“నర్సంపేటలో వైభవమైన పల్లివేట”

వైభవంగా అయ్యప్పస్వామి పల్లీవేట కార్యక్రమం

పల్లివేట దాతగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగిన నర్సంపేట

కార్యక్రమం నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శంకరన్ నంబూద్రి

నర్సంపేట, నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాల్లో భాగంగా సోమవారం అయ్యప్ప స్వామి పల్లి వేట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పల్లివేట,మహా అన్నదానదాతగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వ్యవహరించగా అయ్యప్ప స్వామి సర్వ సైన్యాధ్యక్షునిగా రాణా ప్రతాప్ రెడ్డి శిష్యుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ వ్యవహరించారు. నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పదేవాలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగరికొండ మాధవ శంకర్, అధ్యక్షులు సైఫా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా

ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పల్లివేట కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమ నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శ్రీమాన్ బ్రహ్మశ్రీ, శంకరన్ నంబూద్రి, హైదరాబాద్ మహా శాస్త్ర సేవ సంఘం ట్రస్ట్ బాధ్యులు,గురుస్వామి డాక్టర్ సుధగాని రాజుగౌడ్, నర్సంపేట దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో చేశారు. ముందుగా దేవా ట్రస్టు ఆధ్వర్యంలో గణపతి హోమం తోపాటు పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు.ముఖ్య అతిథిగా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి అనుచరుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తలపై ఎత్తుకొని అలంకరణ చేసిన ఊరేగింపు ప్రత్యేక వాహనాల్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా శబరిమలై నుండి హాజరైన వాయిద్య కళాకారులు, మనిషి వివిధ వేషాదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయ్యప్పస్వామి ఊరేగింపుగా పట్టణంలోని మున్సిపాలిటీ ఆదరణ పార్క్ వద్ద పూంగివనంలో తాంత్రిక వేత్త మేల్ శాంతి శంకరన్ నంబూత్రి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పల్లివేటలో భాగంగా మున్సిపాలిటీ ప్రాంగణం ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్టులో అచ్చ దయాకర్ అయ్యప్ప విగ్రహాన్ని తలపై ఎత్తుకొని వేటకు వెళ్లే విధానాన్ని ప్రదర్శించారు.నర్సంపేట పట్టణంలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే ఆగుపడ్డాయి.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాలదారులు భక్తులు చేపట్టిన అయ్యప్పస్వామి శరణు ఘోషతో పట్టణం మారుమ్రోగింది.

 

డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం ప్రజలు రైతులు అన్ని వర్గాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ధర్మాన్ని కాపాడడం వల్ల అదే ధర్మం మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కాట భాస్కర్, పలువురు అధికారులు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు , జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,రాష్ట్ర ఓబిసి మోర్చ అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,ములుగు జిల్లా నాయకులు కృష్ణవేణి,మండలాల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్,ప్రధాన కార్యదర్శులు,ఉపాధ్యక్షులు, యువ మోర్చ జిల్లా,నియోజకవర్గ నాయకులు , దేవాలయ గురు స్వాములు,ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప మాలదారులు, భక్తులు, పాల్గొన్నారు.

నర్సంపేట నడిబొడ్డున అక్రమ కట్టడాలు…

నర్సంపేట నడిబొడ్డున అక్రమ కట్టడాలు

మద్యం దుకాణాల కోసం రోజుల వ్యవధిలోనే కట్టడాలు పూర్తి?

చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ అధికారులు

కిందిస్థాయి అధికారుల కనుసనల్లో అక్రమ కట్టడాలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం ఒక వైపు ఉంటే కిందిస్థాయి అధికార సిబ్బంది సహకారంతో అక్రమ కట్టడాలు రోజుల వ్యవధిలోని పూర్తవుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు ఈనెల 1 నుండి కొలువుదీరగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులు కొత్త దుకాణాలు నూతన భవనాల్లో ఓపెన్ చేసేందుకు మున్సిపల్ శాఖ నుండి ఏలాంటి అనుమతులు తీసుకోకుండానే రోజుల వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. నర్సంపేట పట్టణంలోని రాంరాజ్ థియేటర్ గల కాళీ స్థలంలో భారీ అక్రమ కట్టడ నిర్మాణాలను పూర్తి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే వరంగల్ రోడ్డు లో గల ఒక పెట్రోల్ బంకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో 15 రోజుల్లోనే మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం శివారులో నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారికి అనుకొని ఉన్న ఓ పెట్రోల్ బంకు ప్రక్కన గల ఒక వ్యవసాయ భూమిలో పత్తి చేనును తొలగించి నాలా కన్వెన్షన్ చేయకుండా అలాగే మున్సిపాలిటి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి ఏకంగా మధ్యన దుకాణాన్ని ప్రారంభించారని ఆరోపణలు వెలివేస్తున్నాయి. పేదవాళ్లు చిన్నపాటి గోడ నిర్మించాలంటేనే మున్సిపాలిటీ అధికారుల పర్మిషన్ లేకుండా ఇటుక పెడ్డ వరుస కూడా పెట్టనివ్వని పరిస్థితుల్లో రోజుల వ్యవధిలోని అక్రమ నిర్మాణాలు పూర్తవుతుండనపై మున్సిపాలిటీ అధికారులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అక్రమ నిర్మాణాల పట్ల మున్సిపాలిటీలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది అధికారుల కనుసనల్లోనే ఈ అక్రమ కట్టడాల వ్యవహారాలు నడుస్తున్నాయని విశ్వసనీయ సమాచారం. నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కాటా భాస్కర్ ను వివరణ కోరగా వాటికి పర్మిషన్లు ఉన్నాయో లేవో నాకు తెలవదు నేను తెలుసుకొని మీకు చెప్తాను. ఇప్పుడు వాటిని వాటి గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎందుకనగా సీఎం ప్రోగ్రాం ఉన్నందున మేము బాగా బిజీగా ఉన్నాము అని వివరణ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T190528.291.wav?_=1

 

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలి

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈనెల 5న నర్సంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యా,వైద్యం, రోడ్లు,త్రాగునీరు,సాగునీరు పలు ప్రభుత్వ రంగసంస్థల భవనాల నిర్మాణాలను చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎంతో ఒప్పించి నియోజకవర్గ అభివృద్ధికీ 1000 కోట్ల నిధులను తీసుకచ్చారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి సభను విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషిచేసి రాష్ట్రంలోనే అత్యధిక సర్పంచ్ స్థానాలను మన నియోజకవర్గంలో గెలిపించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గౌరవ ప్రతిష్టలు చాటే బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడిపై ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గౌడ్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫిక్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, చెన్నారావుపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద నరేష్, ఖానాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొల్లం హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గద్ద అఖిల్, మహమ్మద్ సల్మాన్, దేశి సాయి పటేల్, మచ్చకంటి మనోజ్ కుమార్, మంచాల హరీష్, గద్ద నిఖిల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాలకు ఓంకార్ పేరుతో నామకరణం చేయాలి…

మెడికల్ కళాశాలకు ఓంకార్ పేరుతో నామకరణం చేయాలి

కలెక్టర్ కార్యాలయంలో ఎంసిపిఐ(యు) పార్టీ వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

పీడిత ప్రజల హక్కులకై, భూమి బుక్తి విముక్తి కోసం జీవితాంతం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ఆదర్శాలు, త్యాగాలు,రాజకీయ విలువలను భవిష్యత్త్ తరాలకు అందించే విధంగా పాఠ్యాంశంలో చేర్చుతూ నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పేరుతో నామకరణం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.అలాగే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి ఓంకార్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు.అందుకుగాను
ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు విలువలు కోల్పోయి వ్యాపారమయంగా మారాయన్నారు.
ఆనాటి నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ విముక్తి కోసం పనిచేసిన అగ్ర గన్యుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అని గుర్తుకు చేశారు.ఉమ్మడి రాష్ట్ర ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ గా పిలిపించుకున్న గొప్ప మహానేత అని అలాంటి వీరుడి చరిత్రను నాడు నేడు భవిష్యత్తులో ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మెడికల్ కళాశాలతో పాటు, స్టేడియానికి నామకరణం చేసి నర్సంపేట వరంగల్ రోడ్డుకు ఓంకార్ మార్గ్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి మాలోత్ సాగర్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చుంచు జగదీశ్వర్,జిల్లా నాయకులు ఐతమ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

