పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు..

పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు

ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అన్ని గ్రామాల్లో ఊపం దుకున్న పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేష న్లు దాఖలు చేయడం, ఉపసం హరణ కావడం వంటి మూడవ హంకానికి తెరబడింది. ఎన్ని కల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కు అధికారులు గుర్తులు కేటాయించడంలో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం మొదలైంది. మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతుంది పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది.ఇప్పటికే కథనరం గం లో నువ్వా!నేనా!అన్న విధంగా దిగిన కొందరు అభ్యర్థులు అంతర్గతంగా ప్రచారం మంది మార్బలంతో హంగు, ఆర్భాటoతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కేటాయించిన గుర్తులను ఓటర్లకు చూపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

గమ్మత్తైయిన గుర్తుల గురించి ప్రజలకు చెప్పడం

సర్పంచ్ వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈసారి గమ్మత్తయిన గుర్తులు వచ్చాయి ఇదివరకు జరిగిన ఎన్నికల్లో కేటాయించిన గుర్తులను కొన్నింటిని తొలగిస్తూ కొత్త గుర్తులు చేర్చారు వేలిఉంగరం , కత్తెర ,బ్యాట్, ఫుట్ బాల్, హ్యాండ్ బ్యాగ్ పర్స్, రిమోట్ ,టూత్ పేస్ట్, స్పానర్, డస్ట్ బిన్, గౌను, గ్యాస్ పొయ్యి స్టూలు, గ్యాస్ సిలిండర్, బీరు వా,విజిల్ వంటి గుర్తులను చూసి గమ్మత్తైనగుర్తులు వచ్చా యని ఓటర్లు అనుకుంటు న్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కేటాయించిన గుర్తులను చూపిస్తూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

సమస్యలు ఆలోచించే సమయం వచ్చింది

మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెడద , కుక్కల బెడద విపరీతంగా ఉంది. మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు .దాని నివారణ చర్యలు చేపట్టే వారికి దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో ఆలోచించే సమయం వచ్చింది.దృష్టిలో పెట్టుకొని ఓటుహక్కు వినియోగించుకో వాలని ప్రజలు ఆలోచిస్తు న్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

 

 

 

 

వీరిలో 90% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నవారు.కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి, విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి.

 

 

 

 

 

ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల భారం మోయలేనటువంటి పరిస్థితి, అదే విధంగా ఇప్పుడు వర్షాకాలం సీసన్ గనుక ఒకవేళ వర్షం పడితే స్కూల్ కి వెళ్లలేనటువంటి పరిస్థితి మరియు చిన్నపిల్లలకు బుక్స్ మోయడం భారం అవుతుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.కొంతమేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

 

 

 

ఈ కార్యక్రమంలో భీమనాధుని సత్యనారాయణ బిసి సంఘం జిల్లా అధ్యక్షులు, వైనాల శోభన్ బాబు రజక సంఘం, వైనాల శంకర్ రజక సంఘం, సంతోష్ ముదిరాజ్ సంఘం, ముత్యాల రవికుమార్ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, మరియు ధర్మ స్టూడెంట్ యూనియన్ జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీకృష్ణ, జేఏసీ సభ్యులు మంద రమేష్, కండె రవి బొజ్జ పెళ్లి మహర్షి, పుల్ల అశోక్, కుర్రి స్వామినాథన్, దూడపాక రాజు నేరెళ్ల రమేష్ పర్లపల్లి కుమార్ దాసరపు భాస్కర్, మట్టవాడ కుమార్, లాపాక రవి, ఎంజలా శ్రీనివాస్, పందిళ్ళ రమేష్,గుండ్ల రాజకుమార్,సంజీవ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version