ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకందని నష్టపరిహారం
నర్సంపేట,నేటిధాత్రి:
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల పట్ల నష్టపరికారం ఇవ్వక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని బారాస నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆరోపించారు.మోంథా తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు.మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. నామాల సత్యనారాయణ మాట్లాడుతూ తూఫాన్ వల్ల నష్ట పోయిన పత్తి,మొక్కజొన్న,వరి ఇతర పంటలకు ఎకరాకు రూ.25 వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరైతుకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలు ఈర్ల నర్సింహారాములు,మోతే జైపాల్ రెడ్డి,మోటూరి రవి,కోడారీ రవి,బండారి రమేష్,మాజీ సర్పంచ్ గొడిశాల రాంబాబు,మండల పార్టీ ఉప అధ్యక్షుడు అల్లి రవి,లక్నేపల్లి గ్రామ పార్టి అధ్యక్షుడు పత్కాల కొమ్మలు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుమారస్వామి,మండల యూత్ సహాయ కార్యదర్శి బుస శ్రీశైలం,నాగుర్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు సోమర్తి రాజు,రాజులపాటి ఐలయ్య తదితర రైతులు పాల్గొన్నారు.