రూ.1000 కోట్ల నిధుల పనులకు సీఎం శంకుస్థాపనలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T162511.209.wav?_=2

 

రూ.1000 కోట్ల నిధుల పనులకు సీఎం శంకుస్థాపనలు

ఈ నెల 5న నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి,సీపీ సన్ ప్రిత్ సింగ్,డీసీపీ అంకిత్ కుమార్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలో ఈ నెల 5న సుమారు 1,000 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయుటకోసం వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్ ల్యాండింగ్, భారీ బహిరంగ సభ స్థలాలను మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ లతో కలిసి పరిశీలించారు.కార్యక్రమంలో ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి,ఎస్బి ఏసీపీ జితేందర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,డాక్టర్ పులి అనిల్,నర్సంపేట సొసైటి చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలీ,గంధం నరేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు రూపిక శ్రావణ్ కుమార్, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పబ్బతి సతీష్ రెడ్డి, పోతారబోయిన చంద్రమౌళి, బాణాల శ్రీనివాస్, మేరుగు కిరణ్, గద్ద అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వ ఘటం…

స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వ ఘటం.

తెలంగాణ ఉద్యమ నేత,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణ స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వఘట్టమని తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.దీక్ష దివస్ కార్యక్రమం నేపద్యంలో నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలలతో అమరులకు శనివారం నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజునే దీక్ష దివస్ గా అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టమని అన్నారు.ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలని,తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని తెలిపారు.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఈ దీక్ష దివస్ నిలుస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.
దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు.సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ దీక్షా దివస్ కలిపిందన్ని వివరించారు.
ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందే మో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోచల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు త్రొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలమన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటనారాయణ గౌడ్ ,రాయిడి రవీందర్ రెడ్డి,నల్ల మనోహర్ రెడ్డి,డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి,నాగిషెట్టి ప్రసాద్,మండల శ్రీనివాస్, దేవోజు సందనందం, మద్దెల సాంబయ్య గౌడ్, బగ్గి రాజు,పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మోహమ్మద్ తన్వీర్ జన్మదిన శుభాకాంక్షలు

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని మంకల్ బ్లాంకెట్ హాల్లో మీసేవ ఆపరేటర్ సునీల్ గారి కూతురి మెదటి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్షింతలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాములు నేత బిజీ సందీప్ మొహమ్మద్ మోయిన్ బాల్ రెడ్డి సుధీర్ వినయ్ శనవాస్ తదితరులు ఉన్నారు,

అన్ని మండలాల్లో దీక్షా దివాస్

అన్ని మండలాల్లో దీక్షా దివాస్ నిర్వహించాలి

తెలంగాణ చరిత్రలో ప్రత్యేక గుర్తు దీక్షా దివాస్

మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

దశాబ్దంన్నర క్రితం భారత్ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కె.సి.ఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలలో 29 న శనివారం దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివాస్‌ను పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

ముదిరాజ్ సహకార సంఘ భవనం ప్రారంభం

ముదిరాజ్ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనం రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించగా శుక్రవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పిసిసి సభ్యులు పెండెం రామానంద్,పిఎస్ సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి, నియోజకవర్గ నాయకులు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పూలే ఆశయాలకు ఘన నివాళులు

జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

సామాజిక న్యాయదిక్సూచి మహాత్మా
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కోరబోయిన కుమారస్వామి హన్మకొండ శ్రీధర్ అన్నారు. సిపిఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అయన 135వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఎన్నో త్యాగాలుచేసి సాధించిన ఎన్నో హక్కులను నేటి పాలకులు మెజార్టీ ప్రజలకు దక్కకుండా చేస్తున్నారు. ప్రైవేటికరణ, ప్రపంచీకరణ, పట్టనీకరణకు పాలకుల దోపిడితోడై ప్రజల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, కలకోట అనిల్, బిట్ర స్వప్న ,ఉదయగిరి నాగమణి, సరిత, యాక లక్ష్మి, సంతోష్, రవి, ఎడ్ల శివకుమార్, ఐటిపాముల వెంకన్న, వీరన్న, ప్రశాంత్, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో

ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ పట్ల డెమో

నర్సంపేట,నేటిధాత్రి:

 

అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నర్సంపేట అగ్నిమాపాక కేంద్రం ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్టీసీ డిపి వద్ద ఫైర్ సేఫ్టీ డెమో ప్రదర్శించారు.
ఆర్టీసీ డిపోలో గాని ఆయిల్ బంక్ వద్ద అలాగే ఎలక్ట్రీకల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిపో ఉద్యోగులకు డెమో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ,నర్సంపేట ఫైర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అయూబ్,డిపో సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

బాలాజీ స్కూల్‌లో సంవిధాన్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్ లో సంవిధాన్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్ (సీబీఎస్ఈ )లో సంవిధాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ వేషధారణతో వచ్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు- ప్రజల బాధ్యత గురించి చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం దేశ పౌరులకు అనుగుణంగా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు. ప్రజలందరికీ న్యాయం ,స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం నేడు ప్రత్యేకతని ,భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని రూపశిల్పి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యాంగా మారడానికి పునాదయిందని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విలువలు, బాధ్యతలపై ప్రజలలో అవగాహన పెంచడం లక్ష్యంగా తోడ్పడుతుందని గుర్తు చేశారు.స్కూల్( సీబీఎస్ఈ) ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015 ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు.అనంతరం ఎన్.సి.సి పదవ బెటాలియన్ థర్డ్ ఆఫీసర్ ఎం. డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ప్రజల బాధ్యత పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించినారు.ఈకార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు మరియు ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అనిల్ కుమార్ ,సతీష్ ,అర్లయ్య, చందు, కవిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

27 ఏళ్లకే ఉద్యానంలో డాక్టరేట్ సాధించిన మహేష్

హర్టికల్చర్ లో డాక్టరేట్ పొందిన ఊరటి మహేష్

వెంకటాపురం గ్రామస్తుల హర్షం వ్యక్తం

అతిచిన్న వయస్సులో పీహెచ్ డీ పొందిన డాక్టర్ మహేష్.

సంతోషం వ్యక్తపరిచిన తల్లిదండ్రులు.

నర్సంపేట,నేటిధాత్రి:

ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.

డాక్టరేట్ ప్రదానం చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ

 

ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్‌.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.
విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్
విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.

డాక్టర్ ఊరటి మహేష్ ఫైల్ ఫోటో

పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకందని నష్టపరిహారం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T143537.394.wav?_=3

 

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకందని నష్టపరిహారం

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల పట్ల నష్టపరికారం ఇవ్వక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని బారాస నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆరోపించారు.మోంథా తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు.మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. నామాల సత్యనారాయణ మాట్లాడుతూ తూఫాన్ వల్ల నష్ట పోయిన పత్తి,మొక్కజొన్న,వరి ఇతర పంటలకు ఎకరాకు రూ.25 వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరైతుకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలు ఈర్ల నర్సింహారాములు,మోతే జైపాల్ రెడ్డి,మోటూరి రవి,కోడారీ రవి,బండారి రమేష్,మాజీ సర్పంచ్ గొడిశాల రాంబాబు,మండల పార్టీ ఉప అధ్యక్షుడు అల్లి రవి,లక్నేపల్లి గ్రామ పార్టి అధ్యక్షుడు పత్కాల కొమ్మలు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుమారస్వామి,మండల యూత్ సహాయ కార్యదర్శి బుస శ్రీశైలం,నాగుర్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు సోమర్తి రాజు,రాజులపాటి ఐలయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

