ఘనంగా జరుపుకున్న హోలీ పండుగ…

ఘనంగా జరుపుకున్న హోలీ పండుగ

జహీరాబాద్ నేటి ధాత్రి:

హోలీ పండుగ సందర్భంగా న్యాల్కల్ మండల మల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఏపీజే అబ్దుల్ కలాం ట్యూషన్ సెంటర్ ప్రొఫెసర్ జల్గొండ అనిల్ నిర్వహించిన ఉట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, మాజీ ఎంపిటిసి శివానంద శ్రీపతి పాల్గొన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జలగొండ మారుతి, మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి, ఏపీజే అబ్దుల్ కలాం ట్యూషన్ ప్రొఫెసర్ జలగొండ అనిల్, యువజన నాయకులు శ్రీకాంత్, నగేశ్, సిద్దు, ఆకాష్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు పండ్ల పంపిణీ…

భక్తులకు పండ్ల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన భక్తులు మహా రాష్ట్రలోని తుల్జాపూర్ భవానీమాత ఆలయా నికి పాదయాత్రగా తరలివెళ్తున్నారు. వీరికి న్యాల్కల్ మండలంలోని మల్లి గ్రామ మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి స్థానిక నాయకు లతో కలిసి శుక్రవారం స్వాగతం పలికి జాతీయ రహదారిపై పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు విట్టల్, దత్తు, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయం వరకు భక్తుల పాదయాత్ర

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుండి భక్తులు లోక కళ్యాణర్ధం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తుల్జా భవాని ఆలయ వ్యవస్థాపకులు జాదవ్ మహేందర్ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా తుల్జాపూర్ అమ్మవారి చెంతకు సుమారు 220 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదిన అనంతరం పాదయాత్ర చేపడుతున్నట్లు గోపాల్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version