ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.!

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో

గణపురం నేటిధాత్రి

గణపురం మండలo చెల్పూరు గ్రామం లో ధర్నా చేసిన జర్నలిస్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు. జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు.

“జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు’

బీఆర్ఎస్ నాయకుల దొంగ ఏడుపు మానుకోవాలి.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు

ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

 

 

జూరాల ప్రాజెక్ట్ గురించి పని పాట లేని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు, రేపే ప్రాజెక్టు కూలిపోతుందాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను పార్టీ ప్రతిష్టను దెబ్బ చేసేందుకు, BRS పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక తప్పుడు రాతలు రాసిందన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంను కాంగ్రెస్ హయంలో 1981లో ప్రారంభిస్తే.. 1995లో ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందన్నారు.
62 గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు జూరాల ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేక, జూరాల గేట్ల అంశాన్ని గోరంతది కొండంత చేసి చూపిస్తున్నారన్నారు.
పని పాటా లేకుండా ఖాళీ తిరుగుతున్న కేటీఆర్ వాస్తవాలకు సంబంధం లేకుండా, ఏదీ దొరికితే దాన్ని ట్విట్టర్ లో పెట్టి శునకానందం పొందుతున్నారన్నారు.
జూరాల పైన మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టినట్లు 2019లో బయటపడ్డ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
2021లో గేట్ల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
గేట్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు 2018లో రూ.19 కోట్ల అంచనాలతో అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపించారు, అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో 2022లో రూ.11 కోట్లతో టెండర్లు అప్పటి ప్రభుత్వం పిలిచి, చేతులు దులుపుకుందన్నారు.
గత రెండేళ్ల నుంచి కృష్ణా ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పటికిప్పుడు జూరాల గేట్ల కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, 10 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినా గేట్ల కు ఏమీ కాదని ఇంజనీర్లు తెలియజేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ కు లక్ష క్యూసెక్ ల వరద మాత్రమే వస్తోంది.. జూరాల పైన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఏడుపులు ఆపాలన్నారు. 10 ఏళ్ల పాటు జూరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు దావత్ చేసుకోవడానికి వెళ్లి, జూరాల వద్ద షో చేశారు. ప్రాజెక్ట్ వద్ద అసలు మోటర్లే బిగించలేదు, పైగా కరెంటు బిల్లు వస్తుందన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ప్రారంభించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించడం  తగదన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!

ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!

 

నేటిధాత్రి, బ్రేకింగ్, వరంగల్…

 

100 ద్వారా పోలీసులకు పిర్యాదు చేసిన బంధువులు

మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన హాస్పిటల్ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి

సారి చెప్పి సద్దుమనిగించే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యం

గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినట్లు సమాచారం

హనుమకొండ “కూరపాటి రమేష్ హాస్పిటల్లో” పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ అనుచితంగా ప్రవర్తించిన తీరు..

సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి తన పట్ల డాక్టర్ ప్రవర్తించిన తీరును తెలిపారు. వెంటనే భర్త 100ద్వారా స్థానిక పోలీసులకు పిర్యాదు.

హాస్పిటల్ చేరుకున్న పోలీసులు విచారణ జరిపినట్లు సమాచారం..

విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు హాస్పిటల్ చేరుకోగా, ఇది మా కుటుంబ సమస్య అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు సదరు డాక్టర్..

ఈలోగా హాస్పిటల్ ఇన్చార్జి అని చెప్పుకొనే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీడియా పట్ల దురుసు ప్రవర్తన.. మేము సర్ది చెప్పుకుంటాం, మీరు ఎక్కువ చేస్తున్నారు బయటకు వెళ్ళండి అంటూ వ్యంగ్య మాటలు..

శ్రీకాంత్ రెడ్డి తీరు పట్ల సదరు డాక్టర్ రమేష్ కు ఫోన్ ద్వారా తెలుపుటకు ప్రయత్నించగా ఫోన్ ఆన్సర్ చేయని డాక్టర్ రమేష్..

గతంలో కూడా హాస్పిటల్ లో కొందరు మహిళా ఉద్యోగినిలపై ఇలాగే దురుసుగా ప్రవర్తించారని, మహిళా సిబ్బందిపై చేతులు వేసేవారిని, హాస్పిటల్ లో పనిచేసి మానేసిన కొందరు ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు…

తన కింద పనిచేసే వారిపై బానిసంగా చూస్తూ, ఇష్టం వచ్చినట్లు దుర్భాషాలాడిన ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళా ఉద్యోగులు కోరుతున్నారు..

దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను.!

దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

చిట్యాల, నేటిధాత్రి :

సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ అద్యక్షతన సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ లు* మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు మారినా అధికారులు మారిన దళితులపై దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అనేక సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నుంచి విఫలం అయినందున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వేంటనే దళిత స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు* రాబోయే రోజుల్లో గ్రామాల్లో దళితులపై దాడులు దౌర్జన్యాలు అదికంగా జరుగుతాయని వారు అన్నారు అందుకే అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామ స్థాయి నుంచి దళిత బడుగు బలహీన వర్గాలను చైతన్య వంతులను చేస్తు గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలన్నారు. అందుకే చిట్యాల మండల కమిటీని ఈనెల 22 శుక్రవారం రోజున ఎన్నుకోవడం* జరుగుతుందని మండల వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులు మేదావులు ఉద్యోగులు శ్రేయోభిలాషులు మిత్రులు కుల మతాలకు అతీతంగా SC,ST BÇ మైనారిటీ* కులాలు కమిటీ ఎన్నికకు హాజరు కావాలని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ మండల సాంస్కృతిక కార్యదర్శి వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ గుర్రపు తిరుపతి శీలపాక ప్రణిత్ కట్కూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version