అన్ని మండలాల్లో దీక్షా దివాస్ నిర్వహించాలి
తెలంగాణ చరిత్రలో ప్రత్యేక గుర్తు దీక్షా దివాస్
మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
దశాబ్దంన్నర క్రితం భారత్ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కె.సి.ఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో’ అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలలో 29 న శనివారం దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివాస్‌ను పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
