కాంగ్రెస్ సర్కారు రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ నిరసన…

కాంగ్రెస్ సర్కారు రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ నిరసన

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నీరసిస్తూ
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కురాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ
బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశంతో మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చౌరస్తా వద్ద పెద్దెత్తున ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు గంటకు పైగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహరావు, మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్రమ కేసులు, సిట్ నోటీసులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు సిగ్గుచేటని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతోందని అన్నారు. ఇలాంటి చర్యలకు ప్రజలు తగిన సమయంలో చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు ఉడుత సాంబయ్య తోట రాకేష్ కొడారి హైమ ధనంజయ్ గ్రామ కమిటీ అధ్యక్షులు హఫీజ్ వెంకటేష్ కృష్ణ రాజ్ కుమార్ గాద శేఖర్ రాం నరసింహారావు మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి నాయకులు భైరగాని కుమారస్వామి డాక్టర్ జానయ్య మార్త శీను పేరాల దేవేందర్రావు పెంచాల రవీందర్ పల్లె వేణి సదయ్య గాజర్ల చింటూ వీసం భరత్ రెడ్డి బొట్ల స్వామి పాపిరెడ్డి మన్తుర్తి భద్రయ్య కొడారి ఓదెలు పేరాల భాస్కరరావు ఆకుల తిరుపతి నల్లబెల్లి సంపత్ రావు తిప్పని విష్ణు పబ్బ రవి మామిండ్లసాంబయ్య జయపాల్ కొత్తపల్లి కుమార్ జంజర్ల రాకేష్ రామకృష్ణ వాజిద్ అభి సాయిరాం తదితరులు పాల్గొన్నారు..

స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వ ఘటం…

స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వ ఘటం.

తెలంగాణ ఉద్యమ నేత,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణ స్వరాష్ట్ర సాధన లో దీక్ష దివస్ అపూర్వఘట్టమని తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.దీక్ష దివస్ కార్యక్రమం నేపద్యంలో నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలలతో అమరులకు శనివారం నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో” అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజునే దీక్ష దివస్ గా అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టమని అన్నారు.ఈ నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలని,తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని తెలిపారు.తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఈ దీక్ష దివస్ నిలుస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.
దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు.సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ దీక్షా దివస్ కలిపిందన్ని వివరించారు.
ప్రత్యేక తెలంగాణ కళ కలగానే మిగిలిపోతుందే మో అన్న సమయంలో, అమరవీరుల నెత్తురుతో వారి త్యాగాలతో తెలంగాణ నేల తడిసి ముద్దవుతున్న సమయంలో ఎత్తిన జెండా విడవకుండా, పదవులను గడ్డి పోచల్లా విసురుతూ తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర నినాదం ఇంకా బలంగానే ఉందని అనేకసార్లు నిరూపించి త్యాగాలకు త్రొవ్వచూపిన తీరు చరిత్ర పుటల్లో పదిలమన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటనారాయణ గౌడ్ ,రాయిడి రవీందర్ రెడ్డి,నల్ల మనోహర్ రెడ్డి,డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి,నాగిషెట్టి ప్రసాద్,మండల శ్రీనివాస్, దేవోజు సందనందం, మద్దెల సాంబయ్య గౌడ్, బగ్గి రాజు,పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version