మొగుడంపల్లి మండల్ సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం
◆-: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్, గుడ్పల్లి గ్రామంలో ఊరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మైనారిటీ కూడా సర్పంచ్ గా పోటీ చేసిన చరిత్ర లేదు కానీ టీఆర్పీ పార్టీ మొగుడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ లతీఫ్ గారు చరిత్రకి బిన్నంగా ధైరంగా ముందుకు వచ్చి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది.అలాగే లతీఫ్ గారు గుడ్పల్లి గ్రామ సమస్యల పైన మంచి అవగాహన కలిగిన వ్యక్తి మరియు తనని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామం అభివృధి కోసం ఎంతవరకైనా మరియు ఏ లీడర్ తోనైనా పోరాడి గ్రామ అభివృద్ధి చేస్తాను అని చెప్పడం జరిగింది.
లతీఫ్ నామినేషన్ వేసి బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థుల్లో దడ పుట్టించారు, అందుకే బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ వాళ్లు ఎన్ని ప్రలోభాలకు గిరి చేసిన కూడా, ప్రలోభాలను గడ్డి పోస లాగా పక్కన పెట్టి ముందుకు సాగడం చూస్తుంటే ధైర్యం లో తీన్మార్ మల్లన్న గారికి ఏ మాత్రం తీసిపోరు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.ఈ నెల 14-12-2025 రోజున బ్యాగ్ గుర్తుకే ఓటు వేసి లతీఫ్ గారిని గెలిపించాలని వారు ప్రజలను కోరడం జరిగింది.తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో ఉన్న నాయకులు గాని మరియు కార్యకర్తలు గాని ధైర్యానికి ప్రతిరూపమని లతీఫ్ మరొకసారి నిరూపించారు.సర్పంచ్ అభ్యర్థి లతీఫ్ గారికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్, సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి వరప్రసాద్, మొగుడంపల్లి మండల్ అధ్యక్షుడు శీను, మొగుడంపల్లి మండల నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
