77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. అలియాబాద్, ముడుచుతులపల్లి ఎల్లంపేట, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్లు చంద్రశేఖర్, పవన్ కుమార్, స్వామి నాయక్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తో పాటు అధికారులు, మేడ్చల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రష్యా యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి లతోపాటు వివిధ కార్మిక సంఘాలు ఆటో యూనియన్ ప్రైవేట్ సంస్థల వద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అలియాబాద్ శ్రీరామ ఆటో యూనియన్ వద్ద అధ్యక్షుడు పులి జగదీష్ జెండాను ఎగరవేశారు.
