మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి…

మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం బలవంత భూసేకరణ అన్యాయం…. మోరే రవీందర్ రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి

నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మొగులపల్లి మండల కేంద్రంలోని రైతులను అక్రమంగా అరెస్టు చేసి బలవంతంగా తమ భూమిలోని చొరబడి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మొగులపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతమున్నటువంటి మార్కెట్ విలువ ప్రకారము పరిహారం చెల్లించాలని కానీ తమకు తక్కువ పరిహారము చెల్లించడం అన్యాయమని మొగులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి నబాబుపేట గ్రామంలో 27 లక్షల 50 వేల రూపాయలు చెల్లించి మొగులపల్లి మండల కేంద్రానికి కేవలం 22 లక్షల 50 వేలు చెల్లించడం ఏంటని అంతేకాకుండా మొగులపల్లి మండలంలోని రంగపురం గ్రామానికి నోటిఫికేషన్ తర్వాత ఆ గ్రామానికి 21,50,000 నిర్ణయించి మండల కేంద్రానికి 22 లక్షల 50 వేలు నిర్ణయించి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారము ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు చేపట్టిన తర్వాత రంగపురం గ్రామానికి నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకొని 29 లక్షల 60000 మండల కేంద్రానికి తక్కువ ధర నిర్ణయించడం ఎంతవరకు

సబవని వెంటనే మండల కేంద్రానికి మిగతా గ్రామాల కంటే ఎక్కువ ధర చెల్లించాలని లేనిచో ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అరెస్టు చేసి ఎన్ని రోజులు మమ్ములను ఆపగలరని మా వారసత్వంగా వస్తున్నటువంటి మా తాత ముత్తాతల నుండి మా కుటుంబాలకు జీవనాధారముగా నుండి భూమిని కోల్పోవడం చాలా అన్యాయమని మా కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పోలీసులతో బలవంతపు భూసేకరణ చేపట్టినటువంటి తాసిల్దారు గారు మొగలపల్లి మండల కేంద్రానికి ఎందుకు వివక్షత అని ఆ మండల కేంద్రానికి కూడా సరైన ధర నిర్ణయించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు బండారి రవీందర్ అరికాంతపు కృష్ణారెడ్డి కొల్లూరు మనోహర్ స్వప్న అడ్డూరి రాజేందర్ గుండా బిక్షపతి గుర్రపు సునంద రెడ్డి ముడుపు మల్లారెడ్డిమోరే పద్మ మోరే అనూష చిలకామారి బొంద్యాలు గుర్రపు తిరుపతిరెడ్డి బోయిన కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారుa

మక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనలు

మక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసనలు

23 న నెక్కొండ, నర్సంపేట, నల్లబెల్లిలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళనలు

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం

మద్దతు ధర లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు

రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది.గురువారం నెక్కొండ, నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లోని మక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటివరకు జీవో జారీ చేయలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో నర్సంపేట ప్రాంతంలో 42 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం కేవలం 6 కేంద్రాలకే పరిమితమైందని విమర్శించారు.దాదాపు 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, రైతులకు 45 నుంచి 90 రోజుల వరకు చెల్లింపులు వాయిదా వేస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 2400 మద్దతు ధరకు బదులుగా రూ. 1600 నుంచి 1800 మధ్యే విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు.గన్ని సంచుల కొరతతో 45 డిగ్రీల ఎండలో రైతులు రోడ్లపై అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో సుమారు 70 వేల ఎకరాల్లో ఈ యాసంగిలో మక్కజొన్న సాగు జరిగిందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం సరిపడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధరకు మక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేపటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరిస్థితులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version