మండల చైర్మన్ రాజనర్సింహా, ఏఐటీఎఫ్ మొగుడంపల్లి ఇంచార్జీ రవీందర్ రాథోడ్, మహేష్, ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం.

నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన దేశిని కోటి బృందం

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణ సిఐ గా బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ సిఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దేశిని స్వప్న కోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తాజా మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారెపల్లి బిక్షపతి, దేశిని రాధా సదానందం ఎలగందుల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేతా రమేష్, పొన్నగంటి సారంగం, కుదాడి రాజయ్య, బుల్లి పూలమ్మ మొగిలి,దిడ్డి రామ్మోహన్,రావికంటి రాజు,తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి నారు.

క్రికెట్ టోర్నమెంట్ 2025 విన్నర్ గా ఈగల్ టీం .!

పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 విన్నర్ గా ఈగల్ వారియర్స్ టీం

విజేతలకు బహుమతులు అందజేసిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

ఎల్తూరి సమృత వర్ధన్ చిన్ను ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆదివారం రోజు ఫైనల్ కు చేరుకుంది.ఫైనల్ లో పరకాల ఈగల్ వారియర్స్ టీం విన్నర్ గా పైడిపల్లి టీం రన్నర్ ఆఫ్ గా నిలిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరై ఫైనల్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,వినాయక హాస్పిటల్ యజమాని సతీష్,ఎన్ఎస్ఆర్ పవన్ కుమార్,మంద టునిట్,టాటా ఏఐజి పరకాల టీం మామిడి చక్రపాని,దారా సతీష్,పిట్టా సునీల్,అఖిల్,సిద్దు,ఏకు బాబు తదితరులు పాల్గొన్నారు.

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం.

రిస్క్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మే 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మార్కెట్లోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, ఫిబ్రవరి 22న నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ ఎల్ బి సి) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు రెడ్డి శ్రీనివాస్, సానబోయిన శ్రీనివాస్ వర్కర్స్ షేర్ గ్రూప్ తరఫున ఘనంగా సన్మానించారు.

ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదం భారతదేశంలో అత్యంత క్లిష్టమైన రక్షణ చర్యలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సి సి ఎల్) నుండి 60 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బంది పంపించబడ్డారు. ఈ సిబ్బంది అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ బాడీ (ఐ ఎం ఆర్ బి) సభ్యులుగా ఉన్నారు .
ప్రమాదం జరిగిన తర్వాత, రక్షణ చర్యలు 63 రోజులపాటు కొనసాగాయి. ఈ సమయంలో రెండు మృతదేహాలు వెలికితీయబడ్డాయి, అయితే మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీం సభ్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, సహచరుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తించి, మే డే సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మానం కార్మికుల సేవలను గుర్తించి, వారికి గౌరవం చూపించే ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో వాకర్ టీం సభ్యులు అందరూ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version