తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తాం
ఆత్మకూర్ పర్యటనలో సి ఎం
రేవంత్ రెడ్డి
వనపర్తి నేటిదాత్రి .
సోమవారం నాడు వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనలో ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ లోపలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో ఆత్మకూరు పట్టణ అభివృద్ధి పనులకు, రూ.15 కోట్ల అమరచింత అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లు చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటరు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఆత్మకూరు మున్సిపాలిటీ పి. జె.పి క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కె. అరవింద్ ప్రసాద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డకి స్వాగతం పలికార రాష్ట్ర మంత్రులు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోమటి రెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి వనపర్తి జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి ,ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ శశిధర్ అధికారులు పాల్గొన్నారు