నూతన హైర్ బస్ ప్రారంభించిన ఆర్టీసీ డీఎం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T153546.661.wav?_=4

 

నూతన హైర్ బస్ ప్రారంభించిన ఆర్టీసీ డీఎం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ఆర్టీసీ డిపోలో నర్సంపేట నుండి వరంగల్ పల్లెవెలుగు హైర్ బస్సును వరంగల్ జిల్లా హైర్ బస్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ అద్వర్యంలో
తెలంగాణ అద్దె బస్సుల గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్ తో కలిసి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి ప్రారంభించారు.డిపో మెనేజర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైనా రవాణ కోసం ఈ సర్విస్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. సురక్షితమైన ప్రాయణం కోసం ఆర్టిసి సేవలను ఉపాయోగించుకోవాలని కోరారు. ఈ కార్యకమంలో వరంగల్ రీజినల్ కన్వీనర్ మారపేల్లి రామ్ రెడ్డి లింగారెడ్డి, డిపో హెడ్ గార్డ్ వీరారెడ్డి, గోవర్ధన్, వేముల రవి, మేడిపల్లి వెంకన్న,అశోక్ రెడ్డి, శ్రీనివాస్, రాంబాబు, రాము,భాస్కర్ రెడ్డి,లక్కం వేణు, కట్ల ప్రశాంత్,లక్కం శ్రీను, బండారి సుమన్,ఎస్ రవిందర్, రంజిత్, రాజేశ్వర్ తదితర డిపో సిబ్బంది పాల్గొన్నారు.

కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ…

కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ

ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

నర్సంపేటకు చేరుకున్న సిపిఐ బస్సు యాత్ర

నర్సంపేట,నేటిధాత్రి:

 

కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమాజంలో ప్రజలకు రక్షణ ఉంటుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల బస్సు యాత్ర గురువారం నర్సంపేటకు చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో పంజాల రమేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రానున్న రోజులలో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలు చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సిపిఐ ఉద్యమిస్తున్నదని పేర్కొన్నారు. అనేక రంగురంగుల జెండాలు వచ్చి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని,
ఎన్నికల సమయం లో ఉచిత హామీలు ఇచ్చి గద్దెనెక్కి దోపిడీ వర్గాలకు పాలకవర్గాల కొమ్ముకాస్తున్నాయన్నారని ఆరోపించారు.

పెదోళ్లకు ప్రభుత్వ విద్య అందుకోవడం లేదని కార్పొరేట్ విద్యా సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారా అందిస్తున్నాయని తెలిపారు.గడిచిన వందేళ్లలో ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత సిపిఐ పార్టీ కే దక్కుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు మాట ఇచ్చి తప్పిందని చెప్పారు.దేశంలో కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని లేకపోతే పాలక పార్టీలు ధనిక , బహుళ జాతి కంపెనీల కొమ్ము కాస్తయి అన్నారు.నర్సంపేట పట్టణంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన గుడిసేవాసులకు నేటికీ పట్టాలు ఇవ్వలేదని ప్రభుత్వాలను దుయ్యబట్టారు.గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం వెనుకబడుటానికి ప్రభుత్వాలే కారణమని ఎరువుల ధరలు పెరిగిన నియంత్రించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు అన్నారు . దేశంలో సమస్యలు పరిష్కారం జరగాలంటే పేదవాని రాజ్యాస్థాపన కోసం పోరాటం చేయక తప్పదని చెప్పారు.ర్రజెండా పార్టీలు ఏకతాటి పైకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చెందే విధంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ నాయకులు రహమాన్, సిపిఐ వరంగల్,హనుమకొండ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శులు ఎస్కే బాష్మియా, కర్రి బిక్షపతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆధార శ్రీనివాస్, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు అయిత యాకయ్య, కందిక చెన్నకేశవులు,అక్కపెళ్లి రమేష్, జిల్లా సమితి సభ్యులు మియాపురం గోవర్ధన్, చింతకింది కుమారస్వామి, అనంతరెడ్డి వీరు నాయక్, గడ్డం నాగరాజు,పిట్టల సతీష్,ఇల్లందుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మహాఅన్నదాన కార్యక్రమం…

