ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్,మంగళారపు లక్ష్మణ్,పుస్తె శ్రీకాంత్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
