ఘనంగా మహాఅన్నదాన కార్యక్రమం
మరోసారి దేవాలయంలో అన్నదానం
అయ్యప్ప స్వామి దేవాలయానికి 108 కుర్చీల బహుకరణ
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం 25 వ మండల పూజల వేడుకల్లో భాగంగా మంగళవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నది.అన్నదాతలుగా రూప ఇండస్ట్రీస్ యజమాని చకిలం శారద కృష్ణమూర్తి, బిర్రు రాజేశ్వరి సునీల్ కుమార్, దాసరి పద్మ జయేందర్ రెడ్డి ఉన్నారని దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు,ఆలయ పూజారులు,గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.
పదోసారి దేవాలయంలో మహా అన్నదానం..
నర్సంపేట మండలంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనులు నిర్వహిస్తున్న బిర్రు రాజేశ్వరి సునీల్ కుమార్ గత పది సంవత్సరాలుగా దేవాలయంలో జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమంలో అన్నదాతలుగా ఉంటున్నారని అయ్యప్ప దేవాలయ ట్రస్ట్ కమిటీ పేర్కొంటూ ఆయనను సన్మానించారు.
దేవాలయానికి 108 కుర్చీల బహుకరణ.
నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, అయ్యప్ప దేవాలయ గురుస్వామి మిడుదొడ్డి బాబురావు 25 వేల రూపాయల విలువ చేసే 108 కుర్చీల బహుకరణ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపారు.