ఘనంగా మహాఅన్నదాన కార్యక్రమం

మరోసారి దేవాలయంలో అన్నదానం

అయ్యప్ప స్వామి దేవాలయానికి 108 కుర్చీల బహుకరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం 25 వ మండల పూజల వేడుకల్లో భాగంగా మంగళవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నది.అన్నదాతలుగా రూప ఇండస్ట్రీస్ యజమాని చకిలం శారద కృష్ణమూర్తి, బిర్రు రాజేశ్వరి సునీల్ కుమార్, దాసరి పద్మ జయేందర్ రెడ్డి ఉన్నారని దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు,ఆలయ పూజారులు,గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.

పదోసారి దేవాలయంలో మహా అన్నదానం..

నర్సంపేట మండలంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనులు నిర్వహిస్తున్న బిర్రు రాజేశ్వరి సునీల్ కుమార్ గత పది సంవత్సరాలుగా దేవాలయంలో జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమంలో అన్నదాతలుగా ఉంటున్నారని అయ్యప్ప దేవాలయ ట్రస్ట్ కమిటీ పేర్కొంటూ ఆయనను సన్మానించారు.

దేవాలయానికి 108 కుర్చీల బహుకరణ.

నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, అయ్యప్ప దేవాలయ గురుస్వామి మిడుదొడ్డి బాబురావు 25 వేల రూపాయల విలువ చేసే 108 కుర్చీల బహుకరణ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపారు.

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి..

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ సందర్భంగా కామ్రేడ్ సిపి రెడ్డి రాసిన ఏరిన రచనలు అనే
పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ నందు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.రాజేందర్ మాట్లాడుతూ
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవోద్యమంలో చేసిన కృషి గొప్పదని,దేశ చరిత్రలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటంలో చెరగని ముద్రవేశారని అన్నారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఐఎఫ్టియు నర్సంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్,గొర్రె ప్రదీప్, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు అశోక్,పివైఎల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి,ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భోగి సారంగపాణి, నాయకులు కొంపెల్లి సాంబన్న,భద్రాజి, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ విగ్నేశ్వర ఎఫ్పిఓ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ సోమవారం పట్టణంలోని ఎన్టిఆర్ నగర్ వద్ద ప్రారంభం చేశారు.ఎఫ్పిఓ అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి అధ్యక్షతన జరుగగా రామానంద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరైన కాంట పద్ధతి ద్వారా కొనుగోలు చెయ్యాలని తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంధ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలుగూరి మధుకర్,ఎఫ్పిఓ డైరెక్టర్ చింతల సాంబరెడ్డి,బుర్ర మోహన్ రెడ్డి, చిలువేరు వెంకటేశ్వర్లు,కమిటీ సభ్యులు చిలువేరు కొమ్మలు, కొమురయ్య, రేమిడి శ్రీనివాస్, లింగాల సూరయ్య,శంకర్,హనుమయ్య, గాంగడి రాజమ్మల రెడ్డి, ఈక సత్యరాయణ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T161355.180.wav?_=5

 

ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని గల కమలాపురం శ్రీ వెంకటేశ్వర రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ అభిబ్, కిసాన్ కాంగ్రెస పట్టణ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ వర్కింగ్ పంబి వంశీకృష్ణ, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, ప్రధాన కార్యదర్శి గద్ద జ్యోతి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, శ్రీ వెంకటేశ్వర రైతు సంఘం అధ్యక్షులు ముత్తినేని వీరయ్య, ప్రధాన కార్యదర్శి కోరే మల్లేష్, కార్యదర్శి కంచు రవి, కోశాధికారి లోడె పెద్దరాజు, పూజారి సారంగం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version